Pearl Cultivation : ముత్యాల సాగుచేపట్టి లాభాలు పొందుతున్న అనంతపురం రైతు !

మొదటమొదటి ప్రయత్నంగా 3 వేల ఆల్చిప్పలు కొని పెంచారు. పూర్తిగా విఫలమైంది. వెంటనే మళ్లీ 3 వేలు ఆల్చిప్పలను కొనుగోలుచేసి పెంచారు. 32 శాతం చనిపోయాయి. 2 వేల ఆల్చిప్పలు మాత్రమే బతికాయి. అందులో 4 వేల ముత్యాలు బయటకు వచ్చాయి.

Pearl Cultivation : ముత్యాల సాగుచేపట్టి లాభాలు పొందుతున్న అనంతపురం రైతు !

Pearl Cultivation

Pearl Cultivation : ప్రకృతి సిద్ధంగా లభించే జాతి రత్నాల్లో ముత్యం ఒకటి. ఇందులో మంచినీటిలో, ఉప్పునీళ్లలో తయారైనవి అంటూ రెండు రకాల ముత్యాలున్నాయి. కానీ కాలుష్య కారకల వల్ల ముత్యాల సహజ ఉత్ప్తతి తగ్గిపోతుండటం మూలాన అవి చాలా తక్కువ మొత్తంలో లభ్యమవుతున్నాయి. ధర కూడా పెరిగిన నేపథ్యంలో కృత్రిమ ముత్యాలకు డిమాండ్ బాగా పెరిగింది. అందుకే మన దేశంప్రతి ఏటా కల్చర్ ముత్యాలను భారీ ఎత్తున దిగుమతి చేసుకోంటోంది.

దీంతో చాలా మంది రైతులు ముత్యాల సాగును ఎంచుకుంటున్నారు. ఈ కోవలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు భారీ ఎత్తున ముత్యాల సాగుచేపడుతున్నారు. ఇంతకీ ముత్యాల సాగు చేవిధంగా చేస్తారో.. ఆ రైతు అనుభవాలను ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Country Chicken: గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నాటుకోళ్ల పెంపకం

అద్భుతాలు సృష్టించాలంటే కలలు కనాలి. కలలు కంటే సరిపోదు.. వాటిని ఆచరణలో పెట్టాలి. అందుకోసం సాహసాలు కూడా చేయాలి. సవాళ్లును ఎదుర్కోవాలి. అవకాశాలను సృష్టించుకోవాలి.. అప్పుడే నలుగురికీ భిన్నంగా .. అందరికీ స్పూర్తినందించేలా నిలబడుతారు. ఆ ఆలోచనలతోనే చేపట్టి అందరి మన్నలను పొందుతున్నారు అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం, పెద్ద పడమల గ్రామానికి చెందిన రైతు అంగజాల నాగరాజు.

రైతు నాగరాజు సంప్రదాయ పంటలు సాగుచేసేవారు. పెద్దగా లాభాలు రాకపోవడం.. ఏదో విపత్తుతో నష్టలను చవిచూసేవారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మొగ్గుచూపారు. ఇందుకోసం ఇంటర్నెట్ వాడారు. ఇందులో ముత్యాలసాగు విశేషంగా ఆకట్టుకుండి. అంతే వీటిని సాగుచేసే ఇతర రాష్ట్రాల రైతు వద్దకు చేరుకొని వారి సాగు విధానాలను పరిశీలించారు. 6 నెలల పాటు శిక్షణ కూడా పొందారు.

మొదటమొదటి ప్రయత్నంగా 3 వేల ఆల్చిప్పలు కొని పెంచారు. పూర్తిగా విఫలమైంది. వెంటనే మళ్లీ 3 వేలు ఆల్చిప్పలను కొనుగోలుచేసి పెంచారు. 32 శాతం చనిపోయాయి. 2 వేల ఆల్చిప్పలు మాత్రమే బతికాయి. అందులో 4 వేల ముత్యాలు బయటకు వచ్చాయి. ఒక ముత్యంను రూ. 150 నుండి 210 వరకు అమ్మగా.. రూ. 5 లక్షల 80 వేల ఆదాయం వచ్చింది. దానితో పాటు అనుభవం పెరిగింది. ఈ అనుభవంతో ప్రస్తుతం 35 వేల ఆల్చిప్పలను పెంచుతున్నారు. ఇంటి వద్ద ట్యాంకుల్లో మరో 3 వేల ఆల్చిప్పలను పెంచుతున్నారు.

READ ALSO : Blue Tongue And Muzzle Disease : గొర్రెలు, మేకల్లో నీలి నాలుక, మూతి వాపు వ్యాధి! నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఇవే!

ప్రకృతి సహజంగా ముత్యాలు ఏర్పడడం అరుదుగా జరుగుతుంటుంది. అందుకే, నత్తగుల్లలు వీటినే మసెల్స్ అంటారు. వీటిని పెంచి వాటి ఆల్చిప్పల నుంచి ముత్యాలు తయారుచేస్తున్నారు. ఆల్చిప్పలో రసాయన చర్యల కోసం న్యూక్లియర్స్ అనే పదార్థాన్ని కృత్రిమంగా ప్రవేశపెడతారు. ఇది చాలా సున్నితమైన ప్రక్రియ. మసెల్స్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆల్చిప్పలను సాగడమంటే చంటిపాపలను సాకినట్టే.. వాటిని పెంచుతున్నప్పుడు నీటి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉండాలి. మంచి నాణ్యమైన ముత్యాలు, అధిక ఉత్పత్తి కావాలంటే ఇది చాలా ముఖ్యం అంటున్నారు రైతు నాగరాజు .

ముత్యాల పెంపకం అత్యంత లాభదాయకమైన ఆక్వాకల్చర్ వ్యాపారం. అయితే ఇది దీర్ఘకాలిక పంట. ఒక సారి వేస్తే 18 నెలలపాటు పెంచాల్సి ఉంటుంది. సహజ పద్ధతిలో సాగుచేస్తే దాణా ఆవుపేడ, ఆవు పంచకం,యూరియా, సింగల్ సూపర్ పాస్ఫేట్ మిశ్రమాన్ని వేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తే.. మంచి లాభాలను పొందేందుకు ఆస్కారం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.