High yielding rice varieties : ఉత్తరకోస్తా జిల్లాలకు అనువైన వరివంగడాలు.. అధిక దిగుబడినిచ్చే రాగోలు వరి రకాలు

అంధ్రప్రదేశ్ లోని  ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక వాతావణ పరిస్థితులు ఉంటాయి. అందుకే వ్యవసాయంలో సమస్యాత్మక ప్రాంతాలుగా పేరుగాంచాయి. ఏటా తుఫానుల బెడదతో పంటలు ముంపుకు గురై , రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు.

High yielding rice varieties : ఉత్తరకోస్తా జిల్లాలకు అనువైన వరివంగడాలు.. అధిక దిగుబడినిచ్చే రాగోలు వరి రకాలు

High yielding rice varieties

High yielding rice varieties : తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వరి.  ఆయా ప్రాంతాల్లోని నేల స్వభావం, నీటి వసతి, చీడపీడలు ఉధృతి, విత్తనాలు వేసే కాలాన్నిబట్టి శాస్త్రవేత్తలు , పలు రకాల వరి వంగడాలను రూపొందించారు. అన్ని ప్రాంతాలకూ అన్ని రకాలూ అనువుకావు.

READ ALSO : High Yielding Rice Varieties : అధిక దిగుబడినిస్తున్న వరి రకాలు.. కె.ఎస్.పి – 6251 , ఎంటియు – 1224

ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు, నేలలు ఇతర జిల్లాలకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ముంపుకు గురయ్యే ప్రాతాలు ఎక్కువ. ఈ పరిస్థితులకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనాస్థానంలో అధిక దిగుబడినిచ్చే ప్రత్యేక వరి వంగడాలను రూపొందించారు. మరి వీటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..

అంధ్రప్రదేశ్ లోని  ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక వాతావణ పరిస్థితులు ఉంటాయి. అందుకే వ్యవసాయంలో సమస్యాత్మక ప్రాంతాలుగా పేరుగాంచాయి. ఏటా తుఫానుల బెడదతో పంటలు ముంపుకు గురై , రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు.

READ ALSO : Pest Control In Paddy : ఎడగారు వరిలో పొట్టకుళ్లు పొడ తెగులు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఈ సమస్యలనుండి అధిగమించేందుకు శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మండలం రాగోలు వ్యవసాయ పరిశోథనా స్థానం ఇప్పటికే 10 వరి రకాలను రూపొందించింది. అయితే ఇందులో 5 రకాలు మాత్రం దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందాయి. మరి వాటి గుణగణాలేంటో రాగోలు శాస్త్రవేత్త కె. మధుకూమర్ ద్వారా తెలుసుకుందాం…