Amaranth Cultivation : తోటకూర సాగులో సస్యరక్షణ

విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నని ఇసుకతో కలిపి వేయాలి. కోత రకాలలో విత్తన 25 రోజులకు మొదటిసారిగా తరువాత ప్రతి వారం నుండి 10 రోజులకు ఒక కోత వస్తుంది.

Amaranth Cultivation : తోటకూర సాగులో సస్యరక్షణ

Amaranth

Amaranth Cultivation : మన రాష్ట్రంలో పండించే ఆకుకూరల్లో తోటకూర ముఖ్యమైనది. ఆకుకూరలు సమీకృత పోషకాహారంలో చాలా ముఖ్యమైన భాగం. వేసవి మరియు వర్షాక్రాలంలో పండించే
ముఖ్యమైన ఆకుకూరల్లో తోటకూర ఒకటి. ఇందులో మాంసకృత్తులు, లవణాలు, కాల్షియం, ఇనుము, విటమిన్‌ ఎ, సి అధికంగా వుంటాయి. వివిధ శీతోష్ట పరిస్థితులో పెంచటానికి అనువైనది. నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. శీతాకాలంలో ఉష్టోగ్రత 15సెంటీ కంటే తక్కువ వుంటే పెరుగుదల సరిగా వుండదు. ఇనుకతో కూడిన గరపనేల అనుకూలం. నీరు నిలిచే బంక మట్టి నేలలు, ఇనుక నేలలు పనికి రావు.

తోట కూర విత్తనాలకు సంబంధించి కో1, కో2, కో3, కో4, కో5, పూసా, చోటి చౌలై, పూసాబడి చౌలై, పూసా కీర్తి, పూసా కిరణ్, పూసాలాల్ చౌలై, ఆర్ఎన్ ఎ 1, ఆర్క సుగుణ వంటి రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. విత్తనాలు వేసుకునే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్మిదున్నాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. మళ్ళను బాగా చదునుగా చేసుకోవాలి. మడుల్లో పలుచగా విత్తుకోవాలి. ఎకరాకు 800 గ్రాముల చొప్పున విత్తనం అవసరమవుతుంది. విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నని ఇసుకతో కలిపి వేయాలి. కోత రకాలలో విత్తన 25 రోజులకు మొదటిసారిగా తరువాత ప్రతి వారం నుండి 10 రోజులకు ఒక కోత వస్తుంది. 90 రోజులలో ఎకరాకు 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మొక్కలను వేర్లతో సహా పీకి కట్టలు కడితే ఎకరాకు 3 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.

తోటకూరలో సస్యరక్షణ ;

శెల్లమచ్చ తెగులు : ఆకుల అడుగు భాగాన తెల్లటి బుడిపెలవంటివి ఏర్చడతాయి. అకుపైభాగాన లేత వసువు రంగు మచ్చలు ఏర్పడి, ఎండిపోతాయి. దీని నివారణకు లీబరు నీటికి ౩గ్రా, కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా 2.5గ్రా మాంకోజెబ్‌ మందును కలిపి పిచికారీ చేయాలి. ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా చూడాలి.

ఆకుల తినే గొంగలి పురుగులు : చిన్న, పెద్ద పురుగులు అకులను కొరికి వేయడం వలన అకులు పనికి రాకుండా పోతాయి. మార్కెట్‌లో సరైన రేటు లభించదు. వీటి నివారణకు మలాథియాన్‌ 2 మి.లీ. లీబరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన తర్వాత కనీసం 10 రోజుల వ్యవధి ఇచ్చి కోయాలి. మొక్కలేత దశ నుండి వేప సంబంధిత పురుగు మందులను 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసినట్లయితే పురుగులు ఆశించవు.