Seedless Water Melon : గింజలు లేని పుచ్చ పంట..ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువ..

గింజలు లేని పుచ్చకాయల పంటను డెవలప్ చేశారు కేరళ అగ్రికల్చర్ యూనివర్శిటీ సైంటిస్టులు. పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువనిచ్చే ఈ పంట రైతులకు లాభదాయం అని చెబుతున్నారు.

Seedless Water Melon : గింజలు లేని పుచ్చ పంట..ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువ..

Seedless Watermelon

Seedless Watermelon : పంటలు పండించే రైతుకు లాభాలు లేకపోయినా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తే చాలు అనుకుంటాడు. అది రైతన్న గొప్పదనం. తను పండించిన పంటతో పదిమందికడుపు నిండితే చాలనుకుంటాడు. నేటితరం రైతులు కొత్త కొత్త పంటలవైపు మళ్లుతున్నారు. ఆర్థికంగా నిలుదొక్కుకోవాలంటే కొత్తగా ఆలోచించాలి. కొత్త పంటలు పండించాలి. అలాగే పంట తినేవారికి చక్కటి సౌకర్యంతో పాటు చక్కటి రుచి ఉండాలి. అలా నేటి కాలంలో ఎన్నో గింజలు లేని పండ్లను పండిస్తున్నారు రైతులు. అలాగే ప్రజల రుచులు..అభిరుచులకు తగినట్లుగా పంటలు పండిస్తున్నారు.పండ్లలో పోషకాలు తగ్గకుండా..రుచిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటువంటి పంటల్లో రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది ‘గింజలు లేని పుచ్చ పంట’.

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ వరిలో అత్యధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేస్తే.. కేరళ అగ్రికల్చర్ వర్శిటీ సీడ్‌లెస్‌ పుచ్చ వంగడాలు రెండింటిని రూపొందించింది. వీటికి షోనిమా, స్వర్ణగా పేరుతో మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read more : Gerbera Farming: ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకూ ఆదాయం.. జెర్బరా ప్రత్యేకత అదే

పాలిహౌస్‌లలో గింజలు లేని పుచ్చ పంట..
వేసవి వచ్చిదంటే చాలు మార్కెట్లోకి పుచ్చకాయలు వేలాది టన్నులుగా దిగుమతి అవుతాయి. చలువ చేసే పుచ్చను వేసవిలో జనాలు తింటారు.కానీ పుచ్చకాయను తినేటప్పుడు దాంట్లో ఉండే గింజలు భలే ఇబ్బంది పెడుతుంటాయి. ఇంత టేస్టీగా ఉండే ఈ పుచ్చకాయలో గింజలు లేకుండా ఉంటే భలే ఉంటుంది కదూ అనుకుంటాం తినేటప్పుడు. అనుకోవటమేంటీ..గింజలు లేని పుచ్చకాయలు వచ్చేశాయి. కేరళలోని త్రిచూర్‌ ప్రాంతంలోని వెల్లినక్కర సమీపంలో కొత్తగా నిర్మించిన పాలిహౌస్‌లో కేరళ ఉద్యాన శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా సీడ్‌లెస్‌ పుచ్చను సాగుచేసి అందరిని ఆకట్టుకుంటున్నారు.

ఈ పుచ్చరకాన్ని పాలి హౌసులో మల్చింగ్, డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిన పెంచారు. బిందు సేద్యంతో యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఈ పంటను సాగు చేసి చక్కటి ఫలితాలను కూడా సాధించారు. ఆ తరువాత ఆ ఫలాలు రైతులకు దక్కేలా మార్కెట్ లో ప్రదర్శనలో పెట్టారు. ఈ గింజలు లేని పుచ్చ పంట గురించి అగ్రికల్చర్ సైంటిస్టు డాక్టర్‌ టి.ప్రదీప్‌ కుమార్‌ మాట్లాడుతు..గింజలు లేని పుచ్చ అనేది అసాధారణ హైబ్రీడ్‌ విత్తనం అని తెలిపారు. ఇది రైతులకు చాలా లాభాలు ఇస్తుందని పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ తెచ్చిపెడుతుందని తెలిపారు.

Read more : Gajapippali: ఆయిల్ పామ్‌లో గజపిప్పలి

ఎకరానికి రూ.50వేల పెట్టుబడితో..రూ.1.2 లక్షల ఆదాయం..
ఈ సీడ్‌లెస్‌ పుచ్చ పంట రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టే చక్కటి పంట. ఎకరానికి రూ.50 వేల ఖర్చు పెడితే చాలు నాలుగు నెలల్లో పంట చేతికి వస్తుంది. ఎకరానికి రూ.1.2 లక్షల వరకు ఆదారం తెచ్చిపెడుతుంది. కేరళ అగ్రి వర్సిటీలోఒక్కో గింజను రూపాయి చొప్పున అమ్మకానికి పెట్టారు. కిలోకి 30వేల గింజలు వస్తాయి. ఈ గింజలు కొనుగోలు చేసిన పండించాలని అని అనుకున్నవారు పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ లో తెలుసుకోవచ్చు.

Read more : Lipstick Seeds : మన్యంలో రంగుల పంట..రైతులకు లాభదాయకంగా లిప్‌స్టిక్ గింజల సాగు

ఈ గింజలు లేని పుచ్చ పంటపై త్రిచూరు జిల్లా రైతులు మంచి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే గింజలు కొని పంటలు వేశారు. చక్కటి లాభాలు పొందారు. సీడ్‌లెస్‌ పుచ్చ సాగు చేసి లక్షలు గడించినట్లు చెబుతున్నారు. తాము పండించిన పంటను వీడియోలు తీసి వాటిని పలు వెబ్‌సైట్లలో పెడుతున్నారు రైతులు. మీరు కూడా పండించి లాభాలు పొందండీ అని సూచిస్తున్నారు.కాగా ఈ పంట ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక వంటి ప్రాంతాల్లో ఎక్కువగా సాగయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు వ్యవసాయ నిపుణులు.