Decreasing Mango Yield : తగ్గిన మామిడి దిగుబడి.. ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలు

తొలినాళ్లలో కురిసిన వర్షాలు వలన మామిడిలో ఎర్లీ రకాలైన పనుకులు , సువర్ణరేఖ తొలిదశ పూత బాగానే వచ్చింది , కానీ ఫిబ్రవరిలో వచ్చిన తుఫాన్ వలన కురిసిన అకాల వర్షాలు కారణంగా పనుకులు , సువర్ణరేఖ లలో పూత పూర్తిగా దెబ్బతిన్నది.

Decreasing Mango Yield : వేసవిలో నోరూరించే మామిడి పండ్లు…రైతులకు మాత్రం చేదు మిగుల్చుతున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి ముగింపు వరకు రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయినా, చివరికి వారికి మిగిలేది అరకొర ఆదాయమే. ప్రకృతి కనికరిస్తే ఫర్వాలేదు, అదే కన్నెర్రజేస్తే.. కుదేలవ్వాల్సిందే. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే ప్రకృతి కన్నెర్ర జేయడంతో మామిడికి అపారనష్టం వాటిల్లింది.

READ ALSO : Mango Slices : మామిడికాయ ముక్కల ఎగుమతితో అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతులు

పూత, పిందె దశలో ఉంటుండగానే వచ్చిన అకాల వర్షాలు.. మామిడి రైతును కుదేలు చేశాయి. ఈ పరిస్థితిల్లో మిగిలిన పంటను రక్షించుకోవడంపై రైతులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 43 వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి.

గడచిన కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ ప్రభావంతో విస్తీర్ణం తగ్గినప్పటికీ, వ్యవసాయం చేయలేక చాలా మంది రైతులు తమ భూముల్లో పండ్ల తోటలను పెంచుతున్నారు. వీటిలో ప్రథమ స్థానం మామిడిదే. అయితే, జిల్లాలో రైతులు సొంతంగా మామిడి తోటల నిర్వహణ చేపట్టడం చాలా తక్కువ. ఎక్కువ భాగం తోటలు కౌలుదారుల చేతుల్లోనే ఉన్నాయి.

READ ALSO : Mango Fruit Covers : నాణ్యమైన దిగుబడి కోసం మామిడికి కవర్ తో రక్షణ

ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మామిడి వ్యాపారులతో పాటు, స్థానికంగా ఉన్న రైతులు, దళారులు… సీజన్లలో వచ్చి మామిడి తోటలను కౌలుకు తీసుకుంటుంటారు. జిల్లాలో అధిక భాగం విజయనగరం డివిజన్ లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. కొత్తవలస, ఎస్.కోట, జామి, నెల్లిమర్ల, డెంకాడ, గజపతినగరం, గుర్ల, గరివిడి మండలాల్లో అధికంగా మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి.

ఈ మండలాల్లో అధిక శాతం వర్షాధార భూములే కావడంతో మామిడి తోటల పెంపకాన్ని చేపడుతున్నారు. జిల్లాలో పండే మామిడి పండ్లకు మంచి గిరాకీ ఉంది. ఇక్కడ పండే మామిడి పండ్లు కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. సీజన్ కు ముందే దళారులు జిల్లాకు చేరుకొని, స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇక అప్పటి నుంచి సీజన్ ముగిసే వరకు ఇక్కడే తిష్టవేసి మామిడి రవాణాను కొనసాగిస్తారు.

READ ALSO : Mango Packing House : మామిడి ప్యాకింగ్ హౌస్ కి ఏపి ప్రభుత్వ సబ్సిడీ

బంగినపల్లి, సువర్ణరేక, కలెక్టరు, పణుకులు వంటి రకాలు జిల్లాలో అధికంగా పండుతాయి. అయితే, ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో వచ్చిన అకాల వర్షాలు, ఈదురుగాలులతో మామిడి రైతులు కుదేలయ్యారు.

తొలినాళ్లలో కురిసిన వర్షాలు వలన మామిడిలో ఎర్లీ రకాలైన పనుకులు , సువర్ణరేఖ తొలిదశ పూత బాగానే వచ్చింది , కానీ ఫిబ్రవరిలో వచ్చిన తుఫాన్ వలన కురిసిన అకాల వర్షాలు కారణంగా పనుకులు , సువర్ణరేఖ లలో పూత పూర్తిగా దెబ్బతిన్నది.

READ ALSO : Mango Farming : మామిడి తోటలకు ఆలస్యంగా పూత, కాత.. కాయలు నిలిచేందుకు శాస్త్రవేత్తల సూచనలు

రెండోదశ లో వచ్చిన పూత ఇప్పుడు పిందెకట్టుగా నిలబడి ఉంది. రైతులు సరైన జాగ్రత్తలు పాటించడం వలన ప్రస్తుతం ఉన్న పొగమంచు , ఉష్ణోగ్రతలలో హెచ్చు తగ్గులు వలన కలిగే నష్టాలను నివారించవచ్చని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు