Paddy Crop : వరిపంటలో ఎండాకు తెగులు…యాజమాన్యపద్దతులు

బ్యాక్టిరియాతో కూడిన నీరు మరియు బ్యాక్టిరియా కణాలు ఉన్న ఆకులు గాలికి రాపిడి ద్వారా పొలంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. తెగులు కంకిఈనిక దశలో ఆశిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి ఆకు ఇరు పక్కల తర్వాత దశలో గోదుమ రంగు చారల రూపంలో ఏర్పడతాయి. ఇలాంటి మొక్కల నుంచి కొన్ని వెన్నులు మాత్రమే బయటకు వస్తాయి. దీని వలన వంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆగస్టు మాసంలో కురిసే వర్షాలు ఈ తెగులు రావటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

10TV Telugu News

Paddy Crop : మన దేశంలో ముఖ్యమైన ఆహార పంటల్లో వరి పంట ఒకటి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆహర పంట గా రైతులు వరిని సాగుచేస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రైతులు వరిసాగు చేపడుతున్నా తెగుళ్ళు, చీడపీడల కారణంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. నాణ్యమైన విత్తనాలు మొదలు, సస్యరక్షణ చర్యల వరకు రైతులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నప్పటికీ పంటలను ఆశిస్తున్న తెగుళ్ళు కారణంగా ప్రతి ఏటా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మారుతున్న వాతావరణ పరిస్థితులు వరి పంటపై తీవ్ర ప్రభావాన్ని, నష్టాన్ని చూపిస్తున్నాయి. ఈ పరిస్ధితి వరిలో వివిధ రకాల తెగుళ్ళు, పురుగులు వ్యాప్తికి కారణమౌతున్నాయి. వరి పంటను ఆశిస్తున్న తెగుళ్ళలో బ్యాక్టిరియా ఎండాకు తెగులు ఒకటి. వాతావరణ పరిస్థితులకారణంగా ఇది ఎక్కువగా ఆశించే ఆస్కారం ఉంటుంది. వరి పంటకు బ్యాక్టిరియా ఎండాకు తెగులు అనేది దుబ్బు దశ నుంచి చిరుపోట్ట దశ వరకు ఆశించవచ్చును. నారుమడి నుంచి చిరు పొట్ట దశ వరకు ఏ దశలో నైనా ఇది ఆశించే అవకాశం ఉంది.

నారుమడి దశలో తెగులు పోకితే ఆకుల చివర్ల నుండి క్రింద వరకు ఆకులు రెండు ప్రక్కల నీటి మచ్చులు ఏర్పడటం క్రమేణ పసుపు రంగులోకి మారటం చూడవచ్చు. దీనినే క్రెసెక్‌ దశగా పిలుస్తారు. పొలంలో నారు నాటిన తర్వాత పిలక దశలో ఆశించినట్లయితే ఆకులపై పసుపురంగు మచ్చులు ఆకులపై నుండి క్రింది వరకు ఏర్పడతాయి. ఈ తెగులు ప్రధాన లక్షణం ఉదయం సమయంలో ఎండ తీవ్రత పెరిగే ముందు తెగులు పోకిన ఆకుల నుండి పసుపురంగు జిగురు ఆకులపైన కనిపిస్తుంది. ఎండకు జిగురు గట్టిపడి క్రమేపి చిన్న చిన్న ఉండలుగా పలుకులుగా మారుతాయి.

బ్యాక్టిరియాతో కూడిన నీరు మరియు బ్యాక్టిరియా కణాలు ఉన్న ఆకులు గాలికి రాపిడి ద్వారా పొలంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. తెగులు కంకిఈనిక దశలో ఆశిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి ఆకు ఇరు పక్కల తర్వాత దశలో గోదుమ రంగు చారల రూపంలో ఏర్పడతాయి. ఇలాంటి మొక్కల నుంచి కొన్ని వెన్నులు మాత్రమే బయటకు వస్తాయి. దీని వలన వంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆగస్టు మాసంలో కురిసే వర్షాలు ఈ తెగులు రావటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

వరి పంటను ఎండాకు తెగులు ఆశించకుండా రైతులు ముందస్తుగా జాగ్రత్తలు పాటించటం అవసరం. ఇందుకోసం తెగులును తట్టుకునే వరి వంగడాలను ఎంచుకోవటం మంచిది. పొలంలో తెగుళ్ళ లక్షణాలు గమనిస్తూ నిత్యం గమనిస్తూ ఉండాలి. తొలి దశలో ఎండాకు తెగులు క్షణాలు గమనిస్తే నత్రజని ఎరువుల వాడకం తాత్కాలికంగా అపేయాలి. మురుగునీరు పోయే సౌకర్యం ఉండే విధంగా చూసుకోవాలి. తెగులు వచ్చిన పొలంలో నీటిని పక్క పొలాల్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. అలా వెళితే పక్కపొలంలోకి ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది.

తెగులు దుబ్బు కట్టే దశ నుంచి చిరుపొట్ట దశలో ఆశించినట్లయితే కాపర్‌ ఆక్సి క్లోరైడ్‌ (సిఒసి) 3 గ్రాములు+ 0.4 గ్రాములు ప్లాంటామైసిన్‌ లేదా 0.2 గ్రాములు ప్లాంటామైసిన్‌ లేదా, పోషామైసిన్‌ మందును పొలంలో మురుగు నీరు తీసివేసి పీచికారి చేయాలి. సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి వరి పంటను ఎండాకు తెగులనుండి కాపాడుకోవచ్చు.