Guava Cultivation : రెండెకరాలు.. ఐదు లక్షలు! తైవాన్‌ జామతో అధిక లాభాలు

శాస్త్ర సాంకేతికతలోని ప్రగతి, పండ్లతోటల సాగులో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఒక మొక్కకు బదులు నాలుగు మొక్కలు నాటుతూ, 4 టన్నుల దిగుబడి వచ్చే చోట నాలుగింతల ఫలసాయం పొందే వీలుంటే... ఇంకేముంది. జామ సాగు ఇందుకు మార్గం సుగమం చేస్తున్నాయి .

Guava Cultivation : రెండెకరాలు.. ఐదు లక్షలు! తైవాన్‌ జామతో అధిక లాభాలు

Taiwan Guava Cultivation

Guava Cultivation : సాగులో నూతనత్వం.. ఆధిక దిగుబడికి ఊతం కల్పించే ఆధునిక విధానాల ఆచరణ.. ప్రతి రైతును సమున్నత స్థానంలో నిలబెడుతున్నాయి. వ్యవసాయంలో కొత్తదనాన్ని కోరుకునే ప్రతి రైతుకు ఆధునిక పద్ధతులు అండగా నిలుస్తున్నాయి. సంప్రదాయ పంటలు ఎక్కువ సాగులో వుండే కోనసీమ జిల్లాలో ఓ రైతు, ప్రయోగాత్మకంగా తైవాన్ జామ సాగుచేసి అభివృద్ధి పథంలో పయనిస్తున్నాడు. హైడెన్సిటీ విధానంలో జామ నాటిన ఈ రైతు మొదటి పంట దిగుబడితోనే పెట్టుబడి మొత్తం రాబట్టుకుని, లాభాల బాటలో పయనిస్తున్నాడు. రెండవ సంవత్సరంలో ఎకరాకు రెండున్నర లక్షలకు పైగా ఆదాయం తీస్తున్న ఈ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Taiwan Guava : సెమీ ఆర్గానిక్ పద్ధతిలో తైవాన్ జామ సాగు….అంతర పంటలతో నిరంతర ఆదాయం

శాస్త్ర సాంకేతికతలోని ప్రగతి, పండ్లతోటల సాగులో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఒక మొక్కకు బదులు నాలుగు మొక్కలు నాటుతూ, 4 టన్నుల దిగుబడి వచ్చే చోట నాలుగింతల ఫలసాయం పొందే వీలుంటే… ఇంకేముంది. జామ సాగు ఇందుకు మార్గం సుగమం చేస్తున్నాయి . అధిక సాంద్రతలో మొక్కలు నాటే ఈ విధానాల్లో  రైతులు ఎకరాకు 1000 నుంచి 2వేల మొక్కలు నాటి, ఆశ్చర్యకరంగా… నాటిన మొదటి ఏడాదిలోనే మంచి ఫలసాయం సాధిస్తున్నారు. ముఖ్యంగా అధిక మార్కెట్ డిమాండ్ వున్న తైవాన్ జామ రకాల సాగుకు రైతులు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది, అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం , అవిడి గ్రామంలోని హైడెన్సిటి జామ క్షేత్రం.

READ ALSO : Thai Pink Guava : థాయ్ పింక్ జామ సాగులో తెగుళ్లు, నివారణ పద్దతులు!

జామ తోటలో జామ కాయలను పరిశీలిస్తున్న ఈ రైతు గాదిరాజు మురళీకృష్ణ .  గతంలో వరితో పాటు వివిధ వాణిజ్య పంటలు సాగుచేసినా అంతగా కలిసి రాలేదు. దీంతో వినూత్నంగా హైడెన్సిటీ జామ సాగుకు శ్రీకారం చుట్టారు. జంగారెడ్డి గూడెంలోని ప్రకృతి క్లోనల్ నర్సరీ నుండి తైవన్ పింక్ రకం జామ మొక్కలను దిగుమతి చేసుకొని, ఎకరాకు 1000 మొక్కల చొప్పున  రెండు ఎకరాల్లో నాటారు. తైవాన్ జామలో నాటిన 3వ నెల నుంచి పూత, పిందె వస్తుంది. అయితే మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే 8 నెలల వరకు పూత పిందె రాకుండా చూసుకోవాలి. దీనివల్ల  మంచి ఫలసాయం వస్తుంది. సాధారణంగా జామలో సంవత్సరానికి రెండు సార్లుగా కాయ దిగుబడి తీసుకోవచ్చు. కానీ ఈ రైతు మార్కెట్ కు అనుకూలంగా కాపును నియంత్రిస్తూ, సాగులో తగిన మెలకువలు పాటిస్తున్నారు.

READ ALSO : Taiwan Jama : తైవాన్ జామకు… తేయాకు దోమ బెడద

జామ తోటలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. రైతు మరళీకృష్ణ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు చీడపీడలను గమనిస్తూ.. వాటిని నివారణకు చర్యలు చేపడుతున్నారు. హైడెన్సీటి విధానంలో నాటిన మొదటి సంవత్సరంలోనే జామతోట కాపుకు రావటం ఒక ఎత్తైతే, ఏడాదికి ఎకరాకు 20 టన్నుల చొప్పున దిగుబడి తీస్తున్నారు.  ప్రస్థుతం తోటనుంచి నాలుగవ సారి దిగుబడి తీసుకుంటున్నారు. సరాసరి  కిలో 25 రూపాయల చొప్పున తోట వద్దే అమ్ముతూ.. ఎకరాకు 2 లక్షల 50 వేల ఆదాయం పొందుతున్నారు.