Potash Fertilizers : పంటల అధిక దిగుబడులకోసం పొటాష్ ఎరువుల వినియోగం!
పోటాష్ ఎరువులను తగిన మోతాదులో దుక్కిలోగాని, చిరుపొట్టదశలో ఉన్నప్పుడు వేసుకోవాలి. యూరియా ఎరువుతో కలిపి వాడుకున్నప్పుడు అధిక దిగుబడి సాధ్యమౌతుంది.

Potash Fertilizers : ప్రస్తుతం రైతులు పంట దిగుబడుల కోసం నత్రజని , భాస్వరం పై వైపు మొగ్గు చూపుతున్నారు. పొటాష్ ఎరువులకు అంతప్రాధాన్యతను ఇవ్వటం లేదు. దీని వల్ల ఎరువుల వాడకంలో సమతుల్యత లోపించి దిగుబడులు తగ్గుతున్నాయి. నత్రజని మోతాదులు తగ్గించి పొటాష్ ఎరువును ఎకరాకు 25 కిలోల వరకు అన్ని పైర్లకు వాడిటం వల్ల దిగుబడులు ఆశించిన మేర పొందేందుకు అవకాశం ఉంటుంది.
పొటాష్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ;
1. పొటాష్ వాడితే గింజలు బాగా గట్టిపడి , తాలు గింజలకు తావు ఉండదు.
2. పొటాష్ మొక్కకు రోగనిరోధక శక్తినిస్తుంది. గింజ నాణ్యత వృద్ధి చెందుతుంది.
3. పొటాష్ వాడటం వల్ల చీడపీడలు నుండి కొంత వరకు మొక్క తట్టుకునే శక్తి వస్తుంది.
4. అనావృష్టి పరిస్ధితి నుండి మొక్క పొటాష్ వేయటం వల్ల తట్టుకుంటుంది.
5. పొటాష్ వాడటం వల్ల పంట నిల్వ శక్తి పెరుగుతుంది. గింజలకు గాఢమైన రంగు వస్తుంది.
6. వరిలో పొటాష్ వాడకం వల్ల వరి పెరిగి పడిపోకుండా ఉంటుంది. పొటాష్ వాడకం వల్ల పంటలలో పత్రహరితం మోతాదు పెరుగుతుంది.
7. పొటాష్ వాడకం వల్ల క్షార లవణాల వల్ల కలిగే హాని నుండి మొక్కతట్టుకుని నిలబడుతుంది.
పోటాష్ ఎరువులను తగిన మోతాదులో దుక్కిలోగాని, చిరుపొట్టదశలో ఉన్నప్పుడు వేసుకోవాలి. యూరియా ఎరువుతో కలిపి వాడుకున్నప్పుడు అధిక దిగుబడి సాధ్యమౌతుంది.