Convert fallow lands : చౌడు భూముల పునరుద్ధరణ.. జిప్సమ్, పచ్చిరొట్ట ఎరువులతో చౌడు నివారణ

ముఖ్యంగా వరి సాగుచేసే ప్రాంతాల్లోని భూముల్లో ప్రధానంగా బోరునీరు వాడే ప్రాంతాల్లో ఈ చౌడు ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. అంతే కాదు చాలా ప్రాంతాల్లో సాగుభూములు నిరుపయోగంగా మారుతున్నాయి. సాధారణంగా భూమిలో వుండే కొన్నిరకాల లవణాల వల్ల భూమి పైభాగంలో తెల్లని లేదా బూడిదరంగులో పొరలు ఏర్పడుతూవుంటాయి.

Convert fallow lands : చౌడు భూముల పునరుద్ధరణ.. జిప్సమ్, పచ్చిరొట్ట ఎరువులతో చౌడు నివారణ

Convert fallow lands to cultivation

Convert fallow lands : పంటల్లో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం, భూముల్లో సేంద్రీయ ఎరువుల వాడకం తగ్గిపోవటం వల్ల భూభౌతిక లక్షణాలు దెబ్బతిని నేలలు చౌడుబారిపోతున్నాయి. భూసారం తగ్గిపోవటం వల్ల రైతుకు ఖర్చులు పెరిగి ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నాడు.

READ ALSO : Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు

రైతులు తెలిసోతెలియకో వాడుతున్న అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగటమే కాకుండా, పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. దీనికితోడు మనం అందించే నీటిలో వుండే అధిక లవణాల కారణంగా కూడా పంటలు సరిగా ఎదగక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నాం.

ముఖ్యంగా వరి సాగుచేసే ప్రాంతాల్లోని భూముల్లో ప్రధానంగా బోరునీరు వాడే ప్రాంతాల్లో ఈ చౌడు ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. అంతే కాదు చాలా ప్రాంతాల్లో సాగుభూములు నిరుపయోగంగా మారుతున్నాయి. సాధారణంగా భూమిలో వుండే కొన్నిరకాల లవణాల వల్ల భూమి పైభాగంలో తెల్లని లేదా బూడిదరంగులో పొరలు ఏర్పడుతూవుంటాయి. వీటినే చౌడుభూములు అంటారు. వీటిలో ప్రధానంగా తెల్లచౌడు, కారుచౌడు ఎక్కువగా కనబడుతుంటాయి. ఏటా సేంద్రీయ ఎరువులు వాడే ప్రాంతాల్లో ఈ సమస్య వుండదు.

READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

భూమిపై తెల్లటిపొరలా లవణాలు పేరుకుని ఉండటాన్ని పాలచౌడు అంటారు. కారు చౌడు భూముల్లో నలుపు లేదా బూడిదరంగులో వుండే పొరలను గమనించవచ్చు. ఏటా భూపరీక్షలు చేయించి, తదనుగుణంగా పంటలను ఎన్నుకోవటం, సేంద్రీయ ఎరువులను, రసాయన ఎరువులను సిఫారసు మేరకు అందించటం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాయల శ్రీనివాస రావు.