High Yielding Rice Varieties : అధిక దిగుబడినిస్తున్న వరి రకాలు.. కె.ఎస్.పి – 6251 , ఎంటియు – 1224

రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం వారు రూపొందించిన ఆర్.ఎన్.ఆర్ - 31479( ముప్పైఒకటి నాలుగు వందల డెబ్బైతొమ్మిది) సన్నగింజ రకం, ఆర్.ఎన్.ఆర్ - 29325 (ఇరువై తొమ్మిది మూడువందల ఇరువై అయిదు ) దొడ్డుగింజ రకాలు రైతు క్షేత్రంలో అధిక దిగుబడిని నమోదు చేస్తున్నాయి.

High Yielding Rice Varieties : అధిక దిగుబడినిస్తున్న వరి రకాలు..  కె.ఎస్.పి – 6251 , ఎంటియు – 1224

Best High Yielding Rice Varieties

High Yielding Rice Varieties : వరిలో కొత్తరకం వంగడాలు సాగు చేస్తూ.. నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఓ రైతు. ప్రతి సీజన్ లో  వరి పరిశోధనా కేంద్రాల నుండి మినికిట్ దశలో ఉన్న రకాలను తీసుకొచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో సాగుచేస్తుంటారు. ఈ రబీలో కూడా 5 రకాలను సాగుచేశారు. అకాల వర్షాలు, గాలివానలకు పడిపోకుండా అధిక కాత వచ్చింది. ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు . ఇంతకీ ఏ రకాలు.. వాటి గుణగణాలేంటో ఇప్పుడు రైతు ద్వారానే తెలుసుకుందాం..

READ ALSO : Drip Irrigation System : వ్యవసాయంలో పెరుగుతున్న మైక్రో ఇరిగేషన్ వాడకం !

కె.ఎస్.పి – 6251 ( అదరవైరెండు యాబై ఒకటి) నల్గొండ జిల్లా, కంపాసాగర్ పరిశోధనా స్థానం వారు రూపొందించగా, ఎంటియు – 1224 (పన్నెండు ఇరువైనాలుగు) వరి రకం మారుటేరు పరిశోధనా స్థానం , ఆర్.ఎన్.ఆర్ – 31479( ముప్పైఒకటి నాలుగు వందల డెబ్బైతొమ్మిది), ఆర్.ఎన్.ఆర్ – 29325 (ఇరువై తొమ్మిది మూడువందల ఇరువై అయిదు ) రకాలను రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం వారు రూపొందించారు. మినికిట్ దశలో ఉన్న ఈ రకాలను వరంగల్ రూరల్ జిల్లా, గీసుకొండ మండలం, ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన రైతు తిప్పారపు రాజు సాగు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో కోత కోయనున్న ఈ రకాలు ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ రకాల గుణగణాలేంటో రైతు ద్వారా తెలుసుకుందాం..

READ ALSO : Okra Crop : బెండ‌సాగులో మేలైన యాజమాన్యం

రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం వారు రూపొందించిన ఆర్.ఎన్.ఆర్ – 31479( ముప్పైఒకటి నాలుగు వందల డెబ్బైతొమ్మిది) సన్నగింజ రకం, ఆర్.ఎన్.ఆర్ – 29325 (ఇరువై తొమ్మిది మూడువందల ఇరువై అయిదు ) దొడ్డుగింజ రకాలు రైతు క్షేత్రంలో అధిక దిగుబడిని నమోదు చేస్తున్నాయి. ఎప్పటి లాగే ఈ సీజన్ లో కూడా పలు రకాలను సాగుచేసి విత్తన అభివృద్ధిచేసి.. వాటిని తోటి రైతులకు అమ్ముతూ అధిక లాభాలను పొందేదుకు సిద్ధమవుతున్నారు రాజు. మూసపద్ధతిలో కాకుండా.. భిన్నంగా ఆలోచించి సాగుచేసినట్లైతే వ్యవసాయం లాభసాటిగా మారుతుందనే దానికి ఈ రైతే నిదర్శనం.