Lemon Farming : నిమ్మతోటల్లో రైతులు అనుసరించాల్సిన ఎరువుల యాజమాన్యం !
ఒకో ప్రాంతంలో కాయల డిమాండ్ ను బట్టీ ప్రాంతాల వారిగా చెట్లు పూతకు వదిలే సమయం మారుతుంది. పూతకు వదిలే ముందు చెట్లను ఎండబెట్టి ఆ తరువాత ఎరువులు వేసి వాటికి పుష్కలంగా నీరు పెట్టుకోవాలి.

lemon grove
Lemon Farming : నిమ్మ తోట లో ఎరువుల యాజమాన్యం ప్రధానమైనది. చెట్ల పోషణ సరిగా లేకుంటే చీడపీడలు బారినపడే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా 30 నుండి 40 సంవత్సరాలు మంచి దిగుబడి ఇవ్వాల్సిన చెట్లు ఇలా చీడపురుగుల బారిన పడితే కేవలం పది సంవత్సరాల లోపే మరణిస్తాయి. దీని వల్ల రైతులకు అదాయవనరును కోల్పోవటమే కాకుండా నష్టం జరుగుతుంది.
కాబట్టి రైతులు సకాలంలో చెట్లకు కావాల్సిన ఎరువులను అందించాల్సిన అవసరం ఉంది. నత్రజని ఎరువును 25 శాతం పశువుల ఎరువు రూపంలోనూ 25 శాతం పిండి ఎరువు వేప పిండి లేదా ఆముదం రూపంలోనూ ఉన్న పదార్దాన్ని తీసుకొని మిగిలిన 50 శాతం రసాయనిక ఎరువు రూపంలో రెండుసార్లు పిచికారి చేయాలి.
READ ALSO : Lemon Yield In Summer : వేసవిలో నిమ్మదిగుబడి కోసం రైతులు అనుసరించాల్సిన యాజమాన్య పద్దతులు!
మొదటిసారి డిసెంబర్ నుండి జనవరి నెలలో పిచికారి చేయాలి. కొంత సమయం తీసుకోని రెండవ సారి జూన్ నుండి జులై నెలలో పిచికారి చేసుకోవాలి. భాస్వరం ఎరువును సింగల్ సూపర్ ఫాస్పేట్ రూపంలోనూ, పొటాష్ ఎరువును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో రెండు విడతలుగా వేయాలి. వీటితోపాటు ఎకరానికి 25 కిలోల జనుము పంటను మొక్కల మధ్య అంతర పాటుగా వేసుకోని 45 నుండి 48 రోజుల తర్వాత పూత దశ ను కత్తిరించి వేయాలి. వర్మి కంపోస్టు వాడితే పశువుల ఎరువు మోతాదు తగ్గించుకోవచ్చు.
ఒకో ప్రాంతంలో కాయల డిమాండ్ ను బట్టీ ప్రాంతాల వారిగా చెట్లు పూతకు వదిలే సమయం మారుతుంది. పూతకు వదిలే ముందు చెట్లను ఎండబెట్టి ఆ తరువాత ఎరువులు వేసి వాటికి పుష్కలంగా నీరు పెట్టుకోవాలి. సేంద్రియ ఎరువులను వాడటం వలన భూమిలోని సత్తువ తేమను వాడటం వలన అవి తేమను నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెంచుకుంటాయి. దీని వల్ల చెట్ల పెరుగుదల బాగా ఉంటుంది.
READ ALSO : Lime Cultivation : ఎలాంటి నేలలు నిమ్మసాగుకు అనుకూలమో తెలుసా!..
ఎరువులను చెట్ల పాదులలో బ్రెంచ్ పద్ధతిలో వేస్తారు. చెట్టు చుట్టూ ఒక మీటరు దూరంలో 15 నుండి 20 సెంటీమీటర్ల వెడల్పు లో 15 సెంటీమీటర్ల లోతులో కందకం తవ్వి ఎరువులు వేసికప్పాలి. లేతమొక్కలు ఒక సంవత్సరానికి 4 నుండి 5 సార్లు చిగురిస్తాయి. ఇక ఈ సమయంలో వ్యాధి నివారణకు లీటరు నీటిలో 5 గ్రాముల జింక్ సల్ఫేట్, రెండు గ్రాముల మాంగనీస్ సల్ఫేట్, రెండు గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, రెండు గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, ఒక గ్రాము బోరాక్స్, ఆరు గ్రాముల సున్నం, 10 గ్రాముల యూరియా మిశ్రమం అన్నింటినీ కలిపి సంవత్సరానికి నాలుగు సార్లు పిచికారి చేయవలసి ఉంటుంది. లేత ఆకుల మీద పిందెలు బఠాణీ అంత పరిమాణంలో ఉన్నప్పుడు పిచికారి చేసుకోవాలి. లేదంటే చెట్లు త్వరగా చనిపోతాయి.