Toor Dal : కందిపంటలో చీడపీడలు…సస్యరక్షణ

విత్తనం నాటే ముందు పొలాన్ని లోతుగా దున్నుకోవాలి. కలుపు లేకుండా, అధికవర్షాలు పడితే నీరు నిల్వ ఉండకుండా ఏర్పటు చేసుకోవాలి. పురుగులను ఆకర్షించే పూల మొక్కలను పొలం చుట్టూ పెంచడం వల్ల పంటపై చీడపీడల ప్రభావం తగ్గుతుంది.

Toor Dal : కందిపంటలో చీడపీడలు…సస్యరక్షణ

Toor Dal Cultivation

Toor Dal : కందికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. పప్పుధాన్యపు పంటల్లో ఇదికూడా ఒకటి. కందులను దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏటా రైతులు అధిక మొత్తంగా సాగు చేస్తున్నారు. అయితే, కందిలో వచ్చే పలు రకాల తెగుళ్లు, చీడపీడలు ఆశించడం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. దీంతో రైతు ఆదాయం కూడా తగ్గుతుంది.

కంది పంట మొగ్గ, పూత,కాయ దశల్లో వర్షం లేదా చిరు జల్లులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు కాయ తొలిచే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. వాటిలో ముఖ్యంగా మారుక మచ్చల పురుగు,శనగ పచ్చ పురుగు, కాయ తొలిచే ఈగ, మరియు కాయ రసంపీల్చే పురుగులు (బగ్స్) ప్రధానమైనవి. కావున రైతు సోదరులు ఈ పురుగుల ఉధృతిని అదుపులో ఉంచి అధిక దిగుబడులు సాధించాలంటే సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటించాలి.

కందిపంటలో ప్రధానంగా వచ్చే సమస్య.. కాయతొలిచే పురుగు పంటను ఆశించడం. కంది పంట మొగ్గదశ, పూత, కాయ దశల్లో కొయ తొలిచే పురుగులు పంటను ఆశిస్తాయి. అలాగే, వరుసగా వర్షం పడుతుండటం, చిరుజల్లులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు కందిపంటపై కాయతొలుచు పురుగు దాడి అధికంగా ఉంటుంది. కందిపంట సాగు చేయాలని నిర్ణయించుకున్న అనంతరం పొలంలో లోతు దుక్కులు దున్నాలి. పొలంలో ఇతర పంట అవశేషాలు లేకుండా శుభ్రంగా చేయాలి. గడ్డిజాతి మొక్కలు లేకుండా నివారించుకోవాలి. అధిక వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తపడాలి.

విత్తనం నాటే ముందు పొలాన్ని లోతుగా దున్నుకోవాలి. కలుపు లేకుండా, అధికవర్షాలు పడితే నీరు నిల్వ ఉండకుండా ఏర్పటు చేసుకోవాలి. పురుగులను ఆకర్షించే పూల మొక్కలను పొలం చుట్టూ పెంచడం వల్ల పంటపై చీడపీడల ప్రభావం తగ్గుతుంది. పంటను చీడపీడలు ఆశిస్తున్నాయనే గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు తీసుకుంటే పంటపై ప్రభావం ఎక్కువ పడకుండా ఉంటుంది. కాయతొలుచు పురుగుల నివారణ కోసం లింగాకర్షక బుట్టలు అమర్చుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. పురుగులను ఆకర్శించే పూల మొక్కలు పొలం చుట్టూ అక్కడ అక్కడ వేసుకోవాలి. పురుగుల గుడ్లు, తొలి దశ పిల్ల పురుగులు, తర్వాత దశ లద్దె పురుగులు, మరియు కోశస్థ దశ పురుగులను కిరోసిన్ కలిపిన నీటిలో ముంచి నాశనం చేయాలి. ఎకరానికి ఒక్క లైట్ ట్రాప్ అమర్చుకోవాలి.

శనగపచ్చ పురుగు, మారుక మచ్చల పురుగుల ఉదృతిని అంచనా వేయడానికి ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలు అమర్చాలి. వీటి ఉధృతిని అదుపులో ఉంచుటకు ఎకరానికి 10- 12 బుట్టలను అమర్చుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి బ్యాసిల్లస్ తురింజెన్సీస్ ఎకరానికి 300 గ్రాములు పిచికారి చేయాలి. మొగ్గ దశలో పురుగు ఉధృతిని బట్టి వేప నూనె 1500 పి పి ఎం, @ 5 మి. లి, లేదా లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయం.అవసరాన్ని బట్టి రసాయనిక మందులను తగిన మోతాదులో పిచికారీ చెయ్యాలి.

కాయతొలిచే పురుగు పంటను తొలిదశలో ఆశిస్తే.. ఎసిఫేట్ 1.5 గ్రాములు, మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీ లీటర్లు, ఇండాక్సాకార్చ్, క్వినాల్ ఫాన్ 2.0 మిల్లీ లీటర్లు పిచికారి చేసుకోవాలి. మారుక మచ్చల పురుగు పంటను ఆశిస్తే క్లోరిపైరిపాస్ 2.5 మి.లీ. , ప్రొఫెనోఫాస్ 2.0 మీ.లీ, నోవాల్యూరాన్ 0.75 మి. లీ. పంటపై పిచికారీ చేయాలి. శనగ పచ్చ పురుగును పంటపొలంలో గమనిస్తే ఎసిపేట్ 1.5 గ్రా. క్వినాల్ ఫాస్ 2.0 మి. లి, క్లోరాంట్రానిప్రోల్ 0.3 మి. లీ, లామ్డాసైహలోత్రిన్ 1.మిలీ. పిచికారీ చేయాలి.