Cultivation of watermelon : 8 ఎకరాల్లో పుచ్చ సాగు.. ఏడాదికి రూ. 20 లక్షల ఆదాయం

డిసెంబర్‌ నెలలో మాక్స్‌, 0024 రకానికి చెందిన విత్తనాలను నాటారు. బెడ్ విధానంలో, డ్రిప్‌ ఏర్పాటు చేసి  ఎరువులు, నీటితడులు అందించారు. సెమీ ఆర్గానిక్‌ పద్ధతిలో పండిస్తుండటంతో అధిక దిగుబడులను పొందుతున్నారు. తోట వద్దే వ్యాపారులకు కిలో 10 రూపాయలపైనే  విక్రయించారు.

Cultivation of watermelon : 8 ఎకరాల్లో పుచ్చ సాగు.. ఏడాదికి రూ. 20 లక్షల ఆదాయం

Watermelon Cultivation

Cultivation of watermelon : వేసవి వచ్చిందంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది పుచ్చకాయలు. ఉష్ణతాపంతో ఉపశమనమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చే ఈ కాయకు మార్కెట్‌లో మండి డిమాండ్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తీగజాతి చెందిన పుచ్చును వేసవిలో అధిక విస్తీర్ణం సాగు చేస్తుంటారు.

READ ALSO : Intercrop Cultivation : పామాయిల్ లో అంతర పంటగా చెరకు సాగు

ఇప్పటికే దానిమ్మ సాగు చేస్తూ.. అధిక లాభాలను పొందుతున్న ఆనంతపురం జిల్లాకు చెందిన రైతు మోహన్ కుమార్.. పుచ్చ సాగు కూడా చేపట్టారు. సెమీ ఆర్గానిక్‌ పద్ధతిలో పండించడం ద్వారా పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వచ్చింది. తోట వద్దే వ్యాపారస్తులకు కొనుగోలు చేస్తుండటంతో, రవాణ ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగిందంటున్నారు రైతు.

మొత్తంలో 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు రైతు మోహన్ కుమార్‌. అనంతపురం జిల్లా, పుట్లూరు మండలం, ఎ.కొండాపురం గ్రామనికి చెందిన ఈయనకు పుచ్చసాగు విధానంలో 10 సంవత్సరాల అనుభవం ఉంది.

READ ALSO : Areca nut Cultivation : ఒక్కసారి నాటితే 20 ఏళ్ల వరకు దిగుబడి.. వక్కసాగుతో లాభాలు పక్కా

డిసెంబర్‌ నెలలో మాక్స్‌, 0024 రకానికి చెందిన విత్తనాలను నాటారు. బెడ్ విధానంలో, డ్రిప్‌ ఏర్పాటు చేసి  ఎరువులు, నీటితడులు అందించారు. సెమీ ఆర్గానిక్‌ పద్ధతిలో పండిస్తుండటంతో అధిక దిగుబడులను పొందుతున్నారు. తోట వద్దే వ్యాపారులకు కిలో 10 రూపాయలపైనే  విక్రయించారు.

ఎకరానికి 60, 70 వేల ఖర్చుతో వైరస్ తెగుళ్లను అధిగమించిన రైతు 25 టన్నులకు పైగా  దిగుబడి సాధిస్తున్నారు. కిలోకు సరాసరిన 10 రూపాయల ధర లభించినా రెండున్నర లక్షల ఆదాయం పొందుతున్నారు. తక్కువకాలంలో కేవలం రెండు మూడు నెలల్లో చేతికొచ్చే పుచ్చపండు, రైతుకు శ్రమకు తగ్గ ఫలితాన్నందిస్తోందనటంలో సందేహంలేదు.

READ ALSO : Sameekrutha Vyavasayam : కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు పెంచుతున్న ఏలూరు జిల్లా రైతు