Corramine : కొర్రమీనుకు కొత్త యోగం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అద్భుత ఫలితాలు ఇస్తుండటంతో ఈ ఏడాది 93 కోట్ల చేప పిల్లల పంపిణీ చేయనున్నది. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద చేప పిల్లల కొనుగోలుకు ప్రభుత్వం రూ.100 కోట్ల వరకు ఖ ర్చు చేస్తుంది.

Corramine : కొర్రమీనుకు కొత్త యోగం

Korraminu Fish

Corramine : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కొర్రమీనును రాష్ట్ర చేపగా గుర్తించిన నేపధ్యంలో ఆరకం చేపల పెంపకంపై మత్స్యశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. ముళ్ళు తక్కువ కలిగి రుచి ఎక్కవగా ఉండే కొర్రమీను చేపలను భోజన ప్రియులు ఇష్టంగా తింటారు. నోరూరించే కొర్రమీను చేపలను తెలంగాణా ప్రాంతంలో కొర్రమట్టగా పిలుస్తారు. ఇది మంచి నీటిలో పెరిగే చేప.

దక్షిణ చైనా, పాకిస్తాన్, దక్షిణ నేపాల్ , బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలలో ఇది కనిపిస్తుంది. గోదుమరంగులో దేహం కలిగి నల్లటి మసకబారిన చారలు కనిపిస్తాయి. మనదేశంలో సైతం వివిధ ప్రాంతాల్లో ఈ రకం చేపలను పెంపకం జరుగుతుతుంది. తడిగా ఉండే బురదనేలల్లో సైతం ఇది జీవించగలదు. అందుకే దీనిని బురదమట్టగా కూడా పిలుస్తుంటారు.

ఈచేపల్లో లభించే పోషకాల వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో 18 నుండి 20శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఎనిమిది రకాల అమైనో యాసిడ్లు ఇందులో లభిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు ఈ చేపలను ఆహారంగా తీసుకోవటం మంచిది. గర్భీణీస్త్రీలు ఈ చేపలను ఆహారంగా తీసుకుంటే గర్భంలో ఉండే పిండానికి అనేక పోషకాలు అందుతాయి.

ఉబ్బసం వ్యాధికోసం బత్తిన సోదరులు మృగశిర కార్తె రోజున పంపిణీ చేసే మందును కొర్రమీను చేప పిల్లల ద్వారానే అందిస్తారు. ఇంతటి ప్రాధాన్యత కొర్రమీను చేపకు కలిగి ఉండటం, మార్కెట్ లో ఈ చేపలకు డిమాండ్ బాగా ఉండటంతో తెలంగాణా రాష్ట్ర మత్య్చ శాఖ వీటి ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఈనేపధ్యంలో కొత్త తరహా విధానంలో కొర్రమీను చేపల పెంపకానికి శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం బెంగుళూరులోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఆక్వా కల్చర్‌ (సిఫా)తో మత్స్యశాఖ త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనుంది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అద్భుత ఫలితాలు ఇస్తుండటంతో ఈ ఏడాది 93 కోట్ల చేప పిల్లల పంపిణీ చేయనున్నది. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద చేప పిల్లల కొనుగోలుకు ప్రభుత్వం రూ.100 కోట్ల వరకు ఖ ర్చు చేస్తుంది. అవసరమయ్యే చేప పిల్లల్ని ఇక్కడే ఉత్పత్తి చేసేలా మత్స్యశాఖ యోచిస్తున్నది. ఈతరుణంలో చేపల పెంపకాన్ని మరింత ప్రోత్సహించేలా మత్స్యశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. వచ్చే ఏ డాది ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన చెరువుల్లో కొత్త పద్ధతుల్లో కొర్రమీను పెంచాలని నిర్ణయించింది.

దక్షిణ భారతదేశంలో భారీగా డిమాండ్‌ ఉన్నప్పటికీ.. అందుకు తగ్గట్టు ఉత్పత్తి లేదు. డిమాండ్ తగ్గట్టుగా ఉత్పత్తి పెంచాలన్న ఆలోచనలో మత్స్యశాఖ ఉంది. రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల కింద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాలని భావిస్తున్నది. ప్రతి ప్రాజెక్టు పరిసరాల్లో మత్స్యశాఖకు 10-20 ఎకరాల స్థలం ఇవ్వాలని నీటిపారుదలశాఖను కోరింది. త్వరలో ఇదే అంశంపై చర్చించేందుకు రెండు శాఖ అధికారులు సమావేశం కానున్నారు.

ప్రాజెక్టుల వద్దనే బహుళ ప్రయోజనాలు కలిగేలా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాలన్న యోచనలో సర్కారు ఉంది. ప్రస్తుతం కొన్ని చెక్‌ డ్యాంలకే పరిమితమైన చేపల పెంపకాన్ని.. ఇకపై అన్ని చెక్‌ డ్యాంలలో చేపట్టాలని ఆలోచనలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్లో కొర్రమీను చేపలు కేజీ 600 వరకు పలుకుతున్నాయి. డిమాండ్ కు తగ్గట్టు చేపల ఉత్పత్తి లేకపోవటంతో ఉత్పత్తి పెంచేందుకు సర్కారు చర్యలను వేగవంతం చేసింది. ప్రభుత్వ చేపటనున్న చర్యలు సత్ఫలితాలనిస్తే కొర్రమీను చేపకు కొత్త యోగం పట్టనుందని ఆహార ప్రియులు అకాంక్షిస్తున్నారు.