Neem Benifits : వేపతో వ్యవసాయంలో బహుళ ప్రయోజనాలు!
వేపచెక్కలో అమైనో అమ్లాలు , గంధకం ఉంటాయి. దీనిని పశువుల దాణాలో కలపడం వల్ల ఆహారంలో పోషక విలువలు పెరుగుతాయి. తాజా వేపాకులలో మాంసకృత్తులు , ఖనిజాలు ఉంటాయి.

Neem Benifits : వ్యవసాయంలో వేప అన్నదాతలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. వేప కొమ్మలు మొదలు, బెరడు, విత్తనాలు, ఆకులు, పూలు, వేర్లు, కాండం అన్నింటిని వినియోగించుకోవటం ద్వారా అనేక లాభాలు పొందవచ్చు. ఇంటి ఆవరణలోనే కాకుండా పొలం గట్లపైన కూడా వేప చెట్లను పెంచుకోవచ్చు. పంటలకు కీటకనాశినిగా, విత్తనశుద్ధికి, ధాన్యం నిల్వకు, సస్యరక్షణకు ఇలా ఎన్నో విధాలుగా వేపను అన్నదాతలు ఉపయోగించుకోవచ్చు.
వేప వల్ల వ్యవసాయంలో ఉపయోగాలు ;
కీటకనాశినిగా ; వేపచెట్టు కాయలను సేకరించి వాటిని కషాయంలా చేసుకుని పంటకు పిచికారీ చేసుకోవచ్చు. వేపపండ్ల ను నీటిలో నానబెట్టి విత్తనాన్ని వేరు చేసి తర్వాత విత్తనాలను ఆరబెట్టి లోపలి పపప్ను వేరు చేసుకోవాలి. ఈ పప్పును బాగా పొడిచేసి నీటిలో 24 గంటలపాటు నానబెట్టాలి. ఈ ద్రావణాన్ని వడపోసి 20 నిమిషాలపాటు బాగా పిండి పొడిని వేరు చేయాలి. 10 కిలోల వేపగింజల పొడిని 200 లీటర్ల నీటిలో నానబెట్టగా వచ్చే ద్రావణాన్ని నీటితో కలిపి పిచికారి చేస్తే కీటకాలు నాశనమౌతాయి.
విత్తనశుద్ధి లో ; విత్తనాలను ఆశించే పురుగులు, తెగుళ్ళబారి నుండి కాపాడుకోవాలంటే విత్తనశుద్ధి తప్పనిసరి. వేప పిండిని విత్తనాలకు కలిపి శుద్ధి చేస్తే ఆ విత్తనాలు పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా చాలా కాలం నిల్వ ఉంటాయి. ఒక కిలో విత్తనానికి 10 గ్రా వేపపిండి కలిపి దాన్ని అన్నివిత్తనాలకు అంటుకునేలా శుద్ధి చేస్తే విత్తనాలు ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాక మంచి దిగుబడులు వస్తాయి.
ధాన్యం నిల్వలో ; ధాన్యం నిల్వ చేసేసమయంలో కీటకాలు ఆశిస్తుంటాయి. ధాన్యాన్ని నిల్వ ఉంచే ముందు వేప ఆకులు ధాన్యంలో కలుపుకోవాలి. తద్వారా ధాన్యాన్ని ఆశించే కీటకాల బెడద తగ్గుతుంది. ధాన్యం నిల్వ చేసే పంచులను వేపనూనెతో శుద్ధి చేస్తే కీటకాల నుండి కాపాడుకోవచ్చు.
పశు సంరక్షణలో ; వేపచెక్కలో అమైనో అమ్లాలు , గంధకం ఉంటాయి. దీనిని పశువుల దాణాలో కలపడం వల్ల ఆహారంలో పోషక విలువలు పెరుగుతాయి. తాజా వేపాకులలో మాంసకృత్తులు , ఖనిజాలు ఉంటాయి. వీటిని మేతగా వాడుకోవచ్చు. వేప ద్రావణం నీటిలో కలిపి స్నానం చేయించడం వలన పశువులకు చర్మ వ్యాధులు రాకుండా చూడవచ్చు. పశువుల పాకల్లో వేపాకులను, కొమ్మలను కాలిస్తే ఈగలు, దోమలు బెడదను తగ్గించుకోవచ్చు.
1Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
2Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
3Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
4Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
5KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
6Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
7Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
8Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్లర్గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
9Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
10Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో తడబడిన రాహుల్ గాంధీ
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!