High Yielding Rice Varieties : ఖరీఫ్ కు అనువైన వరి రకాలు.. ఎకరాకు 50 బస్తాల దిగుబడి

తెలంగాణా రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోను కాలువ కింద, బోరు బావుల కింద అధికంగా వరి సాగుచేస్తూ ఉంటారు.  ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే, నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక  వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు.

High Yielding Rice Varieties : ఖరీఫ్ కు అనువైన వరి రకాలు.. ఎకరాకు 50 బస్తాల దిగుబడి

Pady Crop Cultivation

High Yielding Rice Varieties : ఖరీఫ్ వరిసాగుకు  సమయం దగ్గర పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు రకాలను ఎంచుకుని, విత్తనాలు సమకూర్చుకునే  పనిలో వున్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి.

READ ALSO : Sesame Farming : ఖరీఫ్ కు అనువైన నువ్వు రకాలు.. అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన యాజమాన్యం

ప్రస్థుతం ప్రాచుర్యంలో వున్న పాత రకాలతోపాటు, అనే కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు . ప్రాంతాలకు అనుగుణంగా  వీటి గుణగణాలను పరిశీలించి, ఏటా సాగుచేసే సంప్రదాయ రకాల స్థానంలో  రైతులు వీటిని సాగుకు ఎంచుకోవచ్చు . ఖరీప్ కు అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ఠ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : High Yielding Rice Varieties : అధిక దిగుబడినిస్తున్న వరి రకాలు.. కె.ఎస్.పి – 6251 , ఎంటియు – 1224

వరి సాగుచేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్దకాలంలో సాగు రూపురేఖలు మారిపోయాయి. వరిసాగులో నీటి కొరత ఓ వైపు, చీడపీడల సమస్య మరో వైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే…. పెరిగిన పెట్టుబడులు వల్ల ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తే కాని, సాగు గిట్టుబాటుకాని పరిస్థితి ఏర్పడింది.

READ ALSO : Cashew Nuts Price : తగ్గిన జీడిపిక్క ధర.. ఆందోళనలో రైతులు

తెలంగాణా రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోను కాలువ కింద, బోరు బావుల కింద అధికంగా వరి సాగుచేస్తూ ఉంటారు.  ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే, నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక  వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు.

READ ALSO : Paddy Cultivation : వరిసాగులో కాలానుగుణంగా మార్పులు.. నూతన వరి వంగడాలను రూపొందిస్తున్న శాస్త్రవేత్తలు

వానాకాలంలో సాగుచేసుకోదగిన మరో వరి రకం నూతన వరి రకం ఆర్.ఎన్.ఆర్ – 11718( పదకొండు ఏడువందల పద్దెనిమిది ) రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం రూపొందించిన ఈ రకం మినికిట్ దశను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. మినికిట్ దశలో రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాను నమోదు చేసి రైతుల మన్నలను పొందింది. అయితే ఈ రకం చౌడునేలలకు కూడా అనుకూలమంటు  ఆర్.ఎన్.ఆర్ – 11718 ( పదకొండు ఏడువందల పద్దెనిమిది ) రకం గుణగణాలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త.

READ ALSO : High Yielding Rice : భాస్వర శాతం తక్కువగా ఉన్న అధిక దిగుబడినిచ్చే వరి రకాలు

2019 లో  జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా  స్థానం   నుండి విడుదలైన మరో రకం జె.జి.ల్ 24423 . దీన్నే జగిత్యాల రైస్ వన్ గా పిలుస్తారు. స్వల్పకాలిక రకం. వానాకాలం పంటకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.