Apple Ber Cultivation : సంప్రదాయ పంటల స్థానంలో కాశ్మీర్ యాపిల్ బేర్ సాగు

కాశ్మీర్‌ యాపిల్‌ బేర్‌ పండు చూడటానికి గంగరేగు పండును పోలి ఉంటుంది. కానీ అది గంగరేగు కాదు. యాపిల్‌ను పోలి ఉంటుంది. అయినా అది యాపిల్‌ కాదు. ఈ రెండింటినీ పోలినట్టుండేదే.. కాశ్మీర్‌ యాపిల్‌ బేర్‌. తినగానే చాలా మధురంగా ఉంటుంది. ఈ పంట సాగు ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది.

Apple Ber Cultivation : సంప్రదాయ పంటల స్థానంలో కాశ్మీర్ యాపిల్ బేర్ సాగు

Kashmir Apple Ber Cultivation

Apple Ber Cultivation : వినూత్నంగా ఆలోచించడమే కాదు.. దాన్ని ఆచరణలో పెడితేనే విజయం. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు. సంప్రదాయ పంటల స్థానంలో ప్రయోగాత్మకంగా ఎకరం పావులో కాశ్మీర్ యాపిల్‌బేర్‌ సాగు చేపట్టారు. ప్రస్తుతం పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఇతర పంటలతో పోల్చితే మంచి లాభదాయకంగా ఉందంటున్నారు. ఈ రైతు సాగును చూసి చుట్టుప్రక్కల రైతులు సైతం యాపిల్ బేర్ సాగుకు సమాయత్తమవుతున్నారు.

READ ALSO : Cashew Cultivation : జీడి రైతులను ముంచిన అకాల వర్షాలు

పసుపు, ఎర్రజొన్న పంటల సాగులో వరుసగా వస్తున్న నష్టాలు సాగు వద్దనుకునేలా చేశాయి. అయితే.. సామాజిక మాధ్యమాల్లో కొత్త రకం రేగు పంట ఈ రైతుని ఆకర్షించింది. ఇంకేముంది బంగ్లాదేశ్ నుండి మొక్కలను తెప్పించి  ప్రయోగాత్మకంగా ఎకరంపావు పొలంలో కశ్మీర్ యాపిల్ బేర్ ను సాగు చేశారు. వ్యవసాయంపై మక్కువతో పాటు.. కొత్త విధానాల్ని ఆకలింపు చేసుకుంటే ఏ పంటైనా పండించవచ్చని నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మంథని గ్రామ రైతు చిన్నయ్య.

కాశ్మీర్‌ యాపిల్‌ బేర్‌ పండు చూడటానికి గంగరేగు పండును పోలి ఉంటుంది. కానీ అది గంగరేగు కాదు. యాపిల్‌ను పోలి ఉంటుంది. అయినా అది యాపిల్‌ కాదు. ఈ రెండింటినీ పోలినట్టుండేదే.. కాశ్మీర్‌ యాపిల్‌ బేర్‌. తినగానే చాలా మధురంగా ఉంటుంది. ఈ పంట సాగు ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. సంప్రదాయ సాగుకు భిన్నంగా వ్యవహరించే వాళ్లు మాత్రమే ఇలాంటి పంటలపై ఆసక్తి చూపుతూ.. కష్టాన్ని ఇష్టంగా చేసుకొని, నాలుగు రూపాయలు వెచ్చించి అయినా సఫలమవుతుంటారు.

READ ALSO : Mixed Farming : రైతుకు భరోసానిస్తున్న మిశ్రమ వ్యవసాయం.. పలు పంటల సాగు విధానంతో స్థిరమైన ఆర్థిక వృద్ధి

ఈ కోలోనే రైతు చిన్నయ్య ప్రయోగాత్మకంగా ఎకరంపావులో సాగుచేపట్టారు. నాటిన 6 నెలలకే దిగుబడి ప్రారంభమైంది. పొలం కూడా రోడ్డుకు దగ్గరగా ఉండటంతో పొలంవద్దే పండ్లను అమ్ముతున్నారు. మిగితావి స్థానికంగా ఉండే సూపర్ మార్కెట్ లకు సప్లై చేస్తూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.

ఆర్మూర్ మండలంలో చాలా వరకు రైతులు పసుపు, ఎర్రజొన్న పంటలను పండిస్తుంటారు. అయితే నానాటికి పంటసాగులో పెట్టుబడులు పెరుగుతుండటం.. ఇటు మార్కెట్ లో మద్ధతు ధర లభించకపోవడంతో.. చుట్టుప్రక్కల రైతులు సైతం కాశ్మీర్ యాపిల్ బేర్ సాగుకు ఆకర్షితులవుతున్నారు. సంప్రదాయ పంటలతో పోల్చితే యాపిల్ బేర్ లాభదాయకంగా ఉండటంతో వీటి సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వం నుండి ప్రోత్సాహాకాలు అందించాలని కోరుతున్నారు.

READ ALSO : Agriculture : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని వదిలి వ్యవసాయం.. పుట్టగొడుగులతో లాభాలు

సంప్రదాయ పంటలతో పోల్చితే కాశ్మీర్ ఆపిల్ బెర్ సాగుతో ఎన్నోరెట్లు మేలంటున్నారు ఈ రైతులు . ఒక్కొక్క కాయ దాదాపు 75 నుంచి 150 గ్రామల బరువు ఉంటుంది. చీడపీడల వ్యాప్తి అంతగా ఆశించవు. నీట తడులు కూడా తక్కువగా అందించాలి. ఒక్కసారి నాటితే 20 ఏళ్లు వరకు దిగుబడి వస్తుంది. ఇలాంటి పంటలకు ప్రభుత్వం పొత్సహించాలని రైతులు కోరుతున్నారు.