Disease : గొర్రెలు, మేకలలో… కాలి పుల్ల రోగం నివారణ..

జంతువుల డెక్కలు లేదా పంజాల మధ్య చర్మం ఉబ్బడం ప్రారంభమవుతుంది. డెక్కల మధ్య బాగా వాపు వస్తుంది. కాలి వేళ్ళ మధ్య చర్మం ఎర్రగా మారుతుంది.

Disease : గొర్రెలు, మేకలలో… కాలి పుల్ల రోగం నివారణ..

Sheep

Disease : సాధారణంగా గొర్రెలు, మేకలు మరియు పశువులలో కాలిపుల్ల రోగం కనిపిస్తుంది. దీనినే కాలి పుల్ల రోగం లేదా ఫుట్ రాట్ లేదా ఇన్ఫెక్షియస్ పోడోడెర్మాటిటిస్ అని పిలుస్తారు. కాలిగిట్టలలో కలిగే ఒకరమైన ఇన్ఫెక్షన్. జంతువు యొక్క పాదం నుండి పైకి కుళ్ళిపోతుంది. జంతువు యొక్క రెండు కాళ్ల మధ్య ప్రాంతంలో ఈ వ్యాధి వస్తుంది. పశువులకు నడుస్తున్న సమయంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇది ఒక జంతువు నుండి మరొక జంతువుకి సోకె అంటువ్యాధి కావటంతో పెంపకం దారులు జాగ్రత్తగా ఉండాలి. జంతువు యొక్క జీర్ణాశయంలో, మలంలాండ్ బాక్టీరియా వలన వస్తుంది.

జంతువుల డెక్కలు లేదా పంజాల మధ్య చర్మం ఉబ్బడం ప్రారంభమవుతుంది. డెక్కల మధ్య బాగా వాపు వస్తుంది. కాలి వేళ్ళ మధ్య చర్మం ఎర్రగా మారుతుంది. జంతువు శరీర ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. ఈ వ్యాధి ముదిరి తీవ్ర దశలో సోకిన భాగం వెంట పగుళ్లు ఏర్పడతాయి. వాపుల కారణంగా కాలి వేళ్లు విడిపోవచ్చు. కుళ్లిపోవడం వల్ల పాదాల నుండి దుర్వాసన వస్తుంది. ఇది గమనించిన వెంటనే మందులతో చికిత్స చేయాలి. చికిత్స చేయకపోతే, మొత్తం మందకు వ్యాధి సోకుతుంది.

పాదం కుళ్ళిపోవడానికి మరొక కారణం అధిక ఉష్ణోగ్రతలు లేదా తేమ, దీని వలన కాళ్ళ మధ్య చర్మం పగుళ్లు ఏర్పడి, బ్యాక్టీరియా పాదాలకు సోకుతుంది. వేసవిలో పాదాల తెగులు ప్రధాన సమస్యగా మారడానికి ఇది ఒక కారణం. ఇది పశువులు , గొర్రెలలో వచ్చినా వ్యాధి భిన్నంగా ఉంటుంది. డెక్కను కత్తిరించకుండా లేదా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం మంచిది.