Insect : పంటనిల్వసమయంలో పురుగుల బెడద…రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆముదం పొడి మొక్కజొన్న గింజలతో కలిపి ముక్కు పురుగు నుంచి రక్షించుకోవచ్చును. పరాద్ అనే ఆయుర్వేద బిళ్ళలను క్వింటాలకు 4 చొప్పున ఉంచితే పిండిపురుగు, తుట్టెపురుగు, మొక్కజొన్న, ముక్కు పురుగు, మసి పురుగులను నివారించవచ్చును. లేదా క్వింటాలుకు 50 గ్రా. పల్ సేఫ్ కలిపి కూడా పై పురుగులను నివారించవచ్చును. విషవాయువులతో గోదాములను నింపి పురుగు నివారణ చేయవచ్చు.

Insect : పంటనిల్వసమయంలో పురుగుల బెడద…రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Pulses

Insect :  రైతులు ఎంతో శ్రమించి పంటలు పండిస్తారు. చాలా మంది తమ పంటను పొలంలో ఉన్న సమయంలోనే తక్కువ ధరకు అమ్ముకుంటుండగా, మరికొందరు కోల్డ్ స్టోరేజ్ లలో నిల్వవుంచుకుంటున్నారు. కోల్డ్ స్టోరేజ్ లలో నిల్వవుంచలేని వారు ఇంటి వద్దే వాటిని నిల్వచేసుకుంటున్నారు. అలాంటి సందర్భంలో చీడపీడలు పండించిన ధాన్యాన్ని ఆశించి రైతులకు తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తున్నాయి. తద్వారా పంట నాణ్యత లోపించి ధర తగ్గిపోతుంది. రైతులు పంటలను నిల్వ చేసే సమయంలో పురుగులు ఆశించకుండా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవటం చాలా ముఖ్యం. ఈనేపధ్యంలో రైతులు నిల్వచేసిన పంటకు పురుగులు ఆశించకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం…

పంటను నిల్వ సమయంలో ఆశించు ముఖ్యమైన పురుగులు వివరాలను పరిశీలిస్తే

ముక్కు పురుగు: ఈపురుగు తల భాగం ముందుకు పొడుగ్గా పొడుచుకొని వచ్చినట్లు ఉంటుంది. కాబట్టి దీనిని ముక్కు పురుగు అంటారు. తల్లి పురుగు ధాన్యం మీద చిన్న రంధ్రం చేసి దానిలో గుడ్లని పెడుతుంది. గుడ్లు నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజలోకి పాటు తిని అక్కడే కోశస్థ దశకు చేరతాయి. వారం రోజుల్లో తల్లి పురుగు ఏర్పడి గుండ్రని రంధ్రం చేసుకొని బయటకు వస్తాయి.

నుసి పురుగు: ఇది పెంకు పురుగు దీని తల కిందికి వంగినట్లుగా ఉంటుంది. తల్లి పురుగులు గింజల మీద గుడ్లను పెడతాయి. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజలోకి పదార్థాన్ని తిని అక్కడే కోశస్థ దశకు చేరి 5 -6 రోజుల్లో పెద్ద పురుగులుగా అవి గింజల మీద ఆకారం లేని పెద్ద పెద్ద రంధ్రాలు చేస్తాయి. వీటి జీవిత చక్రం 2 నెలల్లో పూర్తవుతుంది.

అపరాలను ఆశించే పుచ్చుపురుగు: ఈ పురుగు గింజలపై గ్రుడ్లను పెడుతుంది. గ్రుడ్ల నుంచి వచ్చిన లార్వా గింజలోనికి ప్రవేశించి లోపలి పదార్థాలను తింటూ కోశస్థ దశకు చేరుతుంది. వారం రోజుల తరువాత తల్లి పురుగు గింజ పైన గుండ్రని రంధ్రం చేసుకొని బయటకు వస్తుంది.

వడ్ల చిలుక: వరి ధాన్యాన్ని ఆశించి తీవ్రంగా నష్టం కలిగించే ముఖ్యమైన పురుగు వడ్ల చిలుక ఇది. సీతాకోక చిలుక జాతికి చెందిన రెక్కల పురుగు, లేత గోధుమ రంగులో ఉంటాయి. ఇవి వడ్లపై ఎగురుతూ ఒక్కో గుడ్డు పెడతాయి. గుడ్ల నుంచి వెలువడిన లార్వాలు ధాన్యం లోపలికి వెళ్ళి లోపలి పదార్థాన్ని తిని అక్కడే కోశస్థ దశకు చేరుకుంటుంది. వారం రోజుల్లో రెక్కలు పురుగులు గుండ్రని రంధ్రం ద్వారా బయటకు వస్తాయి.

వేరుశనగను ఆశించే పుచ్చుపురుగు: ఇది వేరుశనగ కాయల మీద రంధ్రం చేసి గింజలను తింటూ అపార నష్టాన్ని కలుగజేస్తుంది. దీని నివారణకు తులసి, యూకలిఫ్టస్ ఆకులు, వేప ఆకులు, వసకొమ్మలు, సీతాఫలం గింజల పొడి మొదలైనవి నిల్వలో ఆశించే పురుగులను నివారిస్తుంది. ధాన్యానికి వేపాకు పొడి మరియు మొక్కజొన్న కండెలను కాల్చగా వచ్చిన బూడిద కలిపినప్పుడు కలిపినప్పుడు ఈ రెండు నుసి పురుగుల నుంచి కాపాడుతాయి.

వేరుశనగ పుచ్చు పురుగు ఆశించినపుడు మలాథియన్ 125 గ్రా./ 5 లీటర్ల నీటిలో కలిపి గోతాలపై బాగా తడిచేలా చల్లాలి. లేదా మలాథియాన్ పొడిగాని, డెల్టామెత్రిన్ పొడి గాని, 500 గ్రా. ఒక టన్ను కాయల్లో కలపాలి. విష వాయువులను నూనె గింజల సంరక్షణకు ఉపయోగించరాదు. అలా కలిపితే పురుగు మందుల అవశేషాలు ఎక్కువ స్థాయిలో గింజల్లో ఉండి హాని కలిగిస్తాయి కావున జాగ్రత్త వహించాలి.

గోదాముల్లో ఎలుకలను గమనిస్తే అల్యునిమియం ఫాస్పైడ్ 2 బిళ్ళలు ఒక క్వింటా గింజలకు ఉంచాలి. లేదా ముష్ ముష్ కేకును ఉంచాలి. జింక్ ఫాస్పైడ్ మందు పెట్టాలంటే ముందు 2 – 3 రోజులు విషం లేని ఆహారం పెట్టి తర్వాత 2 గ్రా. విషం, 2 గ్రా. నూనె, వరి తవుడు లేదా నూకలు 96 గ్రాములు కలిపి పెట్టాలి. ఇది ఒక రోజు మాత్రమే పెట్టాలి.

ఆముదం పొడి మొక్కజొన్న గింజలతో కలిపి ముక్కు పురుగు నుంచి రక్షించుకోవచ్చును. పరాద్ అనే ఆయుర్వేద బిళ్ళలను క్వింటాలకు 4 చొప్పున ఉంచితే పిండిపురుగు, తుట్టెపురుగు, మొక్కజొన్న, ముక్కు పురుగు, మసి పురుగులను నివారించవచ్చును. లేదా క్వింటాలుకు 50 గ్రా. పల్ సేఫ్ కలిపి కూడా పై పురుగులను నివారించవచ్చును. విషవాయువులతో గోదాములను నింపి పురుగు నివారణ చేయవచ్చు.

విష వాయువులతో నింపటానికి ముందుగా నల్లని పాలిథీలిన్ పేపర్ ను బస్తాల మీద పరవడానికి అనువుగా ఉంచుకోవాలి, కిటికీలకు, వెంటి లేటర్లు, గాలి వెలుపలికి పోకుండా చేయాలి. గోదాములలో నిలువ చేసిన ధాన్య రక్షణకు టన్నుకు 3 గ్రా. అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్లలను 1 – 2 ఉపయోగించుకోవాలి. ఒక క్వింటాలు అపరాలకు గాని ఉపయోగించి గాలి వెలుపలికి పోకుండా 7 రోజుల వరకు జాగ్రత్త పడాలి.