Paddy Weed Management : వరి సాగులో కలుపు, సూక్ష్మధాతు లోపం – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

రైతులు పంటలకు అధికంగా కాంప్లెక్స్ ఎరువులు అందించటం వల్ల, మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి. సూక్ష్మ పోషకాలు లభించవు. గతంలో పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని ఎక్కువగా అందించేవారు.

Paddy Weed Management : వరిలో నాట్లు తర్వాత ప్రధానంగా వరిలో కనిపించేది కలుపు సమస్య. ముఖ్యంగా ఈ సమస్య ఉభయ గోదావరి జిల్లా, డెల్లా ప్రాంతాల్లో అధికంగా ఉంటుంది. నారు విత్తిన 15 రోజులకే వరితో పాటు కలుపు కూడా వేగంగా పెరుగుతుంది. పంటల సాగులో కలుపు నివారణ కీలకం. వరిలో ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. వరి పిలక, లేతకు దశలో రైతులు సకాలంలో కలుపును నివారించకపోతే పంట దిగుబడితో పాటు పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది.

READ ALSO : Mixed Farming : రైతుకు భరోసానిస్తున్న మిశ్రమ వ్యవసాయం.. పలు పంటల సాగు విధానంతో స్థిరమైన ఆర్థిక వృద్ధి

రైతులు సకాలంలో కలుపును నివారించకపోతే పంట దిగుబడితో పాటు కూలీల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కలుపు నివారణకు రైతులు, యూరియాలో కలుపు మందులను కలిపి చల్లుతుంటారు. అలా చేస్తే కలుపు మరింత పెరగడంతో పాటు పంట నష్టపోయే ప్రమాదం ఉంది. పిలక దశలో ఉన్న వరిలో చీడపీడల వ్యాప్తితో పాటు కలుపు కూడా అధికంగా ఉన్నట్లు శాస్త్రవేతలు గుర్తించారు.

రైతులు పంటలకు అధికంగా కాంప్లెక్స్ ఎరువులు అందించటం వల్ల, మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి. సూక్ష్మ పోషకాలు లభించవు. గతంలో పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని ఎక్కువగా అందించేవారు. వీటి ద్వారా నేల సారంవంతంగా వుండి, మొక్కలకు సరిపడినంత సూక్ష్మ పోషకాలు లభించేవి. అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. దీనివల్ల చాలా పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు బహిర్గతమై, దిగుబడులు తగ్గుతున్నాయి.

READ ALSO : Sunflower Seed Production : రైతులకు ఆశాజనకంగా పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి !

కాబట్టి రైతులు సత్వరమే కలుపు నివారణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఏవిధంగా అరికట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత డా. మానుకొండ శ్రీనివాస్. పూర్తి వివరాలకు క్రింది వీడియోపై క్లిక్ చేయండి.

 

ట్రెండింగ్ వార్తలు