Muskmelon Cultivation : కర్భూజ సాగులో తెగుళ్లు, యాజమాన్యపద్దతులు Pests and Ownership in Muskmelon Cultivation

Muskmelon Cultivation : కర్భూజ సాగులో తెగుళ్లు, యాజమాన్యపద్దతులు

కాయలు పక్వ దశకు వచ్చే సమయంలో మార్కెట్ సదుపాయాన్ని చూసుకోని కోయాలి. సాధారణంగా మర్కెట్ దూరంగా వున్న ప్రదేశాలకు తరిలించాలనుకుంటే కాయలు సగం పక్వ దశకు రాగానే పంట కోసి తరలించాలి.

Muskmelon Cultivation : కర్భూజ సాగులో తెగుళ్లు, యాజమాన్యపద్దతులు

Muskmelon Cultivation : అధిక నీటిశాతం కలిగి వేసవిలో లభించే పండ్లలో ఖర్జూజా ఒకటి. ఇటీవలి కాలంలో ఖర్భుజాను ఆహారంలో భాగం చేసుకునే వారి సంఖ్య పెరగటంతో మార్కెట్లో ఈ పంటకు మంచి గిరాకీలభిస్తుంది. కర్భూజ సాధారణంగా 30 నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత, పొడి వాతావరణంలో పండించ గలిగే స్వల్ప కాలిక వాణిజ్య పంట. సాధారణంగా 27-30 డిగ్రీల ఉష్ణోగ్రతలో విత్తన మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. పూత సమయంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే పిందెలు తక్కువగా ఏర్పడుతాయి.

ఖర్భూజా పంటలో అనేక రకాలను ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్నారు. వీటిలో అర్క జీత్, అర్క రాజహాన్స్, దుర్గాపుర మధు, హరా మధు, పంజాబ్ హైబ్రిడ్, పూస మధురస్, పూస రస్ రాజ్. ప్రైవేట్ రకాలు: ఎన్. ఎస్. 910, ఎన్. ఎస్. 7455, సన్-2, సూర్య, సూరజ్, కుందన్, గోల్డెన్ గ్లోరీ, గాయత్రి, కాంచన్ మరియు కోహినూర్ మొదలైనవి సాగుకు అనుకూలంగా ఉంటాయి. విత్తన మోతాదుకు సంబంధించి సూటి రకాలు 500-600 గ్రాములు ఎకరాకు మరియు హైబ్రిడ్ రకాలు 300 గ్రాములు ఎకరాకు సరిపోతాయి.

కాయలు పక్వ దశకు వచ్చే సమయంలో మార్కెట్ సదుపాయాన్ని చూసుకోని కోయాలి. సాధారణంగా మర్కెట్ దూరంగా వున్న ప్రదేశాలకు తరిలించాలనుకుంటే కాయలు సగం పక్వ దశకు రాగానే పంట కోసి తరలించాలి. ఈ సమయంలో కాయలు పక్వము చెంది, నాణ్యత బాగుంటుంది. పూర్తి పక్వము చెందిన కాయలలో చక్కెర శతం ఎక్కువుగా ఉంటుంది.

తెగుళ్లు, సస్యరక్షణ ;

మొజాయిక్ తెగులు: మొజాయిక్ లక్షణాలు మొదట లేత ఆకులపై కన్పిస్తాయి. క్రమేపి ఇట్టి ఆకులు క్రిందకు ముడుచుకొని, ఆకారంగా కోల్పోయి, గరుకుగా, పరమాణం తగ్గి కన్పిస్తాయి. మొక్కల కణుపులు దగ్గరగా అవటం వలన తీగ సరిగ్గా సాగకుండా లేత ఆకులు గులాబి పూవ్వు మాదిరిగా ఒక్క చోటనే అంటిపెట్టుకొని ఉంటాయి. కాయలు తరచు ఆకారం కోల్పోయి బొబ్బలతో కన్పిస్తాయి.

బూడిద తెగులు: ఇది పొడి వాతావరణ కాలాల్లో ఎక్కువగాను తేమతో కూడిన వాతావరణంలో తక్కువగాను ఆశిస్తుంది. ప్రధానంగా ఆకులపై భాగంలో తెల్లని బూడిద వంటి శిలీంద్రం పెరుగుతుంది. కాని కొన్ని సందర్భాలలో ఆకు అడుగున మరియు కాండంపై కూడా కనిపిస్తుంది. తెగులు ఆశించిన ఆకులు పసుపు రంగుకు మారి వడలిపోతాయి. ఆకులు మరియు కాండం ఎండిపోవడం వలన తీగ సాగదు, కాయలు తక్కువగా, చిన్నవిగా ఉంటాయి. దీని నివారణకు దోస జాతి సంబంధమైన అడవి మొక్కలను దగ్గరలో పెరగకుండ పీకి వేయాలి. పంట అవశేషాలను తగుల బెట్టాలి. దీని నివారణకు ట్రైడిమార్ఫ్ 1 మి.లీ. లేదా అజాక్సీస్ట్రోబిన్ 0.1 గ్రా. లేదా మైక్లోబుటానిల్ 1 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1 గ్రా. లేదా హెక్సాకొనజోల్ 1 గ్రా. లేదా డైఫెనకొనజోల్ 0.5 గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు.

పండు ఈగలు: ఈ పండు ఈగలు దోసజాతి కూరగాయలను దేశంలో అన్ని ప్రాంతాలలో ఆశిస్తాయి. లార్వాలు కాయలలో గజ్జుని తిని కలుషితం చేస్తాయి. ఈ దశలో తల్లిపురుగులు గ్రుడ్లను పెట్టడానికి చేసిన రంధ్రాల ద్వారా రసం కారడం గమనించవచ్చును. ఈ రంధ్రాల ద్వారా శిలీంధ్రము మరియు బాక్టీరియా ప్రవేశించి కాయ కుళ్ళటమే కాక కాయలు ఎదగక ఆకారం కోల్పోయి చివరిగా రాలిపోతాయి. ఖర్భూజా నాటిన తరువాత కలుపుకు నియంత్రణ చర్యలు చేపట్టాలి. లేకపోతే దాని ప్రభావం దిగుబడిపై పడుతుంది. కలుపు ద్వారా వచ్చే చీడపీడలు పంటను ఆశించకుండా చూసుకోవచ్చు.

×