Bananas : అరటిలో సిగటోక తెగుళ్ళు.. ఆందోళనలో గోదావరి ప్రాంత రైతులు

రైతుల ఆందోళనను గమనించిన వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుతం క్షేత్రస్ధాయిలో సిగటోకా తెగుల విషయంలో రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. తెగుళ్ళ మందులను మార్చి

Bananas : అరటిలో సిగటోక తెగుళ్ళు.. ఆందోళనలో గోదావరి ప్రాంత రైతులు

Banana

Bananas : అరటి రైతుకు తిప్పలు తప్పటంలేదు. ప్రకృతి వైపరిత్యాలు చాలదన్నట్లు తెగుళ్ళు రైతుల కొంపముంచుతున్నాయి. తాజాగా అరటి పంటలో సిగటోక తెగుళ్ళు రైతుల్లో గుబులు రేపుతున్నాయి. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లా అత్రేయపురం ప్రాంతంలో అరటి పంటను రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు. పంట అంతబాగుందనుకున్న దశలో ప్రస్తుతం అరటి మొక్కలు తెగుళ్ళ బారిన పడటం వారిని ఆందోళనకు గురిచేస్తుంది.

భూమిలో తేమ శాతం ఎక్కవ కావటం, ఉక్కపోత వాతవరణం, సూర్యరస్మి తగినంత లేకపోవటం వాంటి కారణాలతో సిగటోకా తెగుళ్ళు అరటి పంటను ఆశిస్తున్నాయి. ఈ తెగుళ్ళు వ్యాపించిన మొక్కల ఆకులు పసుపు, గోధుమ వర్ణంలోకి మారిపోయి ఎండిపోతున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా శీతాకాలం సమయంలో అరటికి సిగటోకా తెగులు సోకుతుంది. అయితే ఈ ఏడాది వర్షకాలంలోనే ఈ తెగులుకు అరటి పంట గురవ్వటాన్ని రైతులు గుర్తించారు.

సిగటోకా తెగులు అరటి పంటపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అరటి కాయలు సైజు రాకుండా ముందే మాగిపోవటం, గెల పక్వానికి రాకుండా గిడసబారిపోవటం వంటి నష్టం కలుగుజేస్తాయి. ఈ తెగులుకు తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోకుంటే పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. గతఏడాది కూడా ఇదే తెగులు కారణంగా రైతులు నష్టపోవాల్సి వచ్చింది. అరంటి పంట సాగుచేసిన 20 మాసాల్లో రెండు సార్లుగా పంట చేతికొస్తుంది. పొటాష్, మెగ్నీషియం, బోరాన్ లోపం కారణంగా ఈ తెగులు సోకుతుంది.

రైతుల ఆందోళనను గమనించిన వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుతం క్షేత్రస్ధాయిలో సిగటోకా తెగుల విషయంలో రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. తెగుళ్ళ మందులను మార్చి మార్చి పిచికారి చేసుకోవాలని ఉద్యానవనశాఖ అధికారులు సూచిస్తున్నారు. తొలుత ప్రొఫికొనజోల్ ఒక మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. రెండో సారి కార్పండిజిమ్, మాంకోజెబ్, మిశ్రమాన్ని ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మూడో సారి ట్రైప్లోక్సీస్ట్రోబిన్, టేబుకొనజోల్ మిశ్రమాన్ని 15గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నాల్గోసారి డైయజెనకొనజోల్ ఒక మిల్లీ లీటరు ,లీటరు నీటిలో కలపి పిచికారి చేయాలని రైతులకు సూచిస్తున్నారు.