Natu Kodi Farming : నాటుకోడి పచ్చళ్లతో.. లాభాలు ఆర్జిస్తున్న పి.హెచ్.డి స్టూడెంట్

ఇంటి పట్టునుండే మహిళలకు కోళ్ల పెంపకం చాలా సులువు. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. వీటికి ధాన్యం ఖర్చు ఉండదు. ఇళ్లలో దొరికే మెతుకులు, ధాన్యం గింజలు, పప్పులు , కూరగాయల వ్యర్ధాలు తిని కడుపు నింపుకుంటాయి.

Natu Kodi Farming : నాటుకోడి పచ్చళ్లతో.. లాభాలు ఆర్జిస్తున్న పి.హెచ్.డి స్టూడెంట్

Natu Kodi Farming

Natu Kodi Farming : వసాయ అనుబంధ రంగాల్లో పాడికంటే మేలైంది కోడి. పెట్టుబడి, పర్యవేక్షణ, రోజువారి శ్రమ , నిర్వహణ, మార్కెటింగ్ ఎందులోనైనా కోళ్ల పెంపకమే ఉత్తమం. అదనపు ఆదాయం పొందాలనుకునే సన్నకారు, చిన్నకారు రైతులు, ఇంటి పట్టునుండే మహిళలకు కోళ్ల పెంపకం చాలా సులువు. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. వీటికి ధాన్యం ఖర్చు ఉండదు. ఇళ్లలో దొరికే మెతుకులు, ధాన్యం గింజలు, పప్పులు , కూరగాయల వ్యర్ధాలు తిని కడుపు నింపుకుంటాయి. ఉదయం పూట ఎక్కడ తిరిగినా రాత్రిపూట ఇంటికి చేరుకుంటాయి.

అయితే పిల్లుల నుండి కాపాడుకుంటే చాలు. అవే అభివృద్ధి చెందుతాయి. అందుకే ఇప్పుడు చాలా మంది రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పెరటి కోళ్ల పెంపకం చేపడుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా , గన్నవరం మండలం, వెంకటనరసింహపురానికి చెందిన యువకుడు కంప కిషోర్. ఒక పక్క పి.హెచ్.డీ చేస్తూనే మరో పక్క నాటుకోళ్ల పెపకాన్ని చేపడుతూ స్వయం ఉపాధి పొందుతున్నాడు.

READ ALSO : Black Soldier Fly : కోళ్ళ వ్యర్ధాల సమస్యకు చక్కని పరిష్కారం బ్లాక్ సోల్జర్ ఫ్లై!

సొంతకాళ్లపై నిలబడాలని ఎలాంటి ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నించ కుండా కోళ్ల పెంపకంపై ఉన్న మక్కువతో..   స్వగ్రామంలోనే నాటుకోళ్ల పెంపకం చేపట్టాడు.  7 డే నాటుకోడి హబ్ పేరుతో చిన్న పాటి షెడ్ ఏర్పాటు చేసి.. వినియోగదారులకు మేలుజాతి నాటుకోడి మాంసాన్ని అమ్ముతున్నారు. అంతే కాదు ఆర్డర్లపై నాటుకోడి పచ్చళ్లు తయారుచేసి సరఫరా చేస్తున్నారు. ఒక పక్క పి.హెచ్.డీ చేస్తూనే మరో పక్క నాటుకోళ్ల పెపకాన్ని చేపడుతూ స్వయం ఉపాధి పొందుతున్నాడు.

వ్యవసాయానికి అనుబంధంగా చిన్నప్పటి నుండే నాటు కోళ్లు పెంపకం చేపట్టడాన్ని అలవాటు చేసుకున్న ఈయన చుట్టు ప్రక్కల గ్రామాల్లో పెద్దజాతి కోళ్లను సేకరించి వాటి తనకున్న రెండున్నర సెంట్లలో నాటుకోడి హబ్ పేరుతో పెంపకం చేపడుతున్నాడు. అవి పెట్టే గుడ్లను సంప్రదాయ బద్ధంగానే పొదిగించి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నాడు. 20 ఏళ్లుగా నాటుకోళ్ల పెంపకం చేపడుతున్న కిషోర్, ప్రతి వారం దాదాపు 80 నుండి 100 కోళ్లను మార్కెట్ చేస్తాడు. అంతే కాదు, నాటు కోడి మాంసంతో పచ్చళ్లు పెట్టి వారానికి ఒక సారి అమ్ముతూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నాడు.

READ ALSO : Guinea Fowl Farming : గ్రామీణ రైతులకు అదనపు అదాయాన్ని అందించే గినీ కోళ్ళ పెంపకం!

చూశారుగా, నాటుకోళ్లే కదా…అని తేలిగ్గా తీసేసే పరిస్థితిలో వీటి పెంపకం లేదు. కోళ్ల పెంపకం నుండి మంచి ఆదాయం  పొందుతున్న యువరైతు కిషోర్  ఆదాయ వ్యయాలు లెక్కించేకంటే, నాటు కోళ్లలో ఇంత విషయం వుందా! అనుకునేలా చేస్తూ.. మిగితా రైతులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.