Pink Bollworm : పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతి నివారణ?

గులాబీ రంగు ఆశించిన పూలు, మొగ్గలు రాలిపోతాయి. ముదరక ముందే పత్తికాయలు పక్వానికి వచ్చి విచ్చుకుంటాయి. గులాబీపురుగు నివారణకు రైతులు కొన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టటం ద్వారా దాని ఉధృతిని నివారించుకోవచ్చు.

Pink Bollworm : పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతి నివారణ?

Pink Bollworm :

Pink Bollworm : పత్తి పంటకు నష్టం కలిగించే చీడపీడల్లో గులాబీ పురుగు ప్రధానమైనది. పత్తి పంటకు తీవ్రంగా నష్టం కలిగిస్తుంది. దీని వల్ల దిగు బడులు తగ్గటంతోపాటు , నాణ్యత దెబ్బతింటుంది. గులాబీ రంగు పురుగు విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పెట్టిన పెట్టుబడి చేతికందకుండా పోతుంది.

గులాబీ రంగు ఆశించిన పూలు, మొగ్గలు రాలిపోతాయి. ముదరక ముందే పత్తికాయలు పక్వానికి వచ్చి విచ్చుకుంటాయి. గులాబీపురుగు నివారణకు రైతులు కొన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టటం ద్వారా దాని ఉధృతిని నివారించుకోవచ్చు.

పురుగు ఉనికిని గుర్తించాలంటే ముందుగా ఎకరానికి 8 చొప్పున లింగార్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. పత్తి చేనుకు చుట్టూ బెండ, తుత్తర బెండ, గడ్డి జాతి మొక్కలు లేకుండా జాగ్రత్త పడాలి.

సింథటిక్ పైరిత్రాయిడ్ పురుగు మందులను రెండు మూడు రకాల పురుగు మందు మిశ్రమాలను కలిపి వాడరాదు. అందునా తొలిదశలో ఈ తరహా ప్రయోగం మంచిది కాదు. అనుమతిలేని బయో మందులను వాడరాదు.

పురుగును, గుడ్డు దశలను నిర్మూలించేందుకు లీటరు నీటికి 5మి.లీ వేపనూనెను కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 300 గ్రాముల థయోడికార్బ్ లేదంటే 500 మీ.లీ క్లోరిఫైరిపాస్ వంటివి ఉదయం సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. అవసరమనుకుంటే స్ధానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వారి సూచనలు , సలహాలు తీసుకోవాలి.