Organic Oil : గానుగ నూనె తయారీ పరిశ్రమలతో ఉపాధి పొందుతున్న వాసాలమర్రి యువకుడు

మార్కెట్ లో కిలో వేరుశనగ పల్లీలు 120 రూపాలకు పలుకుతున్నాయి. అంటే 13 కిలోల పల్లీలకు 1560 రూపాయలు అవుతుంది. వీటి నుండి ఐదున్నర లీటర్ల పల్లీనూనె తయారవుతుంది. ఈ నూనెను తీసేందుకు రెండున్నర గంటల సమయం పడుతుంది. వచ్చిన నూనెను లీటరు ధర రూ. 450 రూపాయల చొప్పున అమ్ముతున్నారు .

Organic Oil : గానుగ నూనె తయారీ పరిశ్రమలతో ఉపాధి పొందుతున్న వాసాలమర్రి యువకుడు

Organic Oil

Organic Oil : కరోనా ప్రభావం, మారుతున్న జీవనశైలి.. ప్రజల్లో క్రమంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెంచేసింది. బయట ఆహారాన్ని పక్కన పెట్టేసి.. ఇంట్లో స్వయంగా చేసుకునే వాటిపైనే ధృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా మనం నిత్యం వాడే వాటిల్లో నూనె చాలా ప్రధానమైనది. చాలా వ్యాధులకు ఇదే కారణం. మార్కెట్లో రకరకాల పేర్లతో ఆయిల్‌ విక్రయిస్తున్నా, చాలావరకు అనారోగ్యం చేకూర్చేవే. అయితే మారుతున్న విధానాలతో ప్రజలు గానుగ నూనెకు అలవాటుపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే చదువుకున్న యువత గానుగ పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అన్నదమ్ములు రెండు గానుగ యూనిట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నూనెను తయారుచేస్తున్నారు.

READ ALSO : Organic Fertilizers : వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులతోపాటు, ఖర్చులు తక్కువే!

నిన్న మొన్నటి దాకా యంత్రాల ద్వారా తయారు చేసిన రిఫైండ్ ఆయిల్ పైనే మోజు ఎక్కువ. వినియోగదారులు కూడా దానినే అధికంగా వినియోగించారు. ఇంకా చెప్పాలంటే… విపరీతంగా వాడేశారు. రకరకాల నూనెలను కలిపేసి మరి వాడేస్తున్నారు. అయితే అలా వినియోగించిన వారే… ఇప్పుడు మెల్ల మెల్లగా ఆనాటి పాత పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. కల్తీ నూనెల వాడకంతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వినియోగదారులు గ్రహించారు. కానీ ఇప్పుడు మళ్లీ గానుగ నూనె వినియోగం పై మనసు పారేసుకుంటున్నారు. గానుగ నూనె వాడకంతో అనేక ప్రయోజనాలను తెలుసుకొని మరీ.. గానుగ నూనె కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణాంతక కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం పోషకాలు కలిగిన ఆహారంతో పాటు పోషకాలు కలిగిన నూనెలు సైతం వాడేందుకు సిద్ధం అవుతున్నారు వినియోగదారులు. ఇందుకోసం మళ్లీ పాతకాలం విధానాల వైపు మళ్లుతున్నారు ప్రజలు.

యువకుడి పేరు డ్యాగల రవీందర్. చదివింది ఇంటర్ మీడియట్. 14 ఏళ్లుగా గ్లాస్ బిజనెస్ లో ఉన్నారు. కరోనా కాలంలో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ గానుగనూనె తయారీకి ముందడుగు పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామంలో తనకున్న 4 ఎకరాల్లో నలుగురు అన్నదమ్ములతో కలిసి రెండు గానుగ యూనిట్లను నెలకొల్పారు. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి,ఆవాలు లాంటి ముడిసరుకును మార్కెట్ లో కొనుగోలు చేసి గానుగల ద్వారా నూనెను తయారు చేస్తున్నారు. సాధారణంగా 13 కిలోల వేరుశనగ గుండ్లకు ఐదున్నర కిలోల నూనె ఉత్పత్తి అవుతుంది. వచ్చిన నూనెను ఇంటి అవసరాలకు పోను బందుమిత్రులకు, స్నేహితులకు కిలో ధర రూ. 400 చొప్పున అందిస్తున్నారు. అయితే డిమాండ్ అధికంగా ఉండటం చేత భవిష్యత్తులో మరిన్ని గానుగలను ఏర్పాటు చేసి అధిక మొత్తంలో నూనె ఉత్పత్తి చేయనున్నట్లు అన్నదమ్ముళ్లు చెబుతున్నారు.

READ ALSO : Neem Benifits : వేపతో వ్యవసాయంలో బహుళ ప్రయోజనాలు!

గానుగనూనె ఉత్పత్తి తోపాటు ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నారు యువరైతు రవీందర్. తన 4 ఎకరాల్లో అరుణ్ తేజ ప్రకృతి వ్యవసాయం పేరుతో 3 ఎకరాల్లో నువ్వు సాగుచేస్తున్నారు. అర ఎకరంలో ఫై లేయర్ మెథడ్ విధానంలో దాదాపు 140 పండ్ల మొక్కలను నాటారు. మరో రెండేళ్లలో ఏడాది పొడవునా.. సీజనల్ గా పండ్ల దిగుబడి రానుంది. అందులో అంతర పంటలుగా దుంపలు, కూరగాయలు సాగుచేస్తూ.. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

గానుగ నూనెలో అధిక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి గానుగ నూనెల గురించి తెలిసిన వారంత ఈ నూనెల కోనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే గానుగల ఏర్పాటుకు ప్రభుత్వం నుండి సహాకారం లభిస్తే మరికొంత మంది యువతకు ఉపాధి దొరకడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారని వినియోగదారులు చెబుతున్నారు.

READ ALSO : Paddy Weed Management : వరి సాగులో కలుపు, సూక్ష్మధాతు లోపం – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

మార్కెట్ లో కిలో వేరుశనగ పల్లీలు 120 రూపాలకు పలుకుతున్నాయి. అంటే 13 కిలోల పల్లీలకు 1560 రూపాయలు అవుతుంది. వీటి నుండి ఐదున్నర లీటర్ల పల్లీనూనె తయారవుతుంది. ఈ నూనెను తీసేందుకు రెండున్నర గంటల సమయం పడుతుంది. వచ్చిన నూనెను లీటరు ధర రూ. 450 రూపాయల చొప్పున అమ్ముతున్నారు . ఇలా రోజుకు 20 నుండి 25 లీటర్ల నూనె ఉత్పత్తి చేస్తున్నారు . అంటే సరాసరి 20 లీటర్ల నూనె ఉత్పత్తి చేస్తే ఆదాయం రూ. 9 వేల పైనే వస్తోంది. అంటే అందులో పెట్టుబడి దాదాపు రూ. 6 వేలు పోగా … ప్రతి రోజు 3 నుండి 4 వేల నికర ఆదాయం పొందుతున్నారు ఈ రైతు. అంతే కాదు నూనెతీసిన తరువాత వచ్చే చెక్కను పశువులకు దాణాగా వేస్తూ.. పశువుల నుండి వచ్చే వ్యర్థాలను పంటలకు వాడుతు.. పెట్టుబడులను తగ్గించుకుంటూ.. నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు. పూర్తి వివరాలకు క్రింది వీడియో పై క్లిక్ చేయండి.