Millets Rice : మార్కెట్ లోకి రానున్న మిల్లెట్స్ బియ్యం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ మిల్లెట్ ఆధారిత బియ్యాన్ని తయారు చేస్తోంది. ఇప్పటికే మిల్లెట్ దోస, ఇడ్లీ, పాస్తా, బిస్కెట్ లకు తీసుకొచ్చిన ఈ సంస్థ మరో రెండు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి మిల్లెట్ బియ్యాన్ని తీసుకొస్తుంది.

Millets Rice : ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అందుబాటులోకి చిరుధాన్యాల బియ్యం వస్తున్నాయి. ఇప్పటి వరకు బియ్యాన్ని ఇష్టంగా తింటూ.. మిల్లెట్స్ కూడా ఉండాలనుకునే వారికోసం.. మిల్లెట్ ఆధారిత బియ్యాన్ని తీసుకొస్తోంది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ . ఇప్పటికే పరిశోధనలు పూర్తి చేసిన సంస్థ మరో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకరానుంది.

READ ALSO : Pest Control In Paddy : ఎడగారు వరిలో పొట్టకుళ్లు పొడ తెగులు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు, ప్రధాన ఆహారమైన జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు.. కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా కనుమరుగైపోయాయి. ఆధునిక పోకడలతో ప్రజల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

READ ALSO : Bacterial Blight Of Rice : వరిపంటలో ఎండాకు తెగులు, నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

పిల్లలు, పెద్దల్లో పౌష్టిక లోపాలు బహిర్గతమవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే చిరుధాన్యాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అయితే వీటిని పండించడం ఒక ఎత్తైతే.. వాటిని వండుకొని తినడం మరోఎత్తు. వరి అన్నం, గోధుమలతో చేసిన పదార్థాలను ఇష్టంగా తినే ప్రజలు చిరుధాన్యాలను తినాలనుకున్న తినలేకపోతున్నారు.

READ ALSO : రైతన్నకు సహాయం: వ్యవసాయం చేస్తున్న బాతులు

ఇప్పుడు వారందరికోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ మిల్లెట్ ఆధారిత బియ్యాన్ని తయారు చేస్తోంది. ఇప్పటికే మిల్లెట్ దోస, ఇడ్లీ, పాస్తా, బిస్కెట్ లకు తీసుకొచ్చిన ఈ సంస్థ మరో రెండు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి మిల్లెట్ బియ్యాన్ని తీసుకొస్తుంది.

READ ALSO : Weed Control : వరి సాగులో కలుపు నివారణకు రైతులు చేపట్టాల్సిన చర్యలు!

చిరుధాన్యాల లో ఉండే ప్రొటీన్లు విటమిన్లు, పీచు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి వ్యాధిగ్రస్తులకు ఇవి చాలా అవసరం. ప్రముఖ కంపెనీలు సైతం చిరుధాన్యాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయంటే డిమాండ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ప్రస్థుతం వీటి వాడకం విస్తృతమైన నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ తయారీ యూనిట్ లను మరింత విస్తరిస్తే, ఉపాధి అవకాశాలు మరింత మెరుగయ్యే వీలుంది.

ట్రెండింగ్ వార్తలు