Low Crop Yields : పంట దిగుబడులు తక్కువగా ఉన్న భూముల్లో రైతులు చేపట్టాల్సిన యాజమాన్యం!

ఈ నేలల్లో ఉన్న హానికరమైన లవణాలను తొలగించి పంటకు అనువుగా ఉండేలా తయారు చేసుకోవాలి. పొలాన్ని చిన్న చిన్న మడులుగా విభజించి నీరు పెట్టాడానికి , మురుగునీరు పోవటానికి కాలువలు చేసి మడిలో 15 సెం.మీ వలరకు నీరు పెట్టి దమ్ము చేయాలి. దీని వల్ల నేలలోని లవణాలు నీటిలో కరుగుతాయి.

Low Crop Yields : పంట దిగుబడులు తక్కువగా ఉన్న భూముల్లో రైతులు చేపట్టాల్సిన యాజమాన్యం!

Low Crop Yields : పంట దిగుబడులు బాగా ఉండాలంటే అందుకు అనుగుణంగా సాగు భూమి ఉండాలి. పంట దిగుబడి సాధారణ దిగుబడి కన్నా తక్కకువగా ఉంటే ఆ భూములను సమస్యాత్మక భూములు అంటారు. సాగు చేసే భూమిలో లోపాలను తెలుసుకోవటానికి తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. అనంతర లోపాలను సరిచేస్తే మంచి పంట దిగుబడులను పొంవచ్చు. తద్వారా అదాయాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు.

ముఖ్యంగా నేలలో పోషక పదార్ధాలు మొక్కకు అందటంలో ఉదజని సూచిక ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఉదజని సూచి 7.5వరకు ఉన్నప్పుడు అన్ని పోషక పదార్ధాలు మొక్కకు సులభంగా అందే స్ధితిలో ఉంటాయి. ఉదజని సూచి 6.5 కంటే తగ్గినా 7.5 కంటే పెరిగినా పోషక పదార్ధాలు వేరే రూపాల్లోకి మారిపోయి మొక్కకు అందని పరిస్ధితి ఏర్పడుతుంది. అన్ని పోషక పదార్ధాలు మొక్కకు లభించాలంటే ఉదజని సూచి 6.5 నుండి 7.5 మధ్యలో ఉండాలి. సాగుకు సమస్యాత్మంగా ఉన్న నేలలను ఆమ్ల నేలలు, చౌడు నేలలు ఇలా రెండు రకాలుగా విభజించాలి.

ఆమ్ల నేలలు ; ఉదజని సూచి 6.5 కంటే తక్కువగా ఉన్న నేలలను ఆమ్ల నేలలు అంటారు. వీటిలో భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్, తక్కువ మోతాదులో ఉంటాయి. కాల్షియం లోపాన్ని సరిదిద్దటానికి సున్నపురాయి, డోలమైట్ వాడుకోవాలి. బూమిని బాగా కలియదున్ని పొడి చేసిన సున్నాన్ని పొలం మీద చల్లాలి. పశువుల ఎరువు , సేంద్రీయ ఎరువు వేయటానికి 4 వారాల ముందు నీరు పెట్టాలి. ఇటువంటి నేలల్లో కాల్షియం అమ్మోనియం నైట్ట్రైట్ వాడుకోవచ్చు.

చౌడు నేలలు ; చౌడు నేలలను తెల్లచౌడు, పాల చౌడు నేలలుగా విభజించవచ్చు. తక్కువ వర్షపాతం, పంటసాగుకు ఉప్పునీటి వినియోగం, నేలలో మురుగునీరు పోవటానికి ఏర్పాట్లు లేకపోవటం వల్ల ఈ నేలలు చౌడు నేలలుగా మారతాయి. ఉప్పు నేల పైన తెల్లగా పేరుకుని ఉంటే వాటిని పాల చౌడు నేలలుగా పిలుస్తారు. ఈ నేలల్లో నీటిలో కరిగే క్లోరైడ్స్, సల్ఫేట్స్ వంటి లవణాలు తక్కువగా ఉంటే భూమి నిస్సారంగా మారుతుంది. విత్తనాలు మొలకెత్తవు.

యాజమాన్యం పద్దతులు ; ఈ నేలల్లో ఉన్న హానికరమైన లవణాలను తొలగించి పంటకు అనువుగా ఉండేలా తయారు చేసుకోవాలి. పొలాన్ని చిన్న చిన్న మడులుగా విభజించి నీరు పెట్టాడానికి , మురుగునీరు పోవటానికి కాలువలు చేసి మడిలో 15 సెం.మీ వలరకు నీరు పెట్టి దమ్ము చేయాలి. దీని వల్ల నేలలోని లవణాలు నీటిలో కరుగుతాయి. ఆనీటిని 4 రోజులు నిల్వ ఉంచిన తరువాత మురుగు కాలువల ద్వారా బయటకు పంపాలి. జీలుగ వంటి పచ్చిరొట్టె పైర్లను పెంచి పూతదశలో పొలంలో కలియ దున్నాలి.

చౌడు నేలల్లో అమ్మోనియం సల్ఫేట్, యూరియా, ఎరువులను వాడవచ్చు. విత్తనం పొలంలో విత్తే ముందు 0.1 శాతం ఉప్పు ద్రావణంలో 2గంటలు నానబెట్టాలి. దీని వల్ల ఉప్పు గాఢతను తట్టుకునే శక్తి విత్తనాలకు వస్తుంది. కారు చౌడు నేలల్లో ఉన్న సోడియం శాతాన్ని తగ్గించేందుకు జిప్సం, గంధకం , ఐరన్ సల్ఫేట్ లను వాడుకోవచ్చు. జిప్సంలో ఉండే కాల్షియం చౌడు భూముల్లో సోడియంను తొలగిస్తుంది. సల్ఫర్ ఉదజని సూచికను తగ్గిస్తుంది.