Dried Mango Slices : మామిడి ఒరుగుల తయారీ.. 3 నెలల్లో 12 కోట్ల టర్నోవర్

పులుపు గా ఉండే వంటలను చేసేందుకు మామిడి గుజ్జును ఎక్కువమంది వినియోగిస్తారు అయితే దొరకనప్పుడు ఎక్కువమంది ఓరుగుల పై ఆధార పడతారు. అంతే కాదు ఉత్తరాధి రాష్ట్రాల్లో తియ్యట మామిడి పచ్చడని ఇష్టపడుతుంటారు.

Dried Mango Slices : మామిడి ఒరుగుల తయారీ.. 3 నెలల్లో 12 కోట్ల టర్నోవర్

Making of Dried Mango Slices

Dried Mango Slices : మామిడి ఒరుగులు తయారీ తో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు . ఉత్తరాది రాష్ట్రాల్లో వీటితో చేసే తీపి పచ్చళ్లు, ఒరుగులకు మంచి డిమాండ్ ఉండటంతో ఇక్కడ తయారు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వేసవిలో మూడు నెలలు ఈ పని ద్వారా రైతులకు ఆదాయ లభించడమే కాక.. ఎంతో మంది మహిళల ఉపాధికి డొక లేకుండాపోయింది.

READ ALSO : High Yielding Rice Varieties : అధిక దిగుబడినిస్తున్న వరి రకాలు.. కె.ఎస్.పి – 6251 , ఎంటియు – 1224

సీజనల్‌గా ప్రకృతి ఇచ్చే పండ్లలో మామిడి ఒకటి. ఆ మామిడి కాయలనే ఉపాధిగా మార్చుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా, తణుకు మండలం, అన్నవర పాడు గ్రామానికి చెందిన రైతు పులపర్తి తాతబ్బాయి. 18 ఏళ్ళ క్రితం నూజివీడులో ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, వెంకటాద్రిపురం గ్రామంలో 40 మందితో మామిడి ఒరుగుల వ్యాపారాన్ని మొదలు పెట్టిన ఆయన నేడు 500 మందికి ఉపాధి నిస్తున్నారు. వేసవిలో మూడు నెలలు మాత్రమే చేసే ఈ తయారీ మార్కెట్‌ రంగంలో  కొత్త మార్గాన్ని వేసుకున్నారు.

READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

పులుపు గా ఉండే వంటలను చేసేందుకు మామిడి గుజ్జును ఎక్కువమంది వినియోగిస్తారు అయితే దొరకనప్పుడు ఎక్కువమంది ఓరుగుల పై ఆధార పడతారు. అంతే కాదు ఉత్తరాధి రాష్ట్రాల్లో తియ్యట మామిడి పచ్చడని ఇష్టపడుతుంటారు. ఈ డిమాండ్ నే ఆసరాగా చేసుకోని రైతు తాతబ్బాయి లక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఓరుగులను తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.

READ ALSO : Drip Irrigation System : వ్యవసాయంలో పెరుగుతున్న మైక్రో ఇరిగేషన్ వాడకం !

మార్కెట్లో కొనుగోలు చేయని కాయలు, గాలి దుమారానికి రాలి పడిన కాయలు, తోటల్లో సైజు లేని దెబ్బతిన్న కాయలతో కూడా కొనుగోలు చేసి ఓరుగులుగా తయారు చేస్తున్నారు. తొలుత కాయల చెక్కుతీసి టెంక రాకుండా మెత్తటి కండను మాత్రమే ముక్కలుగా కోస్తారు ముక్కలను నాలుగు రోజులపాటు ఉప్పులో ఊరబెట్టి.. ఆ తరువాత కవర్లలో ప్యాక్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.

ఓరుగులు తయారు చేసి ఎగుమతి చేస్తున్న రైతు తాతబ్బాయి భవిష్యత్తులో తీపి పచ్చళ్లను పెట్టి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. 3 నెలల సీజన్ లో దాదాపు 12 నుండి 13 కోట్ల టర్నోవర్ చేస్తూ.. ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్నారు.