Murrel Fish Seed Production : నూతన టెక్నాలజీలో.. కొర్రమేను పిల్లల ఉత్పత్తి

తెల్ల చేపల పెంపకం కంటే నల్లచేపలైన కొరమేను, వనామి రొయ్యల పెంపకంలో లాభాలు అధికంగా ఉంటాయి. రిస్క్ కూడా అలాగే ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు వీటి పెంపకం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు... 

Murrel Fish Seed Production : నూతన టెక్నాలజీలో..  కొర్రమేను పిల్లల ఉత్పత్తి

Murrel Fish Seed Production

Murrel Fish Seed Production : నాణ్యమైన చేప పిల్లలు ఉంటేనే అధిక దిగుబడి సాధించేందుకు వీలుంటుంది. కానీ మార్కెట్ లో ఇబ్బడి ముబ్బడిగా దొరికే చేపపిల్లలను కొనుగోలుచేసి తీవ్రనష్టపోతున్నారు రైతులు. దీనినే గమనించిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువరైతు నాణ్యమైన కొరమేను పిల్ల ఉత్పత్తితో పాటు, బయోఫ్లాక్ రొయ్యల నర్సరీ ప్రారంభించి.. వాటిని విక్రయిస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

చేపల పెంపకంలో ఏటా గణనీయమైన వృద్ధిరేటు నమోదుచేస్తోంది. ఏటా చేపల వినియోగం పెరగుతుండటం, ధర కూడా ఆశాజనకంగా వుండటంతో ఈ పరిశ్రమ ఆర్ధికంగా రైతుకు వెన్నుదన్నుగా వుంది.  అయితే తెల్ల చేపల పెంపకం కంటే నల్లచేపలైన కొరమేను, వనామి రొయ్యల పెంపకంలో లాభాలు అధికంగా ఉంటాయి. రిస్క్ కూడా అలాగే ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు వీటి పెంపకం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు…

READ ALSO : Fish Rain Reason : చేపల వర్షానికి కారణం ఏంటి? అసలు చేపలు ఆకాశంలో ఎలా వెళ్లాయి?

అయితే మార్కెట్ లో దొరికే నాణ్యత లేని చేప పిల్లల కొనుగోలు చేసిన రైతులు పెంచి లక్షలకు లక్షలు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ సమస్యలనుండి రైతులకు విముక్తి కల్పించడమే కాకుండా తానుకూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకున్నాడు పశ్చిమగోదావరి జిల్లా, ఉంగుటూరు మండలం, చేబ్రోలు  గ్రామానికి చెందిన యువకుడు అవినాశ్ . ఇద్దరు మిత్రులతో కలిసి 2021 సంవత్సరంలో కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్ లో ఆధునిక పద్ధతిలో  కొర్రమేను చేపపిల్లల పెంపకం చేపట్టారు . నాణ్యమైన కొర్రమేను పిల్లల ఉత్పత్తి చేస్తూ.. వాటిని రైతులకు అందిస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

READ ALSO : Cashew Nuts Price : తగ్గిన జీడిపిక్క ధర.. ఆందోళనలో రైతులు

ఒక కొర్రమేను పిల్లల పెంపకమే కాదు… వనామి రొయ్య పిల్లల ఉత్పత్తిని చేపట్టారు. సాధారణంగా రైతులు 10 పిఎల్ పిల్లలను తీసుకొచ్చి పెంచుతుంటారు. అవినాణ్యమైనవా.. లేదా అని తెలుసుకునేందుకు ల్యాబ్ లలో పరీక్షలు సైతం చేయిస్తుంటారు. అయితే అవి చిన్నగా ఉండటం.. వాటిలోని నాణ్యత గుర్తించలేకపోతున్నారు . దీనినే ఆసరాగా తీసుకొన్న రైతు అవినాశ్ .. ఈ ఏడాది బయోఫ్లాక్ నర్సరీ సీడ్స్ ను ఏర్పాటు చేశారు.  10 పిఎల్ తీసుకొచ్చి పెంచి పిల్ 35 గా పెంచి రైతులకు అందిస్తున్నారు. దీంతో రైతుకు నాణ్యమైన రొయ్య అందటమే కాకుండా పంట కాలం తగ్గుతుంది.