Stem Borer In Sorghum : జొన్న పంటకు నష్టం కలిగిస్తున్న కాండం తొలుచు పురుగు, నివారణ కోసం!

పెద్ద పురుగులు లేత గోధుమ రంగులో ఉంటాయి. 20 నుండి 25 మిల్లీ మీటర్ల రెక్కల వెడల్పు కలిగి ఉంటాయి. రాత్రి వేళ్లల్లో చురుకుగా ఉంటాయి. పగటి సమయంలో మొక్కల పై నిద్రిస్తాయి. వేడి, అధిక తేమ కలిగిన వాతావరణం వీటికి అనుకూలంగా ఉంటుంది.

Stem Borer In Sorghum : జొన్న పంటకు నష్టం కలిగిస్తున్న కాండం తొలుచు పురుగు,  నివారణ కోసం!

Sorghum Insect Pests

Stem Borer In Sorghum : జొన్నపంటకు తీవ్రంగా నష్టం కలిగిస్తున్న చీడపీడల్లో కాండం తొలుచు పురుగు కూడా ఒకటి. ఇవి చిన్న గొంగళి పురుగుల్లా ఉండి ఆకులలో రంద్రాలు చేస్తాయి. పెద్ద సైజు పురగులు కాండాలపై దాడి చేసి మొక్క అంతర్గత కణజాలాన్ని తినేస్తాయి. దీంతో ఆకుల పైబాగం ఎండిపోతుంది. పెద్ద పురగులు జొన్న కంకులలో రంద్రాలు చేస్తాయి. దీని వల్ల మొక్కల ఎదుగుదల తగ్గుతుంది.

పెద్ద పురుగులు లేత గోధుమ రంగులో ఉంటాయి. 20 నుండి 25 మిల్లీ మీటర్ల రెక్కల వెడల్పు కలిగి ఉంటాయి. రాత్రి వేళ్లల్లో చురుకుగా ఉంటాయి. పగటి సమయంలో మొక్కల పై నిద్రిస్తాయి. వేడి, అధిక తేమ కలిగిన వాతావరణం వీటికి అనుకూలంగా ఉంటుంది. ఈ పురుగులను గుర్తించాలంటే పసుపు, గోధుమ రంగులో ఉండి రెక్కల చివరి అంచున నల్లటి మచ్చలను కలిగి ఉంటాయి. లద్దె పురుగు మాసిన తెలుపు రంగులో ఉండి తల గోధుమ రంగులోను శరీరంపై అనేక మచ్చలుకలిగి ఉంటాయి. ఈ పురుగు పంటను విత్తిన 30 రోజుల తరువాత నుండి పంట కోసే వరకు ఆశిస్తుంది.

నివారణ చర్యలు:

మొక్క మొదలు వరకు కోసి, పోలాన్ని లోతుగా దున్ని కొయ్యకాలను నాశనం చేయాలి.పంట మార్పిడి చేయాలి. పొలంలో అన్ని వైపులా మూడు వరుసల ట్రాప్ పంటలు వేసుకోవాలి. ఈ పురుగు నివారణ కొరకు 30-40 రోజుల లోపున కార్బోప్యూరాన్ 3జి గుళికలను 3 కేజిలు ఒక ఎకరాకు మొక్కల సుడులలో లేక మొవ్వులో వేయాలి. లేదా క్లోరాంట్ర నిలిప్రోల్ 0.3 మి.లీ. లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి 2-3 సార్లు 8-10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.