Cashew Cultivation : జీడి రైతులను ముంచిన అకాల వర్షాలు

కొత్తమొక్కలు పెంచేందుకు ఇతర పెట్టుబడి ఖర్చుల కింద ఎకరాకు రూ.25 వేల వరకు ఖర్చు చేశారు.  మంచి పూత రావడంతో ఈ ఏఢు అధిక లాభాలు వస్తాయని  రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు.  ఎకరాకు కనీసం 400 -500 కిలోల జీడిపిక్కలు దిగుబడి వస్తుందని ఆశించారు. కానీ..  అకాల వర్షాలు  రైతుల కోంప ముంచాయి. 

Cashew Cultivation : తెల్లబంగారం పేరు ఏత్తగానే అందరికి గుర్తోచ్చేది సిక్కోలు జిల్లా ఉద్దానం  ప్రాంతం .. ఉద్దానంలో పండిన జీడిపప్పుకు వచ్చే రుచి  దేశంలో మరేక్కడా రాదనే నానుడి ఉంది ..  డిమాండ్ కి తగ్గట్టుగానే ఉద్దానం ప్రాంతలో జిడిసాగు సైతం అలానే చేస్తారు రైతులు..  అయితే తెల్లబంగారంగా పిలుచుకునే ఉద్దానం జీడి పంటకు కోత్త కష్టం వచ్చిపడింది. గత రెండు నెలలుగా కురిసిన అకాల వర్షాలు.. వడగండ్ల వాన.. జీడి పంటను సర్వ నాశనం చేసాయి. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటూ.. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : Jeedi Mamidi Cultivation : తగ్గిన జీడిమామిడి దిగుబడి.. ఆందోళనలో రైతులు

శ్రీకాకుళం జిల్లాలో ఉద్ధానం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఎత్తైన కొబ్బరి చెట్లు… గుబురైన జీడి తోటలు. జీడిపంటలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఉద్ధానం పరిధిలోని సోంపేట, కంచిలి , కవిటి , పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల పరిధిలో 28,854 ఎకరాల్లో జీడితోటలు సాగవుతున్నాయి. జీడిపంట పై ఆధారపడి సుమారు 80 వేల రైతు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

ప్రశాంతంగా సాగిపోతున్న రైతుల జీవితాల్లో మూడేళ్ల క్రితం వచ్చిన తిత్లీ తుఫాన్ కల్లోలం రేపింది . భీకర గాలుల దెబ్బకు జీడితోటలన్నీ కుప్పకూలిపోయాయి . వేళ్లతో సహా జీడిచెట్లు నేలకొరిగాయి . ఎన్నో విపత్తులు చూసి తట్టుకున్న ఉద్ధానం జీడిరైతును తిత్లీ తుఫాన్ మాత్రం కోలుకోలేని దెబ్బ కొట్టేసింది. ఫలితంగా వేలాది మంది జీడి రైతులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. తిత్లీ తుపాన్‌  తో నాశనమైన  జీడి తోటలను  మళ్లీ జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు ఉద్దానం రైతులు.

READ ALSO : Tea Mosquito : జీడిమామిడిలో నష్టం కలిగించే తేయాకు దోమ! నివారణ చర్యలు

కొత్తమొక్కలు పెంచేందుకు ఇతర పెట్టుబడి ఖర్చుల కింద ఎకరాకు రూ.25 వేల వరకు ఖర్చు చేశారు.  మంచి పూత రావడంతో ఈ ఏఢు అధిక లాభాలు వస్తాయని  రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు.  ఎకరాకు కనీసం 400 -500 కిలోల జీడిపిక్కలు దిగుబడి వస్తుందని ఆశించారు. కానీ..  అకాల వర్షాలు  రైతుల కోంప ముంచాయి.  మార్చ్ , ఏప్రిల్ నెలలో కురిసిన అకాల వర్షాలు , వడగండ్ల వానకు .. జీడిపూత రాలిపోయింది .. ఉన్న పూత సైతం భూజుపట్టి పోవడంతో పంట దిగుబడి పూర్తిగా పడిపోయింది.

READ ALSO : Jeedi Mamidi Cultivation : జీడిమామిడి పూత, కాత ఆలస్యం.. కాయలు నిలిచేందుకు శాస్త్రవేత్తల సూచనలు

జీడిపంటను చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు రైతులు. తమ జీవితంలో ఏన్నడూ జీడిపంట ఇలా లేదని వాపోతున్నారు. గతంలో ఏకరాకి 20 బస్తాలు వచ్చేదని కనీసం ఇప్పుడు రెండు బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. లక్షల రూపాయిలు ముందుగానే చెల్లించి  పంట తీసుకున్పారు. కనీసం వడ్డీ డబ్బులుకు కూడా వచ్చే పరిస్థిలేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు