Watermelon Cultivation : పుచ్చకాయ సాగులో సస్యరక్షణ

వాతావరణంలో ఉష్ణోగ్రత 20 నుండి 30 మధ్య ఉన్నప్పుడు దిగుబడి బాగుంటుంది. గింజలు నాటుకునే సమయంలో వాతావరణంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే గింజలు ఎక్కువ స్థాయిలో మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది.

Watermelon Cultivation : పుచ్చకాయ సాగులో సస్యరక్షణ

Watermelon Cultivation

Watermelon Cultivation : తీగ జాతి పంటలు లో అతి ప్రధానమైనది పుచ్చకాయ సాగు. గుండ్రటి ఆకారంలో పొడవు ఆకారంలో లభ్యమవుతాయి. ఒక్క కాయ 2 నుండి 5 కేజీల బరువు వరకు ఉంటాయి. వేసవి కాలం వచ్చిందంటే ప్రతి మార్కెట్ లో రైతుబజార్లలో విరివిగా కనిపిస్తాయి. ఉష్ణ తాపంతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది దీని సాగు విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతుంది.

వేసవికాలంలో దీని ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది గాలిలో తేమశాతం ఎక్కువగా ఉన్నా ప్రాంతాలలో సాగు అనుకూలంగా ఉంటుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత 20 నుండి 30 మధ్య ఉన్నప్పుడు దిగుబడి బాగుంటుంది. గింజలు నాటుకునే సమయంలో వాతావరణంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే గింజలు ఎక్కువ స్థాయిలో మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. పుచ్చకాయ కు వేసవికాలంలో చాలావరకూ డిమాండ్ ఉంటుంది. సరైన యాజమాన్య పద్దతుల్లో పుచ్చసాగు చేపడితే దిగుబడులను సాధించి మంచి లాభాలను పొందవచ్చు.

పుచ్చకాయ సాగు ఆర్క మాణిక్, ఆర్కా జ్యోతి, షుగర్ బేబీ, దుర్గాపూర్, కేసర్, అసహిమామట వంటి రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. సంకరజాతి రకాలైనటువంటి ఎన్.ఎస్ 295, అపూర్వ, మధుబాల, వసుధ, కృష్ణ, సుప్రీత్, ఐశ్వర్య, మొదలైన పెద్ద రకాలను మరియు కిరణ్, అరుణ్, మాక్స్, రాజా, షుగర్ క్విన్, కిరణ్, సుమన్, బ్లాక్ మ్యూజిడ్, ఎన్.ఎస్20,ఎన్.ఎస్34 మొదలైన సంకరజాతి చిన్న రకాలను రైతులు వారి వారి ప్రాంతాలకు అనుకూలంగా విత్తనాలను ఎంచుకొని సాగు చేపట్టవచ్చు. ఎకరం పొలంలో పుచ్చ కాయను సాగు చేయడానికి 400 గ్రాముల నుండి 500 గ్రాముల విత్తనం సరిపోతుంది.

పుచ్చలో చీడపీడల నివారణ ;

రసంపిల్సేపురుగు : పంటలో రసం పీల్చే పురుగులు ఆశించిన అప్పుడు తీగల ఆకుల అడుగుభాగాన చేరి తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుపోతాయి. రసం పీల్చే పురుగుల ఉద్బుతి ఎక్కువగా ఉన్నప్పుడు తీగల చివర లేత ఆకులు కుచ్చులు కుచ్చులుగా ముడుచుకుంటాయి. నివారణ గాను ఫిప్ రోనిల్ 5%ఎస్.సి మందును లీటర్ నీటికి 4 మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకుని పిచికారి చేసుకోవాలి లేదా డిఫెంథియురాన్ 50%డబ్ల్యూపీ లీటర్ నీటికీ 2.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకొని ఈ రసం పీల్చే పురుగులను నివారించవచ్చు.

బూజు తెగులు : జనవరి నెలలో మంచుతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు చలి ఎక్కువగా ఉన్నప్పుడు తీగల కాండంపై తెల్లటి బూజు లాంటి పదార్థం ఏర్పడి తర్వాత అది నలుపు రంగు మచ్చల మారి తీగ కుళ్ళిపోతుంది నివారణ గాను అజోక్సిస్ట్రోబిన్ 23%ఎస్.సి లీటర్ నీటికి 1 మిల్లీ లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి లేదా జిరామ్27%ఎస్.సి లీటర్ నీటికి 4 మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

కాయకుళ్ళు తెగులు : కాయలు సరైన పక్వానికి రాకముందు కాయలపై మచ్చలు ఏర్పడి కుళ్ళిపోవడం జరుగుతుంది. కుళ్ళిన కాయలను గమనించినట్లయితే ఎదుగుదల లేకుండా లోపల కండ భాగం కుళ్ళి వాసన కలిగి ఉంటుంది. నివారించడానికి ట్రిఫ్లోక్సిస్ట్రోబిన్25%డబ్ల్యూజీ లీటరు నీటికి ఒక గ్రామ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి లేదా అజోక్సిస్ట్రోబిన్23%ఎస్.సి లీటర్ నీటికి 1 మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి.