Paddy Harvesting And Threshing : వరి కోతలు, నూర్పిడి సమయంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు!

ధాన్యపు పంటను నూర్పిడి చేయాలనుకునప్పుడు దాని పరిపక్వత రోజులు, పంట నిలుపుదలని గమనించాలి. గడ్డి పొడి పొడిగా కాకముందే, నిమ్మపండు రంగులోకి మారినప్పుడు మరియు ఎర్ర గొలుసుగా మారి క్రిందికి కంకులు వంగినప్పుడు కోతలను కానీ నూర్పిడి చేసుకోవాలి.

Paddy Harvesting And Threshing : ఇటీవలి కాలంలో యాంత్రీకరణ వినియోగంతో వరికోత, పంట నూర్చిడి వరికోత యంత్రాలతో చేస్తారు. వరిని సకాలంలో కోసి, సరైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తే, మార్కెట్‌లో మంచి ధర వస్తుంది. కోతలకు వారం, పదిరోజుల ముందే పొలానికి నీరు పెట్టడం ఆపి, ఉన్నటువంటి నీటిని తీసేసి పంటను ఆరబెట్టాలి. కోత, నూర్చిడి సమయంలో ధాన్యంలో తేమశాతం 23-26 వరకు ఉంటుంది. కాబట్టి నూర్పిడి అయిన వెంటనే ధాన్యాన్ని టార్బాలిన్‌ లేదా ప్లాస్టిక్‌ పట్టాలపై. పలుచగా ఆరబెడితే గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యతను కలిగి ఉంటుంది.

ధాన్యాన్ని పొడవు, వెడల్పు నిష్పత్తిని బట్టి రెండు రకాలుగా విభజించారు. అవి ఎ గ్రేడ్‌, సాధారణ రకం. దీని ప్రకారం పొడవు వెడల్పు నిష్పత్తి 2.5 లేక ఆపైన ఉంటే ఏ గ్రేడ్‌ రకం. 2.5 కన్నా తక్కువ ఉంటే సాధారణ రకం. దీనితో పాటు ఏ గ్రేడ్‌ కానీ, సాధారణ రకం కానీ మిగతా నాణ్యతా ప్రమాణాలను కూడా పాటించాల్సి ఉంటుంది. వాటి విషయానికి వస్తే వరి ధాన్యం ఆరిన తర్వాత మట్టి పెడ్డలు, చెత్త, చెదారం లేకుండా చూడాలి.

మార్కెట్‌లో కనీస మద్దతు ధర రావాలంటే నాణ్యతా ప్రమాణాలను విధిగా పాటించాలి. దెబ్బతిన్న మొలకెత్తిన, పుచ్చుపట్టిన గింజలు 4 శాతం మించకుండా ఉండాలి. 1 శాతం సేంద్రియ పదార్థాల పరిధిలో విషతుల్య విత్తనాలు 0.5. శాతం మించకుండా ఉండాలి. దీనిలో ఉమ్మెత్త 0.25 శాతం, విసియా జాతి విత్తనాలు 0.2 శాతం మించకుండా ఉండాలి. పై నాణ్యతా ప్రమాణాలను పాటించి, పండించిన ధాన్యానికి మంచి ధర వచ్చేలాగా రైతు సోదరులు చూసుకోవాలి.

ధాన్యపు పంటను నూర్పిడి చేయాలనుకునప్పుడు దాని పరిపక్వత రోజులు, పంట నిలుపుదలని గమనించాలి. గడ్డి పొడి పొడిగా కాకముందే, నిమ్మపండు రంగులోకి మారినప్పుడు మరియు ఎర్ర గొలుసుగా మారి క్రిందికి కంకులు వంగినప్పుడు కోతలను కానీ నూర్పిడి చేసుకోవాలి.

కోతకి ముందు వర్షాలు పడినప్పుడు 50 గ్రాములు ఉప్పు నీటిని 50 లీటర్ల లో కలిపి పొలమంతా తడిచేలా పిచికారీ కానీ లేదా చల్లుకోవాలి. దీని వలన గింజ రంగు, నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. నూర్పిడి అనంతరం కల్లా లో తడిసినట్లయితే నాణ్యత, రంగు మారకుండా, పిలకలు రాకుండా ధాన్యం మీద ఉప్పు గల్లు చల్లుకోవడం మంచిది. ధాన్యం కుప్పలను టార్పలిన్ షీట్లపై ఆరబెట్టాలి. రెండు, మూడు రోజులు బాగా ఎండేలా తిరగబోయాలి.

నూర్పిడి చేసిన తరువాత ఒక్కసారైనా తూర్పార పట్టుకోవాలి. దీని మూలానా ఏవైనా పంట అవశేషాలు, తాలుగింజలు, జడపదార్థం, కలుపు గింజలు, ఎలుకలు మరియు కీటకాల వ్యర్థ పదార్థాలు అన్ని తొలగిపోయి స్వఛ్చమైన నాణ్యత విత్తనం వస్తుంది. నూర్పిడి చేస్తున్న సమయంలో ధాన్యపు పంటలలో గడ్డిజాతి గింజలు లేకుండా చూడాలి. పంటకోసిన తర్వాత సరిగా ఆరబెట్టకపోతే గింజలు రంగు మారి పంట నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు