Papaya Crop Cultivation : బోప్పాయిలో పండుఈగ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

బొప్పాయిలో పోషకాలు అధికంగా వుండటంతో వినియోగం నానాటికీ పెరుగుతోంది. దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈపంటలో చీడపీడల వ్యాప్తి నానాటికీ పెరిగిపోతుండటంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.

Papaya Crop Cultivation : బొప్పాయి రైతులకు పండు ఈగ తలనొప్పిగా మారింది. కాయదశ నుండి పక్వానికి వచ్చే దశలో ఈ ఈగ ఆశించి తీవ్రనష్టం చేస్తుంది. రైతులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తుండటంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఎన్ని రకాల పురుగుమందులను వాడినా వీటిని నివారించలేకపోతున్నారు.

బొప్పాయిలో పోషకాలు అధికంగా వుండటంతో వినియోగం నానాటికీ పెరుగుతోంది. దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈపంటలో చీడపీడల వ్యాప్తి నానాటికీ పెరిగిపోతుండటంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.

READ ALSO : Papaya : బొప్పాయిలో సూక్ష్మ పోషకాల లోపం, నివారణా చర్యలు !

అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పటికీ చీడపీడలు ఆశించి నష్టపోతున్నారు. ప్రధానంగా కాయదశ నుండి పక్వానికి వచ్చే దశలో పండు ఈగ ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తోంది.

తల్లి ఈగ సూదిలాంటి మొనను కాయల చర్మం క్రిందికి చొప్పించి గ్రుడ్లను గుంపులు గుంపులుగా పెడుతుంది. ఈ గుడ్లు మూడునాలుగు రోజులలో పొదిగబడి చిన్న లార్వాగా వృద్ధిచెంది, కాయలోని గుజ్జును తినడంవలన కాయలు మొత్తబడి కుళ్లిపోతున్నాయి.

READ ALSO : Papaya Cultivation : బొప్పాయి సాగులో రైతులు అనుసరించాల్సిన సస్యరక్షణ చర్యలు!

ఈ నేపధ్యంలో పండు ఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం , ఉద్యాన శాస్త్రవేత్త , వనం చైతన్య రైతులకు తెలియజేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు