Mulching Sheet : తక్కువ ఖర్చుతో మల్చింగ్ షీట్ పరుపు…ఎలాగంటే…

ఇద్దరు మనుషులతో కేవలం 8గంటల్లోని ఈ పరికరం ద్వారా మల్చింగ్ సీట్ పరిచేందుకు అవకాశం ఉంది. మనుషులు ఈడ్చుకుంటూ వెళ్తూ మల్చింగ్‌ షీట్‌ పరిచే వీలున్న ఈ పరికర

Mulching Sheet : తక్కువ ఖర్చుతో మల్చింగ్ షీట్ పరుపు…ఎలాగంటే…

Mulching2

Mulching Sheet : ఉద్యానవన పంటలు పండించే వారు ఇటీవలికాలంలో మల్చింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎత్తుమడులపై మల్చింగ్ షీట్ ను పరిచి పంటలు పండిస్తున్నారు. పంటపొలంలో మల్చింగ్ షీట్ పరుపు అనేది ప్రస్తుతం ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. ఎకరంలో మల్చింగ్ షీట్ పర్చేందుకు 12మంది కూలీలు అవసరమౌతారు. కూలి, తిండి ఖర్చులు కలిపి ఎకరానికి 8వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రెండు రోజుల పాటు సమయాన్ని వెచ్చించాలి.

అయితే మహరాష్ట్రలోని నాసిక్ చెందిన ఉపాధ్యాయుడు నితిన్ తక్కువ ఖర్చుతో మల్చింగ్ షీట్ ను పరిచే యంత్రాన్ని రూపొందించాడు. సాధారణంగా ట్రాక్టర్ అనుసంధానంతో మల్చింగ్ షీట్ పరిచే యంత్రాన్ని కొందరు ఉపయోగిస్తుంటారు. అయితే దీని వల్ల మల్చింగ్ షీట్ చినిగి పోవటం వంటివి చోటుచేసుకోవటంతో రైతులు దానిపై పెద్దగా ఆసక్తి చూపకపోవటంతో నితిన్ సరికొత్త పరికరాన్ని తయారు చేయాలని ఆలోచన చేశాడు. అదే తడవుగా 15 రోజల వ్యవధిలో మల్చింగ్ షీట్ పరిచేందుకు వీలుగా ఓ చిన్న యంత్రాన్ని రూపొందించాడు.

ఇద్దరు మనుషులతో కేవలం 8గంటల్లోని ఈ పరికరం ద్వారా మల్చింగ్ సీట్ పరిచేందుకు అవకాశం ఉంది. మనుషులు ఈడ్చుకుంటూ వెళ్తూ మల్చింగ్‌ షీట్‌ పరిచే వీలున్న ఈ పరికరం అడుగున చక్రాలను అమర్చటంతోపాటు.. పరిచిన షీట్‌పై మట్టి ఎగదోయడానికి వీలుగా రెండు ఇనుప బ్లేడ్లను ఏర్పాటు చేశాడు. తాను సాగు చేసుకుంటున్న పొలంలో ఇదే పరికరంతో మల్చింగ్ షీట్ పరుచుకోవటంతోపాటు, మరో రెండు యంత్రాలను తయారు చేసి ఇతర రైతులకు అందించాడు.

10వేల రూపాయల ఖర్చుతో దీనిని తయారు చేసిన నితిన్ ప్రస్తుతం దీనికోసం ఇతర రైతులు నితిన్ ను సంప్రదిస్తున్నారు. ఇద్దరు మనుషులతో ఖర్చు తక్కువలో పరికరం అందుబాటులో ఉండటంతో రైతాంగం ఈ పరికరాన్ని తయారు చేసి ఇవ్వాలంటూ నితిన్ ను అడుగుతుండటంతో ప్రస్తుతం అడిగిన వారికి యంత్రాన్ని తయారుచేసి అందిస్తున్నాడు.