Poultry Farming : కాంట్రాక్ట్ ఫార్మింగ్ తో పౌల్ట్రీ రైతులు సేఫ్.. పెట్టుబడి లేకుండానే బ్రాయిలర్ కోళ్ల పెంపకం

బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో రైతులు ఒకేసారి తీసుకొచ్చి ఒకేసారి అమ్మే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో వ్యాధులు బెడద తక్కువగా వుంటుంది.  ప్రతి రెండు నెలలకు ఒక బ్యాచ్ చొప్పున పెంచవచ్చు. ఒక్కో బ్యాచ్ 40 రోజులకే పూర్తయినా మిగతా సమయాన్ని షెడ్ల పరిశుభ్రతకు, డిస్ ఇన్ఫెక్షన్ చేయటానికి కేటాయించాలి.

Poultry Farming : కాంట్రాక్ట్ ఫార్మింగ్ తో  పౌల్ట్రీ రైతులు సేఫ్.. పెట్టుబడి లేకుండానే బ్రాయిలర్ కోళ్ల పెంపకం

Poultry Farming

Poultry Farming : స్వల్పకాలంలో అత్యధిక మాంసోత్పత్తినిచ్చే కోళ్లు బ్రాయిలర్ కోళ్లు. కేవలం 40 నుండి 42 రోజులలోనే 2 నుండి రెండున్నర కిలోల బరువు పెరిగి మార్కెట్ కు సిధ్దమవుతాయి. ఏడాదికి  6 నుండి 7 బ్యాచ్ లుగా రైతులు వీటి పెంపకాన్ని చేపడుతున్నారు. బ్రాయిలర్ కోళ్ల మాంసానికి మార్కెట్లో వన్నె తరగని డిమాండ్ వుండటంతో ఈ పరిశ్రమ లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

అయితే  కాంట్రాక్టు ఫార్మింగ్ పేరుతో ఇప్పుడు కొన్ని కంపెనీలు కోళ్ల పెంపకానికి అవసరమైన పెట్టుబడితోపాటు, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయి. ఈ విధానంలో పెద్ద ఎత్తున రైతుకు లాభాలు రాకపోయినా…  రిస్కు తగ్గింది. బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో ఏలూరు జిల్లా, కాల్ రాయిగూడెం గ్రామ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కోళ్ల పరిశ్రమలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందజలో వున్నాయి. గత దశాబ్ధకాలంలో కోళ్ల పరిశ్రమ ఏటా  వృద్ధిరేటును కనబరుస్తూ దూసుకుపోతోంది.  ప్రధానంగా బ్రాయిలర్ కోళ్లు, అతి తక్కువ కాలంలో అంటే 5 నుండి 6 వారల్లో, 3 నుండి మూడున్నర కిలోల దాణా తిని 2 నుంచి రెండున్నర కిలోల బరువుకు చేరుకోవటంతో అతి తొందరగా మాంసోత్పత్తినిచ్చే జాతిగా పేరొందింది.

READ ALSO : Sameekrutha Vyavasayam : కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు పెంచుతున్న ఏలూరు జిల్లా రైతు

గుడ్లకోళ్ల తర్వాత ఈ మాంసపుజాతి కోళ్ల పెంపకం మన ప్రాంతంలో అతిపెద్ద పరిశ్రమగా విస్తరించింది. సామాన్యుడికి అందుబాటు ధరలో లభించేది కూడా బ్రాయిలర్ మాంసమే. అయితే ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల వల్ల రైతులకు ఈ పరిశ్రమలో లాభనష్టాలమాట పరిపాటిగా మారింది. ప్రస్థుతం కిలో లైవ్ కోడి ధర 110రూ.లు పైన ఉంటేనే పరిశ్రమ లాభదాయకంగా వుంటుంది. కానీ ఒక్కో సమయంలో మార్కెట్ ధర, ఉత్పత్తి ఖర్చు కన్నా కిందకి పడిపోయి రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఎక్కువకాలం ధర ఆశాజనకంగా వుండటం వల్ల ఒక బ్యాచ్ లో కాకపోతే మరో బ్యాచ్ లో అయినా రేటు కనిసొస్తుండటం వల్ల రైతులు బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో రైతులు ఒకేసారి తీసుకొచ్చి ఒకేసారి అమ్మే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో వ్యాధులు బెడద తక్కువగా వుంటుంది.  ప్రతి రెండు నెలలకు ఒక బ్యాచ్ చొప్పున పెంచవచ్చు. ఒక్కో బ్యాచ్ 40 రోజులకే పూర్తయినా మిగతా సమయాన్ని షెడ్ల పరిశుభ్రతకు, డిస్ ఇన్ఫెక్షన్ చేయటానికి కేటాయించాలి. సంవత్సరానికి 6 నుంచి 7బ్యాచ్ లుగా  రైతులు ఈ కోళ్లను పెంచుతున్నారు.

READ ALSO : Harvesting Chillies : మిర్చి కోతల సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలు !

సాధారణంగా ఎకరం స్థలంలో 24 వేల కోళ్లను పెంచుకోవచ్చు. తూర్పు, పడమర దిశగా షెడ్లు నిర్మించి, షెడ్ల మధ్య రెండింతల ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టాల్సి వుంటుంది. ఈ కోళ్ల పెంపకానికి సాధారణంగా డీప్ లిట్టరు పద్ధతి అనుకూలంగా వుంటుంది. ప్రతి 50కోళ్లకు ఒక ఫీడరు, డ్రింకరు వుండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే  అతి తక్కువసమయంలో అనుకున్న విధంగా మాంసోత్పత్తిని సాధించవచ్చని ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం, కాల్ రాయిగూడానికి చెందిన రైతు నందిగం సీతారాం తిలక్. తెలియజేస్తున్నారు,

కోళ్ల పెంపకంపై 20 ఏళ్ల అనుభంతో పాటు, కంపెనీల ప్రోత్సాహంతో కాంట్రాక్ ఫార్మింగ్ విధానంలో పెంపకం చేపడుతున్నారు. షెడ్ల వసతి, కరెంటు సౌకర్యం వుంటే చాలు, కోడి పిల్లలతోపాటు, దాణా, మందులు, తగిన సాంకేతిక సహాయాన్ని కంపెనీవారు అందిస్తారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో రిస్కు తగ్గిందని, వ్యవసాయం కంటే, ఈ పరిశ్రమ ఆశాజనకంగా వుందని రైతు చెబుతున్నారు.

READ ALSO : Viruses In Chickens : కోళ్ళలో వైరస్ ల ప్రభావంతో వచ్చే వ్యాధులు! తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్లకు 5 వ రోజునుంచి 3 దఫాలుగా కంపెనీవారే వ్యాక్సిన్ లు అందించటం వల్ల కోళ్ల ఆరోగ్యసంరక్షణ రైతుకు సులభంగా మారింది. నిబంధనల మేరకు 3.5కిలోల దాణా తీసుకున్న కోడి 2.2 కిలోల బరువు పెరగాలి. తక్కువ దాణా తిని కోడి త్వరగా బరువుకు వచ్చినా, మరణాల శాతం 3కన్నా తక్కువగా వున్నా, రైతుకు అదనంగా రాయల్టీరూపంలో కొంత మొత్తం అదనంగా చెల్లిస్తారు.