Nematodes Control : జామతోటలకు నులి పురుగుల వల్ల తీవ్ర నష్టం.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

అన్నిరకాల ఉద్యాన పంటలకు  నులిపురుగులు  ప్రధాన సమస్య  మారాయి. భూమిలో ఉండే ఈ పురుగులు అనుకూల పరిస్థితుల్లో  మొక్కల వేర్లను ఆశించి రసాన్ని పీల్చేయటం  వల్ల పోషక పదార్థాలు అందక మొక్కలు నిలువునా ఎండిపోతాయి . వీటిని నెమటోడ్స్ అని కూడా అంటారు.

Nematodes Control : ఇటీవలికాలంలో  జామతోటల  రైతులు ఎదుర్కుంటున్న  ప్రధాన సమస్యల్లో నులిపురుగులు ఒకటి. వీటిని నెమటోడ్స్  అంటారు.  వీటి బెడదతో జామ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొక్కలు నిలువునా ఎండిపోతుండటంతో  చాలా ప్రాంతాల్లో తోటలను తొలగిస్తున్నారు.

READ ALSO : Guava Cultivation : రెండెకరాలు.. ఐదు లక్షలు! తైవాన్‌ జామతో అధిక లాభాలు

ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో హెడెన్సిటీ విధానంలో సాగవుతున్న జామతోటల్లో  ఈ నులిపురుగుల  నష్టాన్ని  వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు . జామతోటలకు  ప్రాణాంతకంగా  మారిన నెమటోడ్స్  నివారణకు  చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.

అన్నిరకాల ఉద్యాన పంటలకు  నులిపురుగులు  ప్రధాన సమస్య  మారాయి. భూమిలో ఉండే ఈ పురుగులు అనుకూల పరిస్థితుల్లో  మొక్కల వేర్లను ఆశించి రసాన్ని పీల్చేయటం  వల్ల పోషక పదార్థాలు అందక మొక్కలు నిలువునా ఎండిపోతాయి.

READ ALSO : Guava Cultivation : రెండెకరాలు.. ఐదు లక్షలు! తైవాన్‌ జామతో అధిక లాభాలు

వేర్లను అంటిపెట్టుకుని  వృద్ధి చెందుతాయి.  చనిపోయిన మొక్కలను  పీకి చూసినప్పుడు  వేర్లపై  బుడిపెల రూపంలో కనిపిస్తాయి. ఇటీవలి కాలంలో జామతోటల్లో  ఈ నులిపురుగుల  సమస్య తీవ్రంగా మారింది.

ఖమ్మం జిల్లా వైరా పరిసర ప్రాంతాల్లోని  జామతోటల్లో  ఈ పురుగుల  తీవ్రతను  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గమనించారు . హైడెన్సిటీ  విధానంలో నాటిన ఈ తోటలో ఇప్పటికే  చాలా మొక్కలు చనిపోవటంతో  రైతు తీవ్రంగా నష్టపోయారు . ఈ నేపధ్యంలో  నెమటోడ్స్ నివారణకు చేపట్టాల్సిన  సమగ్ర చర్యల గురించి జె. హేమంత్ కుమార్, ప్రోగ్రాం కోఆర్డినేటర్  రైతులకు  వివరించారు.

 

ట్రెండింగ్ వార్తలు