Pesara Crop : పెసర పంటలో తెగుళ్లు, నివారణ
తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీలుస్తాయి. ఆకు ముడత తెగులును తామర పురుగులు వ్యాప్తి చేస్తాయి. ఆకులు అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గడసబారి రాలిపోతాయి.

Pesara Crop : కొద్దిపాటి నీటివనరులున్న ప్రాంతాల్లో రైతులు పెసరపంటను సాగు చేస్తుంటారు. పెసర పంట 30 రోజుల్లో పూత, కాత దశకు చేరుతుంది. తెగుళ్లు , పురుగులు ఆశించి పెసర పంటకు నష్టం కలిగిస్తాయి. రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. పెసర పంటను ప్రధానంగా ఆశించే తెగుళ్లు, వాటి నివారణపై రైతులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.
పెసరలో తెగుళ్లు, నివాణ చర్యలు ;
పొగాకు లద్దె పురుగు ; పొగాకు లద్దె పురుగు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని తినడం వల్ల ఆకులు తెల్లగా మారతాయి. పువ్వులను , పిందెలను కూడా తినేస్తాయి. ఈ పురుగు రాత్రిపూట ఎక్కువగా తిరుగుతుంది. పగలు మొక్కల మొదళ్లలో , భూమిలోకి చేరతాయి. నివారణకు విషు ఎర వెదజల్లాలి. ఎకరాకు మోనో క్రోటోఫాస్ 50 మిల్లీ లీటర్లు, 5కిలోల తవుడు, అరకిలో బెల్లం సరిపడా నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంత్రం సమయంలో వెదజల్లాలి. నోవాల్సరాన్ ఒక మిల్లీలీటర్ లేదా థయోడికార్బ్ ఒక గ్రామును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
తామర పురుగులు ; తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీలుస్తాయి. ఆకు ముడత తెగులును తామర పురుగులు వ్యాప్తి చేస్తాయి. ఆకులు అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గడసబారి రాలిపోతాయి. అడుగు భాగంలో ఈనెలు రక్తవర్ణాన్ని పోలి ఉంటాయి. లేత దశలో మాడి మొక్కలు ఎండుతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి తక్కువ కాపు ఉంటుంది. నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టాలి.
పల్లాకు తెగులు ; తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపు పొడలు ఏర్పడతాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తిస్తుంది. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీ లీటరు మోనో క్రొటోపాస్ కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగులు ; విత్తిన 30 రోజుల తరువాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్న సమయంలో ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్నిచిన్న మచ్చలు కనబడతాయి. క్రమేపి అవి పెద్దవై ఆకుల అడుగు బాగాలకు వ్యాప్తి చెందుతాయి. నివారణకు ఒక గ్రాము కార్భండిజమ్ లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
1Imran Khan: భారత్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.. అసలు విషయం ఏమిటంటే..
2బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి సక్సెస్ సెలబ్రేషన్స్
3Twin Brother Rape : కవల సోదరులు : మరదలితో ఆరు నెలలుగా ఎఫైర్.. చివరికి నిజం తెలిసి..!
4Revanth reddy: జయశంకర్ సార్ స్వగ్రామాన్నే మరుస్తారా..? రెండు అంశాలపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
5Oscar Awards : ఇకపై ఆ సినిమాలకి ఆస్కార్ ఇవ్వం.. ఆస్కార్ అవార్డులకు పోటీ పడాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..
6Diamonds: జొన్నగిరిలో రెండు వజ్రాలు లభ్యం
7Benz: 1955 నాటి బెంజ్.. ధర రూ.1,117 కోట్లు
8Dhanush: కతిరేసన్ దంపతులకు ధనుష్ నోటీసులు
9Road accident: తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. 10మంది మృతి..
10Srisailam Reservoir : శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం