Guava Farming : జామలో నులిపురుగుల నివారణ చర్యలు

అన్నిరకాల ఉద్యాన పంటలకు నులిపురుగులు ప్రధాన సమస్య మారాయి. భూమిలో ఉండే ఈ పురుగులు అనుకూల పరిస్థితుల్లో మొక్కల వేర్లను ఆశించి రసాన్ని పీల్చేయటం వల్ల పోషక పదార్థాలు అందక మొక్కలు నిలువునా ఎండిపోతాయి .

Guava Farming : ఇటీవలికాలంలో జామతోటల రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య నులిపురుగులు . వీటిని నెమటోడ్స్ అంటారు . వీటి బెడదతో మొక్కలు నిలువునా ఎండిపోతుండటంతో చాలా ప్రాంతాల్లో తోటలను తీసేసే పరిస్థితి నెలకొంది .

READ ALSO : Guava Cultivation : రెండెకరాలు.. ఐదు లక్షలు! తైవాన్‌ జామతో అధిక లాభాలు

ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో హెడెన్సిటీ విధానంలో సాగవుతున్న జామతోటల్లో ఈ నులిపురుగుల నష్టాన్ని వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు . జామతోటలకు ప్రాణాంతకంగా మారిన నెమటోడ్స్ నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అన్నిరకాల ఉద్యాన పంటలకు నులిపురుగులు ప్రధాన సమస్య మారాయి. భూమిలో ఉండే ఈ పురుగులు అనుకూల పరిస్థితుల్లో మొక్కల వేర్లను ఆశించి రసాన్ని పీల్చేయటం వల్ల పోషక పదార్థాలు అందక మొక్కలు నిలువునా ఎండిపోతాయి . వీటిని నెమటోడ్స్ అని కూడా అంటారు.

READ ALSO : Taiwan Guava : సెమీ ఆర్గానిక్ పద్ధతిలో తైవాన్ జామ సాగు….అంతర పంటలతో నిరంతర ఆదాయం

వేర్లను అంటిపెట్టుకుని వృద్ధి చెందటం వీటి లక్షణం. చనిపోయిన మొక్కలను పీకి చూసినప్పుడు వేర్లపై బుడిపెల రూపంలో కనిపిస్తాయి. ఇటీవలి కాలంలో జామతోటల్లో ఈ నులిపురుగుల సమస్య తీవ్రంగా వుంది. ఖమ్మం జిల్లా వైరా పరిసర ప్రాంతాల్లోని జామతోటల్లో ఈ పురుగుల తీవ్రతను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గమనించారు .

హైడెన్సిటీ విధానంలో నాటిన ఈ తోటలో ఇప్పటికే చాలా మొక్కలు చనిపోవటంతో రైతు తీవ్రంగా నష్టపోయారు . ఈ నేపధ్యంలో నెమటోడ్స్ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి శాస్త్రవేత్త రైతులకు వివరించారు.

ట్రెండింగ్ వార్తలు