Black Grain Cultivation : వరి మాగణుల్లో సాగు చేసేందుకు అనువైన మినుము రకాలు ఇవే!

వరి మాగాణాల్లో మినుము సాగుకోసం విత్తనాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. సాగుకు అనువైన రకాలను రైతులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

Black Grain Cultivation : వరి మాగణుల్లో సాగు చేసేందుకు అనువైన మినుము రకాలు ఇవే!

black grain Cultivation

Black Grain Cultivation : రబీకాలంలో మినుమును వరి మాగాణుల్లో పండించేందుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తుంటారు. వరి కోయడానికి 2 రోజుల ముందుగా మినుము విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ విధంగా చల్లిని విత్తన౦ మొలిచి భూమిలోని మిగిలిన తేమని, సారాన్నిఉపయోగించుకొని పెరుగుతుంది. వరి మాగాణుల్లో నవంబర్, డిసెంబర్‌ నేలల్లో మినుము పంటను వేసుకోవాలి. ఈ పద్ధతిలో భూమిని దుక్కి చేయడం, ఎరువులు వేయడం వంటివి చేయరాదు. అధిక మోతాదులో విత్తనాన్ని వాడాలి. వరి మాగాణాల్లో మినుము సాగుకోసం విత్తనాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. సాగుకు అనువైన రకాలను రైతులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

వరి మాగాణుల్లో సాగుకు అనువైన మినుము రకాలు ;

ఎల్. బి. జి 645: లావు పాటి పాలిష్ రకము. ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయలు నూగు లేకుండా పొడవుగా ఉండును. పంట కాలము 85-90 రోజుల వరకు ఉంటుంది. ఎకరానికి 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

ఎల్. బి. జి 17: ఇది పాలిష్ రకము. గింజలు లావుగా ఉంటాయి. బూడిద తెగులును తట్టుకుంటుంది. కాయలపై నూగు ఎక్కువగా ఉంటుంది. కొమ్మలు విస్తరించి పెరుగుతాయి. పంట కాలము 80-85 రోజులకు వస్తుంది. ఎగారకు 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

ఎల్. బి. జి 648: పాలిష్ రకము. ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయలపై నూగు కలిగి ఉంటుంది. బూడిద, ఆకు మచ్చ , మరియు త్రుప్పు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలము 90-95 రోజులకు వస్తుంది. ఎకరాకు 8 నుండి 9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

ఎల్. బి. జి 685: ఇది కూడా పాలిష్ రకము. కాయలపై నూగు తక్కువగా ఉంటుంది. కాయలు కణుపులు వద్ద కూడా కాస్తాయి. ఎండు తెగులును తట్టుకుంటుంది. పంట కాలము 85-90 రోజుల వరకు ఉంటుంది. ఎకరాకు 7 నుండి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

ఎల్. బి. జి.752: వరి మాగాణుల్లో ఆలస్యం గా విత్తుటకు అనువైన రకము. పల్లాకు తెగులును చాలా వరకు తట్టుకును పాలిష్ రకము. పంట కాలం 75-80 రోజులకు వస్తుంది. ఎకరానికి 7క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

ఎల్. బి. జి 709: పాలిష్ రకము. కాయలపై నూగు ఉంటుంది. మాగాణి భూముల్లో ఆలస్యంగా విత్తుకొనుటకు అనువైనది. పంట కాలము 80-80 రోజుల వరకు ఉంటుంది. ఎకరాకు 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

టి. బి. జి 104: పాలిష్ రకము . పల్లాకు తెగులును తట్టుకుంటుంది. అన్ని కాలాలకు అనువైన రకం. పంట కాలం 70-75 రోజుల వరకు ఉంటుంది.

ఎల్. బి. జి 787: పాలిష్ మధ్యస్థ గింజ రకము. కాయలు ప్రధాన కాండం మీద కణుపులు వద్ద కూడా వస్తాయి. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. పంట కాలము 75-80 రోజుల వరకు వస్తుంది.

పి. యు 31: సాధా రకము. కాయల మీద నూగు ఉంటుంది. పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. పంట కాలము 70-75 రోజులకు వస్తుంది.