Guava : జామలో తెగుళ్ళు, చీడపీడల నివారణ

తెగులు మొదలైన కొద్ది కాలంలోనే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. కొమ్మలు పైనుండి కిందకు ఎండుకుంటూ వస్తాయి.ఎక్కువగా చెట్టు కింది బాగంలో కొమ్మలు ఎండి పోవడం జరుగుతుంది.

Guava : జామలో తెగుళ్ళు, చీడపీడల నివారణ

Guava

Guava : ప్రస్తుత కాలంలో రైతులు జామ పంటను ఎక్కువ సాంద్రత పద్ధతిలో సాగుచేస్తు అదిక దిగుబడి సాదిస్తున్నారు రైతులు. క్రమ పద్దతిలో మొక్కల కత్తిరింపులు చేపట్టి మొక్కల ఎదుగుదలను నియంత్రించడం వలన నాణ్యమైన పంట దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. అదే విధంగా చీడపీడల విషయంలో రైతులు సరైన జాగ్రత్తలు పాటించటం వల్ల పంటను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.

జామలో పురుగులు తెగుళ్ళు నివారణ పద్దతులు ;

పండు ఈగ : కాయలు పక్వానికి వచ్చినప్పుడు ఈ పండు ఈగల ఉద్బుతి ఎక్కువగా ఉంటుంది. 2 మి:లీ: మిథైల్ యజినాల్, 3గ్రా: 3జి గుళికలను లీటర్ నీటిలో కలిపి ఈ తయారు చేసిన ద్రావణాన్ని ప్లాస్టిక్ సీసాల్లో 200ఎమ్ ఎల్ చొప్పున పోసి అక్కడక్కడ తోటలో చెట్ల కొమ్మలకు వేలాడేలాగ కట్టాలి. దీనివల్ల మగ ఈగలు ఆకర్సింపబడి మందు ద్రావణంలో పడి చేనిపోతాయి. లేదా మలథియాన్ లీటర్ నీటికి 3ఎంఎల్ చొప్పున కలిపి పిచికారి చేయాలి లేదా మార్కట్లో లబించే ఈగ ఎరలను ఎకరానికి 5-10 అమర్చుకోవాలి.

తెల్ల సుడిదోమ : వీటి పిల్ల పురుగులు ఆకులపై తెల్లని దూది లాంటి మెత్తని పదార్ధంతో కప్పబడి రసం పిలుస్తూ ఉంటాయి.ఈ దోమ ఆశించిన ఆకులు ఎర్రగా ముడతలుపడి కనిపిస్తాయి. పిబ్రవరి నెలలో ఈ దోమల ఉద్బుతి ఎక్కువగా ఉంటుంది. వీటిని నివారించడానికి తొలుత జిగురు పూసిన పసుపురంగు అట్టలను చెట్టు కొమ్మలకు వేలాడతియాలి. వీటి ఉద్బుతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమిడక్లోప్రేడ్-75%డబ్ల్యూజీ లీటర్ నీటికి 0.3 గ్రా:లు, మరియు వేపనునే లీటర్ నీటికి 5ఎంఎల్ తో కలిపి పిచికారి చేయాలి.

పిండి నల్లి : ఇవి చిన్న పెద్ద పురుగులు గుంపులు గుంపులుగా కొమ్మల చివర, కాయల మిధ ఆశించి రసాన్ని పిలుస్తూ ఉంటాయి.ఇవి ఆశించిన కాయలు రాలిపోతాయి. ఇవి విసర్జించిన జిగురు వల్ల కాయలపై నల్లటి మసి ఏర్పడుతుంది. ఈ తెగులును ఒకటి రెండు కొమ్మలకు గుర్తించిన వెంటనే అ కొమ్మలను కత్తిరించి కాల్సి వేయాలి. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎస్పెట్-75%ఎస్సి లీటర్ నీటికి 2గ్రా: మరియు డైక్లోరోవాస్ లీటర్ నీటికి 2ఎంఎల్ తో కలిపి పిచికారి చేయాలి.

నులిపురుగులు : ఇవి ఆశించిన చెట్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, కొమ్మలు ఎండిపోవడం, దీనివల్ల తక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. ఇవి ఆశించిన తొలి దశలో చెట్టుకు 100కెజిల పశువుల ఎరువు, 500 గ్రా: వేపపిండి, నులిపురుగుల గ్రుడ్డుపై పరాన్నజీవిగా ఉండే సిలింద్రం మేసిలోమైసిన్ లిలాసినాస్ 25గ్రా: లతో పాటుగా 100గ్రా 3జి గుళికలు చెట్ల పాదులలో వేసుకొని వీటి ఉద్బుతిని అరికట్టవచ్చు.

ఎండు తెగులు : తెగులు మొదలైన కొద్ది కాలంలోనే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. కొమ్మలు పైనుండి కిందకు ఎండుకుంటూ వస్తాయి.ఎక్కువగా చెట్టు కింది బాగంలో కొమ్మలు ఎండి పోవడం జరుగుతుంది. ఆకులు వడలిపోయి రాలుతాయి చెట్టు మోడుల మారుతుంది. దినిని నివారించడానికి మొక్కల మొదల్లలో నీరు నిల్వకుండా చూసుకోవాలి. మొక్కల మొదల్లలో చెట్టు 1కేజీ జిప్సం, పశువుల ఎరువు100కేజీలు, వేపపిండి 2కేజీలు, ట్రైకోడమ్మ సిలింద్రానాశని, మొత్తం బాగా కలిపి చెట్టుకు 40కేజీల వరకు వేసుకోవాలి. లేత కొమ్మలలో తెగులు కనిపించినప్పుడు కార్బండిజం 1గ్రా: లీటర్ నీటికి లేదా కాపరక్సిక్లోరైడ్ 3గ్రా: లీటర్ నీటికి కలుపుకొని 15 రోజుల వ్యావదిలో రెండు సార్లు నేల తడిసేల మొదలు చుట్టూ పోయాలి.

గజ్జి తెగులు : ఇది ప్రధానంగా పచ్చి కాయలపై కనిపించడం జరుగుతుంది కాయలపై చిన్నచిన్న తుప్పు రంగు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. కాయ పెరిగే కొద్ది మచ్చలు పెరిగి కాయలు పగిలి అంచులు ఎత్తుగా ఉంటాయి. ఈ తెగులు సోకిన కాయలు సరిగా పెరగక గట్టిగ ఉండి రాలిపోతాయి. దినిని నివారించడానికి కాపరక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రా: ల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకోవాలి.

కాయకుళ్లు : లేత కొమ్మలు, ఆకులు, కాయలు మొదట గోధుమ రంగులో మారి తర్వాత నల్లగా మారి కొమ్మ మొత్తం ఎండి పోతుంది. పక్వానికి వచ్చిన పండ్లలపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు గుంటలు పడి కనిపిస్తాయి. గోధుమ మచ్చలపై గులాబీ రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. మచ్చలు ఏర్పడిన 3నుండి4 రోజుల్లో పండు కుళ్ళిపోవడం జరుగుతుంది. దిని నివారణకు కాయలు ఏర్పడే సమయలో కాపరక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రా ల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారి చేసుకోవాలి.