Cultivation Of Mirchi Crop : లాభదాయకంగా పచ్చిమిర్చి సాగు

వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పే ఉమ్మడి తెగులు రాష్ట్రాలు. ఎండు మిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగుచేస్తున్నారు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండు మిర్చి పంట 2 నుండి 5 కోతల్లో పూర్తవుతుండగా, పచ్చి మిర్చిలో 15 నుండి 20 కోతలు తీస్తున్నారు.

Cultivation Of Mirchi Crop : లాభదాయకంగా పచ్చిమిర్చి సాగు

Mirchi Crop

Cultivation Of Mirchi Crop : ఏడాది పొడవునా సాగులో వుండే కూరగాయ పచ్చిమిరప. వాణిజ్య సరళిలో ఎండు మిరపను ఖరీఫ్, రబీకాలాల్లో నాటితే, పచ్చిమిరపను అన్నికాలాల్లోను సాగుచేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటువల్ల రైతులు ఎకరాకు 35 నుండి 50 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. దీంతో తిరుపతి జిల్లా, పెళ్లకూరు మండలంలోని చాలా మంది పచ్చిమిర్చి సాగుచేస్తూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.

READ ALSO : Chilli Varieties : మిర్చిసాగులో అనువైన విత్తన రకాలు

వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పే ఉమ్మడి తెగులు రాష్ట్రాలు. ఎండు మిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగుచేస్తున్నారు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండు మిర్చి పంట 2 నుండి 5 కోతల్లో పూర్తవుతుండగా, పచ్చి మిర్చిలో 15 నుండి 20 కోతలు తీస్తున్నారు.

పచ్చిమిర్చి రేటు బాగున్నప్పుడు కొంత మంది రైతులు, మొదట వచ్చిన కాయలను మార్కెట్ చేసి, మిగతా పంటను ఎండు మిరప కోసం వదులుతున్నారు. ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం. పచ్చిమిరపలో ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో ఉండటం వలన తిరుపతి జిల్లా, పెళ్లకూరు మండలంలోని పలు గ్రామాల రైతులు ప్రతి ఏటా పచ్చిమిర్చిని సాగుచేసి మంచి దిగుబడులను తీస్తున్నారు.