Allaneredu : తక్కువ పెట్టుబడి దీర్ఘకాలిక అదాయం… అల్లనేరేడుసాగులో ప్రకాశం రైతు

కషాయాలతోనే చీడపీడలు నివారించుకోవటం వల్ల పెట్టుబడి ఖర్చులు చాలా తక్కువని రైతు వెంకట్ రెడ్డి చెబుతున్నారు. దిగుబడికూడా అధికంగా ఉండటంతో పాటు మార్కెట్లో మంచి రేటు

Allaneredu : తక్కువ పెట్టుబడి దీర్ఘకాలిక అదాయం… అల్లనేరేడుసాగులో ప్రకాశం రైతు

Alla Neredu

Allaneredu : పరిమిత వనరులను ఉపయోగించుకుంటూ , సుస్ధిర వ్యవసాయ సాగుకు అనువైన పంటల సాగుకు రైతులు శ్రీకారం చుడుతున్నారు. ఈక్రమంలో అల్లనేరుడుసాగు రైతులకు మంచి అదాయాన్ని సమకూర్చే పంటగా మారింది. అన్నిరకాల వాతావరణ పరిస్ధితులను తట్టుకుని తక్కువ నీటి వనరుతో తక్కువ పెట్టుబడితో దీనిని సాగు చేపట్టవచ్చు. ఇదే విధానంలో 30 ఎకరాల్లో అల్లనేరేడు సాగు చేస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయ పాలెం గ్రామానికి చెందిన రైతు కందురు వెంకట్ రెడ్డి.

వెంకట్ రెడ్డి సేలం వ్యవసాయ పరివోధన స్ధానం నుండి చింతామణి2 వెరైటీ రకాన్ని మొక్కలు తెప్పిచి తనకు 70 ఎకరాల పొలంలో 30 ఎకరాల్లో నాటారు. తొలుత మదనపల్లి ప్రాంతంలో ఈ పంట సాగవుతుందని తెలుసుకుని అక్కడికి వెళ్ళి క్షేత్రస్ధాయిలో వెంకట్ రెడ్డి పరిశీలన జరిపారు. అక్కడి రైతులు ఈ పంటసాగు విధానం ద్వారా మంచి అదాయం పొందుతుండటంతో తన పొలంలో కూడా సాగు చేపట్టారు. మొక్క నాటిన మూడేళ్ళ కాలంలో పంట చేతికి వచ్చే జెంబో నేరేడుగా చెబుతున్నారు. ఎలాంటి చీడపీడల బెడద లేకపోవటం వల్ల పురుగుమందుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు.

కషాయాలతోనే చీడపీడలు నివారించుకోవటం వల్ల పెట్టుబడి ఖర్చులు చాలా తక్కువని రైతు వెంకట్ రెడ్డి చెబుతున్నారు. దిగుబడికూడా అధికంగా ఉండటంతో పాటు మార్కెట్లో మంచి రేటు లభిస్తుంది. ఒక్కో చెట్టుకు 60 నుండి 70 కిలోల నేరేడు పళ్ళ దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో 100 రూపాయల నుండి 150 రూపాయల వరకు పలుకుతుంది. నీటి ఇబ్బంది లేకుండా పొలంలో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారానే పంటకు అవసరమైన జీవామృతం, ఇతర కషాయాలను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు రైతు వెంకటరెడ్డి.

150ఏళ్ళ అయుర్ధాయం ఈ అల్లనేరేడుకు ఉండటంతో ఈ మొక్కల నుండి దీర్ఘకాలిక అదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. పండ్లకు డిమాండ్ లేని సమయంలో కాయలు కోసి గుజ్జును తీసి ఇంటిలో నిల్వచేసుకోవచ్చు. గుజ్జును సైతం అమ్ముకునేందుకు అవకాశం ఉంది. దానెమ్మ,బత్తాయి పంటల్లో కాయలు చేతికి రావాలంటే 7మాసాలు తీసుకుంటుంది. అయితే నేరేడు పూత వేసిన నాటి నుండి మూడు మాసాల్లోనే పంట వస్తుంది.

నీటి ఎద్దటి తట్టుకోవటంతోపాటు, మొక్కలు ఎండిపోయే అవకాశంలేదని వెంకటరెడ్డి చెబుతున్నారు. నేరేడు సాగు చేపట్టి 5సంవత్సరాలు పూర్తయిందని అంటున్నారు. సేంద్రీయపద్దతిలో అధిక పెట్టుబడులు లేకుండానే అల్లనేరేడు సాగుచేస్తూ అదాయం పొందుతున్నట్లు తెలిపారు. నికర రాబడి పొందాలనుకునేవారు అల్లనేరేడు సాగు చేపట్టటం ఉత్తమమని ఆయన సూచిస్తున్నారు.