Millets Cultivation : చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్న సబల

ఈ ఏడాది మిల్లెట్స్ సాగుకు పెద్ద పీఠ వేశాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో పలు మండలాల్లో ఈ మిల్లెట్స్ సాగును ప్రారంభించారు. జిల్లాలో 2007 నుంచి పనిచేస్తోన్న సబల అనే స్వచ్చంద సంస్థ... జిల్లాలో ప్రక్రతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది.

Millets Cultivation : చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్న సబల

Millets Cultivation

Millets Cultivation : మనిషికి మంచి ఆరోగ్యం, పోషక విలువలుండే ఆహారాన్ని ఇచ్చేవి చిరుధాన్యాలు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వీటినే సాగు చేస్తూ, వీటి ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునే పరిస్థితిలు ఉండేవి. కానీ, కాలక్రమంలో వీటి సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడంతా బియ్యం, గోదములపైనే ఆధారపడుతూ.. అనారోగ్యం పాలవుతున్నారు.

READ ALSO : New Variety Of Rice : గోదావరి జిల్లా రైతులకు మరో కొత్త వరి వంగడం.. స్వర్ణకు ప్రత్యామ్నాయ రకం ఎంటియు1318

అయితే, చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్రప్రభుత్వం…ఈ ఏడాది చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించి, వీటి సాగును ప్రోత్సహించేందుకు అనేక ప్రణాళికలు ప్రవేశపెట్టింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు మళ్లీ ప్రారంభమైంది. చిరుధాన్యాల సాగు వలన మంచి ఆహారం దొరకమే కాకుండా, భూమి సారవంతం కావడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో వ్యవసాయశాఖతో పాటు పలు స్వచ్చంద సంస్థలు ఈ ఏడాది రైతులతో చిరుధాన్యాల సాగు చేయించేందుకు సిద్దమవుతున్నాయి. జొన్నలు, సజ్జలు, కొరలు, వరిగెలు , రాగులు, అరికెలు, ఊదలు వంటి చిరుధాన్యాల పేర్లు నేటి తరానికి పెద్దగా తెలియవు. కానీ, ఒకప్పుడు ఇవే మనకి ప్రధాన ఆహారం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మెట్ట భూముల్లో వీటినే ప్రధాన పంటలుగా పండించేవారు. కానీ, వీటి సాగు క్రమంగా కనుమరుగైపోయాయి.

READ ALSO : Vegetable Seeds Cultivation : రైతు స్థాయిలో కూరగాయల విత్తనోత్పత్తిలో మెళకువలు

ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో తప్ప… మైదాన ప్రాంతాల్లో వీటి సాగు ఎక్కడా కనిపించడం లేదు. మంచి ఆరోగ్యం, పోషక విలువలుండే ఈ చిరుధాన్యాల స్థానంలో ప్రస్తుతం రసానియక ఎరువులతో పండించే బియ్యం, గోదమలే మనకి ప్రధాన ఆహారంగా మారాయి. వీటిని తినడం వలన… ఎన్నో వ్యాధులను కొని తెచ్చుకున్నట్లవుతోంది. ఈ పరిస్థితుల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. వీటిని తినడం వలన ఆరోగ్యం, పోషకాలే కాకుండా, భూమిని సారవంతం చేయడంలో చిరుధాన్యాల సాగు ఎంతో ఉపకరిస్తుంది.

అందుకనే, ఈ ఏడాది మిల్లెట్స్ సాగుకు పెద్ద పీఠ వేశాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో పలు మండలాల్లో ఈ మిల్లెట్స్ సాగును ప్రారంభించారు. జిల్లాలో 2007 నుంచి పనిచేస్తోన్న సబల అనే స్వచ్చంద సంస్థ… జిల్లాలో ప్రక్రతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ ఏడాది మిల్లెట్స్ సాగుపై రైతుల్లో అవగాహన కల్పిస్తూ, సాగు పట్ల అవగాహన కల్పిస్తోంది. వ్యవసాయ శాఖ, ఏపీసీఎన్ఎఫ్ సహకారంతో జిల్లాలోని కొత్తవలస, ఎల్.కోట, వేపాడ, జామి తదితర మండలాల్లో చిరుధాన్యాలతో పాటు, నవధాన్యాల సాగును ప్రారంభిస్తున్నారు.

READ ALSO : Bacterial Blight Of Rice : వరిపంటలో ఎండాకు తెగులు, నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

కొత్తవలస మండలం చీడివలస క్లస్టర్ లో 2293 ఎకరాల్లో…2198 రైతులు సాగు చేస్తుండగా, లక్కవలపుకోట మండలంలొ 2291 ఎకరాల్లో 1953 మంది రైతులు ప్రక్రతి వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఖరీఫ్ సీజన్ లో ఆయా గ్రామాల్లోని రైతులతో నవధాన్యాలు సాగు చేయించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే నవధాన్యాల విత్తన కిట్ లను సిద్ధం చేశారు.

భూమి, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వలన… నేలతల్లిలో క్రమంగా సారం కోల్పోతోంది. అదే విధంగా రసాయనిక ఎరువులు అధికంగా వాడుతుండటం వలన పంట దిగుబడులు పడిపోవడమే కాకుండా, కలుషితమయ్యే పరిస్థితిలు తలెత్తాయి. వీటన్నింటినీ అధిగమించేందుకు నవధాన్యాల సాగు ఎంతో దోహదపడనుంది.

READ ALSO : Mango Slices : మామిడికాయ ముక్కల ఎగుమతితో అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతులు

చిరుధాన్యాల సాగుతో మళ్లీ పూర్వవైభవం కనిపిస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్వం ఈ చిరుధాన్యాల సాగు, ఆహారంగా తీసుకోవడం వలన…అప్పటి తరం వారు మంచి ఆరోగ్యంగా ఉండేవారని, కానీ, ఇప్పుడు రసాయనిక ఎరువులతో పండించిన ఆహార ఉత్పత్తులు తినడం వలన తరచూ ఆనారోగ్యం పాలవుతున్నారు.

అలాగే, రసానియక ఎరువుల వాడకం వలన భూమి సారం కూడా కోల్పోతోందని, ఫలితంగా దిగుబడులు పడిపోతున్నాయన్నాయని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితిల్లో ప్రభుత్వాలు ముందుకొచ్చి, చిరుధాన్యాల సాగుపై ద్రుష్టిపెట్టడం సంతోషదాయకమని చెబుతున్నారు. మొత్తం మీద… జిల్లాలో పలు మండలాల్లో చిరుధాన్యాల సాగు…ఒక యజ్ఝంలా ప్రారంభమై….రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.