Stem Cuttings : దానిమ్మలో కొమ్మ కత్తిరింపులతో కాయసైజు పెరగటంతోపాటు అనేక ప్రయోజనాలు!

దానిమ్మ పొదలా పెరిగే స్వభావం కల్గింటుంది. అందువలన భూమట్టం నుంచి అనేక సంఖ్యలో కొమ్మలు వస్తాయి. అన్ని కొమ్మలని వదిలేస్తే గాలి చొరబడకుండా గుబురుగా పెరిగి కాండం తొలిచే పురుగులు మరియు తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి.

Stem Cuttings : దానిమ్మలో కొమ్మ కత్తిరింపులతో కాయసైజు పెరగటంతోపాటు అనేక ప్రయోజనాలు!

Pomegranate stem cuttings

Stem Cuttings : దానిమ్మ ఉష్ణ మండలం , శీతాకాలం చల్లగా, ఎండాకాలం వేడిగా ఉండే మెట్ట ప్రదేశాలలో బాగా పండుతుంది. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. కాయ ఎదిగే దశలోను, పండే దశలోను పొడిగా, వేడిగా ఉండే వాతావరణం అవసరం. ఉష్ణోగ్రత తగినంత ఎక్కువగా లేకపోతే కాయలు తీయగా ఉండవు. తేమ ఉన్న ప్రాంతాలలో కాయ నాణ్యత దెబ్బతింటుంది. దానిమ్మ అనేక రకాలైన నేలల్లో సాగు చేయవచ్చు. మిగతా పండ్ల చెట్లను సాగుచేయలేని నేలల్లో కూడా ఈ పంట పండించువచ్చు. సున్నం శాతం ఎక్కువ గల భూముల్లోను, కొద్దిగా క్షారత అధికంగా ఉన్న భూముల్లో  దానిమ్మ సాగు చేపట్టవచ్చు.

దానిమ్మలో కొమ్మ కత్తిరింపుల వల్ల ప్రయోజనం ;

దానిమ్మ పొదలా పెరిగే స్వభావం కల్గింటుంది. అందువలన భూమట్టం నుంచి అనేక సంఖ్యలో కొమ్మలు వస్తాయి. అన్ని కొమ్మలని వదిలేస్తే గాలి చొరబడకుండా గుబురుగా పెరిగి కాండం తొలిచే పురుగులు మరియు తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని బలంగా ఉన్నా 3-4 కాండాలను మాత్రమే వుంచి మిగిలిన వాటిని కత్తిరించి తీసివేయాలి.  భూమి నుండి ఒకే భూమట్టం నుండి 1-11/2 అడుగుల ఎత్తుతో వచ్చే కొమ్మల్లో నాలుగు వైపులా విస్తరిస్తున్న 3-5, బలమైన ప్రధాన కొమ్మల్ని ఉంచి మిగతా వాటిని కత్తిరించు కోవాలి.

కత్తిరించిన భాగాలకి వెంటనే ఒక శాతం బోర్డ్పెస్ట్ రాయాల్సి ఉంటుంది. 3-4 సంవత్సరాల వయసు గల చెట్లలో అడ్డదిడ్డంగా పెరుగుతున్న బొమ్మలను, రెమ్మలను నిట్టనిలువుగా పెరిగే నీటి పిలకలను, ఎండిన కొమ్మలను తెగులు సోకిన కొమ్మలను తీసి వేయడం వల్ల అన్ని భాగాలకు గాలి వెలుతురు సోకి పంట దిగుబడి అధికంగా ఉంటుంది. చెట్లలోని చివరి కొమ్మలను 6-9 అంగుళాల పొడవున్న చివర కొమ్మలను కత్తిరించాలి. దీనివల్ల బలమైన కొమ్మల మీద పిందెలు ఏర్పడి కాయ సైజు పెరగటంతోపాటు నాణ్యత బాగా ఉంటుంది.