Prawn Cultivation : వైట్‌గట్‌తో రొయ్యరైతు విలవిల..

వల కాలంలో సీడ్ వేసిన 25 రోజుల లోపునే వైట్ స్పాట్ వైరస్‌ వ్యాధి సోకి రొయ్యలు చనిపోతున్నాయి. నిజానికి వేసవి వనామికి మంచి సీజన్‌ అలాంటిది . కానీ వైట్‌ స్పాట్ వైరస్ సోకటంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని చెరువుల్లో ఎక్కడ చూసిన మృత్యువాత పడిన రొయ్యలే కనిపిస్తున్నాయి.

Prawn Cultivation : వైట్‌గట్‌తో రొయ్యరైతు విలవిల..

Prawn Cultivation

Prawn Cultivation : లాభాల పంటగా గుర్తింపు పొందిన వనామీ రొయ్యల సాగుకు వైట్ స్పాట్ వ్యాధి  రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేసింది..  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైట్‌ స్పాట్‌ వ్యాధి సోకి రొయ్యలు మృత్యువాత పడుతుండటంతో.. చెరువులను ఖాళీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది చాలదన్నట్లు వాతావరణ మార్పులతో చేతికి అందివచ్చిన పంట దక్కుతుందో లేదోనని ఆక్వా సాగుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

READ ALSO : Polyculture System : పాలీకల్చర్ విధానంలో రొయ్యలు, చేపల పెంపకం

రొయ్య సీడ్ లో లోపమో.. చెరువుల్లో ఉన్న నీటిలో లోపమో.. వేసే మేతలో లోపమో తెలియదు కానీ రొయ్య సీడ్ చెరువులో వేసిన 25 రోజులకే మృత్యు వాత పడుతోంది. దీంతో ఆక్వా రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. విదేశాల నుంచి వ్యాధి నిరోధకత కలిగిన తల్లి రొయ్యలను దిగుమతి చేసికొని, అన్నీ పరీక్షలు నిర్వహించి హేచరీల ద్వారా రొయ్య సీడ్ ఉత్పత్తి చేస్తున్నారు..

READ ALSO : Shrimp Cultivation : రొయ్యలకు వైరస్ ల ముప్పు.. సమయానుకూలంగా చేపట్టాల్సిన జాగ్రత్తలు

ఇన్ని జాగ్తత్తలు తీసుకున్న ఇటివల కాలంలో సీడ్ వేసిన 25 రోజుల లోపునే వైట్ స్పాట్ వైరస్‌ వ్యాధి సోకి రొయ్యలు చనిపోతున్నాయి. నిజానికి వేసవి వనామికి మంచి సీజన్‌ అలాంటిది . కానీ వైట్‌ స్పాట్ వైరస్ సోకటంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని చెరువుల్లో ఎక్కడ చూసిన మృత్యువాత పడిన రొయ్యలే కనిపిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లో హడవిడిగా రొయ్యలను పట్టుబడి చేస్తున్నారు.

READ ALSO : Shrimp farming: బయోప్లాక్ విధానంలో..సూపర్ ఇంటెన్సివ్ రొయ్యల సాగు

వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు తోడు.. నాణ్యమైన సీడ్ కొరతతో ఆక్వా రంగం అల్లాడిపోతోంది. చెరువులో నిలకడగా ఉండాల్సిన ఉష్ణోగ్రతల్లో వ్యతాసాలు రావడంతో  పీహెచ్‌ పడిపోయి వనామి రొయ్యలకు వైరస్‌, వైట్‌ గట్‌ సోకి మృత్యువాత పడుతున్నాయి. చెరువులో రొయ్యలు వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే నీటి నాణ్యత పాటించాలని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ సూచిస్తున్నారు. అలాగే రొయ్య సీడ్‌కు పీసీఆర్‌ పరీక్షలు చేసిన తర్వాతే చెరువుల్లో వేయాలంటున్నారు.