Watermelon Cultivation : పుచ్చసాగుతో నికర ఆదాయం పొందుతున్న కోనసీమ జిల్లా రైతు

ప్రస్తుతం తన వ్యవసాయ భూమిలో 3 ఎకరాలు ఎల్లో రకం, రెడ్ రకం, అవుట్ సైడ్ ఎల్లో ఇన్ సైడ్ రెడ్ రకాలను సాగుచేస్తున్నారు. ఎకరాకు 350 గ్రాముల విత్తనం చొప్పున డిసెంబర్ 25 న నాటారు. మల్చింగ్ విధానంలో డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులు అందిండంతో పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వస్తున్నాయి.

Watermelon Cultivation : మార్కెట్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, సంప్రదాయ పంటల స్థానంలో, సీజనల్ పంటలను సాగుచేస్తున్నారు రైతులు . ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి, తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలోనే పంట దిగుబడులను పొందుతున్నారు. ఇదే కోవలోకి వస్తారు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రైతు శ్రీనివాస్. 2 ఎకరాల్లో సీజనల్ గా మూడు పుచ్చ రకాలను సాగుచేస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

READ ALSO : Watermelon : పుచ్చసాగులో తెగుళ్ళు,చీడపీడల నివారణ!

ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతుకు అండగా నిలుస్తున్నాయి అనటానికి నిదర్శనంగా నిలుస్తోంది ఇక్కడి పుచ్చసాగు విధానం. ఇసుకతోకూడిన ఎర్రనేలల్లో, సాగునీటి వనరులను సమర్ధంగా ఉపయోగించుకుంటూ, సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో నాణ్యమైన అధిక దిగుబడులను తీస్తున్నారు , అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం మండలం, కేసినపల్లి గ్రామానికి చెందిన రైతు దొమ్మేటి శ్రీనివాస్. 2 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సీజనల్ గా పుచ్చసాగుచేస్తున్నారు.

ప్రస్తుతం తన వ్యవసాయ భూమిలో 3 ఎకరాలు ఎల్లో రకం, రెడ్ రకం, అవుట్ సైడ్ ఎల్లో ఇన్ సైడ్ రెడ్ రకాలను సాగుచేస్తున్నారు. ఎకరాకు 350 గ్రాముల విత్తనం చొప్పున డిసెంబర్ 25 న నాటారు. మల్చింగ్ విధానంలో డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులు అందిండంతో పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుతం పంట దిగుబడులను తీస్తున్నారు.

READ ALSO : Intercrop Cultivation : పామాయిల్ లో అంతర పంటగా చెరకు సాగు

ఎకరాకు పెట్టుబడి రూ. 70 నుండి 80 వేలు పెట్టారు. దిగుబడి 20 నుండి 22 టన్నులు తీస్తున్నాడు. మార్కెట్ లో సరాసరి కిలో ధర రూ. 20 అమ్మినా , ఎకరాకు 2 లక్షల ఆదాయం పొందుతున్నారు. పెట్టుబడి పోను లక్షరూపాయల నికర ఆదాయం పొందుతున్నారు. అంటే 2 ఎకరాలకు 3 నెలల్లోనే రూ. 2 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు రైతు శ్రీనివాస్ . ఈ రైతును చూసి , తోటి రైతులు కూడా మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండించి ఆర్ధికంగా నిలదొక్కుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు