Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో కూరగాయల అమ్ముతున్న యువజంట

అద్దాల మేడల్లో ఏసీ గదుల్లో.. స్ప్రింగ్ కుర్చిలో కూర్చొని ల్యాప్‌ టాపుల్లో చూస్తూ పని చేయాల్సిన వాళ్లంతా మట్టిలో ఉన్న మహత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఖర్చులేని వ్యవసాయం చేస్తూ.. అద్భుతాలు సాధిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన ఓ యువజంట

Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో కూరగాయల అమ్ముతున్న యువజంట

Organic Vegetable Farming

Organic Vegetable Farming : అందివస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని నేటి యువత ఇప్పుడిప్పుడే అర్ధం  చేసుకుంటున్నారు. కరోనా లాక్‌డౌన్ నేర్పిన పాఠాలో లేక సినిమాల ప్రభావమో తెలియదు కాని రైతు లేనిదే మనిషి మనుగడ కష్టం అని తెలుసుకుంటున్నారు చదువుకున్న యువత.

READ ALSO : Natural Farming : గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో.. మూడు రెట్ల ఆదాయం పొందుతున్న రైతు

ఉన్నత చదువులు చదివినవారు ఎవరైనా మంచి ఉద్యోగం చేయాలనుకుంటారు. కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలతో తమ ప్రతిభను కొలమానంగా వేసుకుంటారు. అయితే హైదరాబాద్ కు చెందిన  ఓ యువ జంట ఇందుకు భిన్నం. చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడంతో హైదరాబాద్ శివారులో వ్యవసాయ భూమిని కౌలుకు  తీసుకొని సాగును మొదలు పెట్టారు. అద్దాల మేడల్లో ఏసీ గదుల్లో.. స్ప్రింగ్ కుర్చిలో కూర్చొని ల్యాప్‌ టాపుల్లో చూస్తూ పని చేయాల్సిన వాళ్లంతా మట్టిలో ఉన్న మహత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఖర్చులేని వ్యవసాయం చేస్తూ.. అద్భుతాలు సాధిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన ఓ యువజంట.

READ ALSO : Integrated Cultivation : ప్రకృతి విధానంలో.. ఇంటిగ్రేటెడ్ సాగు చేస్తున్న ఎన్నారై

భానుకిరణ్ ది రాజమండ్రి. ఎంబిఏ పూర్తిచేసిన ఇతను హైదరబాద్ లోనే ఉద్యోగం చేస్తున్నారు. తన భార్య  అనంతలక్ష్మి కూడా ఎమ్మెస్సి పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. అయితే ఉద్యోగాలు సంతృప్తి నివ్వకపోడం.. ఇటు వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వారు కావడంతో రైతుగా మారాలనుకున్నారు. రసాయనాలతో చేసే వ్యవసాయంతో నష్టాలు వస్తున్న నేపథ్యంలో సాగుబడిని వదిలేయాలని పలువురు రైతులు చూస్తున్నారు.

ఈ తరుణంలో ఈ యువజంట సాగుకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ శివార్లోని శకంర పల్లి ప్రాంతంలో 16 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని.. సూర్యగ్రీన్స్ పేరుతో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు.

READ ALSO : Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు

వీటితో పాటు దేశీఆవుల పెంపకం చేపట్టి పాలఉత్పత్తిని చేస్తున్నారు. మరోవైపు నాటుకోళ్లను పెంచుతూ.. గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. వచ్చిన దిగుబడులను వ్యవసాయ క్షేత్రం వద్ద అమ్మడమే కాకుండా ప్రతి ఆదివారం కూకట్ పల్లిలోని రైతుబజార్ లో ఒక స్టాలు  ఏర్పాటు చేసుకొని అమ్మకం చేపడుతున్నారు.

హైదరాబాద్‌ లాంటి నగరాలు, ఇతర పట్టణాల్లో ఆర్గానిక్‌ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్‌ ఉంది. రసాయనాలతో పండిన ఉత్పత్తులకంటే కాస్త ధర ఎక్కువైన.. వినియోదారులు కొనుగోలు చేస్తున్నారు.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

చాలామంది రైతులు కృత్రిమ ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడి డబ్బుతో పాటు భూమిని పాడుచేసుకుంటున్నారు. వ్యవసాయాన్ని దండగ చేస్తున్నారు. ప్రకృతి విధానంలో సాగుచేయడం వల్ల, ఎలాంటి ఖర్చులేకుండా అధిక దిగుబడి సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఈ యువరైతు జంట.

ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన పెంచుకుంటే , సాగు పండుగలా మారుతుంది. ఇటు ప్రజలకు అటు పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదని నిరూపిస్తున్నారు.