Polyhouses : మూవింగ్ పాలిహౌస్ లతో సాగు.. బహుబాగు

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మూవింగ్ పాలిహౌస్ ల వల్ల రైతులకు ఎంతో మేలకలిగించేవి ఉన్నాయి. కాలానుగుణంగా కాకుండా ఏలాంటి కాలాల్లోనైనా పంటలను సాగుచేసుకునేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది

Polyhouses : మూవింగ్ పాలిహౌస్ లతో  సాగు.. బహుబాగు

Green Hose

Polyhouses : సేధ్యపు రంగంలో రాను రాను విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించిన రైతాంగం ప్రస్తుతం అధిక దిగుబడుల కోసం టెక్నాలజీ సమాయంతో ముందుకు కదులులుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఒక్కప్పడు పండించటానికి వీలుకాని పంటలను సైతం కాలాలతో సంబంధంలేకుండా పాలిహౌస్ విధానంతో సాగు చేస్తూ మంచి ఫలసాయం పొందుతున్నారు. ఇటీవలి కాలంలో పాలిహౌస్ విధానంలో సరికొత్త టెన్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అదే మూవింగ్ పాలిహౌస్ విధానం. దీని ద్వారా వాతావరణానికి అనుకూలంగా పాలిహౌస్ లను వినియోగించుకోవచ్చే వెసులుబాటు ఉంటుంది.

సాధారణ పాలి హౌస్ విధానంలో రైతాంగం అనేక సమస్యలను ఇప్పటిదాకా ఎదుర్కోవాల్సి వచ్చింది. పంటలకు అవసరమైన కార్బన్ డయాక్సైడ్ అందకపోవటం, తగినంత నీటి ఆవిరి మొక్కల నుండి విడుదల కాకపోవటం, పంటలు మెతకబారటం వంటివి చోటుచేసుకునేవి. ఒక్కో సందర్భంలో పాలిహౌస్ లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం వంటి సందర్భాల్లో పంటలకు నష్టం కలుగుతుంది. ఉదయం , సాయంత్రం వేళల్లో సూర్యరశ్మి పంటలను అందని పరిస్ధితులు ఉండేవి.

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మూవింగ్ పాలిహౌస్ ల వల్ల రైతులకు ఎంతో మేలకలిగించేవి ఉన్నాయి. కాలానుగుణంగా కాకుండా ఏలాంటి కాలాల్లోనైనా పంటలను సాగుచేసుకునేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది. తెగుళ్లు, పురుగుల బెడద తగ్గించుకోవచ్చు. సాగు ఖర్చు తగ్గటంతోపాటు, పంట కోత కాలం గణనీయంగా పెరుగుతుంది. ఏడాది పొడవున రైతులు నాణ్యమైన పంటలను ఈ మూవింగ్ పాలిహౌస్ విధానంలో పండించిన వచ్చు.

మూవింగ్ పాలిహౌస్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ దారులకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈ పాలిహౌస్ ను వాతావరణ పరిస్ధితులకు అనుగుణంగా పై కప్పును తెరచుకునేందుకు, మూసివేసేందుకు అనువుగా ఉంటుంది. ఇన్ ఫ్రారెడ్ రేడియేషన్ నుండి పంటను కాపాడుకోవచ్చు. వాతావరణం నుండి గాలి, కార్బన్ డై ఆక్సైడ్ సమతూకంగా పంటలను అందేందుకు అవకాశం ఉంటుంది. పంటలకు కావాల్సిన కాంతిని అందించవచ్చు. సేంద్రీయ విధానంలో సాగు చేయాలనుకునే వారికి ఈ మూవింగ్ పాలిహౌస్ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది. మొక్కలు ఆరోగ్యకరంగా పెరగటానికి అనుకూలంగా ఉంటుంది.

మూవింగ్ పాలిహౌస్ లో సెన్సార్ల అమరిక వల్ల వాటంతటవే తెరచుకోవటం, మూసుకోవటం జరుగుతాయి. వీటి ఏర్పాటుకు చదరుపు మీటరకు ఆటోమేషన్ స్ధాయిని బట్టీ 1500 రూపాయల నుండి 3000 రూపాయల వరకు ఖర్చవుతుంది. టమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలి, ఆకుకూరలు, మిర్చి, కీరదోస వంటి పంటలను ఈ మూవింగ్ పాలిహౌస్ లలో సాగు చేయవచ్చు. ఈ విధానం వల్ల రైతులకు పంట దిగుబడులు గతంలో కంటే పెరగటంతోపాటు మంచి అదాయం పొందగలుగుతున్నారు.