Mangoes Harvesting : మామిడిలో కాయకోతల సమయంలో జాగ్రత్తలు!

నిషేదించిన పురుగు మందులను కాయలపై పిచికారి చేయకూడదు. వీలైనంత వరకు సేంధ్రీయ పురుగు మందులను మాత్రమే వాడాలి. కోత తరువాత వచ్చే తెగుళ్ల నివారణకు తోటలో ముందు నుండే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

Mangoes Harvesting : మామిడిలో కాయకోతల సమయంలో జాగ్రత్తలు!

Harvesting Mangoes

Mangoes Harvesting : మామిడి కాయల కోత సమయంలో రైతులు సరైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కాయల ఎగుమతికి నాణ్యత అనేది అత్యంత ముఖ్యమైనది. కోత దశలో జాగ్రత్తలు తీసుకున్నట్లైతే మంచి ధరను పొందేందుకు అవకాశం ఉంటుంది. మామిడి పండ్లు కోత తరువాత కుళ్లిపోవటం, ఎండిపోవటం, పగలటం వంటివి జరుగుతుంటాయి. కాయలను సరైన పద్దతిలో కోయకపోవటం, ముదిరిన కాయలతోపాటుగా , ముదరని కాయలను కోయటం , గ్రేడింగ్ , ప్యాకింగ్ లో సరైన ప్రమాణాలు పాటించకపోవటం, అపరిశుభ్రత, నిల్వ లోపాల వల్ల పండ్లు చెడిపోతాయి. సరైన యాజమాన్య పద్దతులు అనుసరించటం ద్వారా ఈనష్టాలను నివారించుకోవచ్చు.

తోటల్లో కాయలను సరైన దశలోనే కోయాలి. కాయలకు భుజాలు ఏర్పడి, తొడిమ వద్ద గుంత ఉండాలి. కాయ ఆకు పచ్చ రంగు నుండి లేత ఆకుపచ్చ రంగుకు మారి ఉండాలి. శ్వేదగ్రంధులు కనిపిస్తుండాలి. రిఫ్రాక్టో మీటరును ఉపయోగించి కాయల పరిపక్వ దశను సులభంగా గుర్తించవచ్చు. పక్వానికి వచ్చిన కాయలను చిక్కాలను ఉపయోగించి నేలపై పడకుండా కోయాలి. కాయలకు గాయాలైతే మగ్గబెట్టిన సందర్భంలో శిలీంధ్రాలు ఆశించి కుళ్లిపోతాయి. తొడిమెలతో తెంపిన కాయల్లో నుండి వచ్చే తెల్లటి సొన కారిపోయేంతవరకు కాలయను బోర్లించి ఉంచాలి. కోసిన కాయలను మట్టినేలపై ఉంచకూడదు.

తొడిమ నుండి సొన పూర్తిగా కరిపోయిన తరువాత కాయల్ని లీటరు నీటికి 1గ్రాము సబ్బు పొడి కలిపిన ద్రావణంలో ముంచి మెత్తటి గుడ్డతో తుడవాలి. తరువాత లీటరు నీటికి అరగ్రాము బెన్ లేట్ కలిపిన ద్రావణంలో 3నిమిషాలు ఉంచాలి. తరువాత కాయపై తేమను పొడిగుడ్డతో తుడవాలి. ప్యాకింగ్ చేసే ముందుగా కాయలను సైజుల వారిగా వేరుచేయాలి. కాయలపై మచ్చ, మసి, మంగు, దెబ్బలు, మరకలు ఉంటే వాటిని వేరుచేసి మంచి వాటిని ప్యాకింగ్ చేయాలి. కాయలను పెట్టేల్లో ప్యాగింగ్ చేసే సమయంలో గడ్డిని కాని పేపరును కాని అడుగున వేయాలి.

నిషేదించిన పురుగు మందులను కాయలపై పిచికారి చేయకూడదు. వీలైనంత వరకు సేంధ్రీయ పురుగు మందులను మాత్రమే వాడాలి. కోత తరువాత వచ్చే తెగుళ్ల నివారణకు తోటలో ముందు నుండే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తోటలో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి. కాయలు చిన్నసైజులు ఉన్నప్పుడు , తిరిగి కాయ కోతకు ముందు లీటరు నీటికి 1గ్రాము కార్భండిజం, లేదా థయోఫానేట్ మిథైల్ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. కాత దశలో మూడు సార్లు ఇలా పిచికారి చేస్తే కాయలపై చీడల బెడద గ్గుతుంది. కాయలు కుళ్లిపోకుండా ఉంటాయి.